నావే నేను పట్టుకెళ్లా..సర్కార్ వి కాదు : అఖిలేశ్

18:34 - June 13, 2018

ఉత్తరప్రదేశ్ : ప్రభుత్వ భవనంలో నుంచి మార్బుల్స్‌ లాంటి విలువైన వస్తువులు తీసుకెళ్లారని నలువైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తడంతో ఉత్తరప్రదేశ్‌ మాజీ సిఎం, ఎస్పీ చీఫ్‌ అఖిలేష్‌ యాదవ్‌ స్పందించారు. భవనం లోపల తానేమి విధ్వంసానికి పాల్పడలేదని, ఎలాంటి నష్టం కలిగించలేదని చెప్పుకొచ్చారు. భవనంలో సొంత ఖర్చుతో తాను స్వయంగా తెప్పించిన వస్తువులను మాత్రమే తీసుకెళ్లినట్లు అఖిలేష్‌ చెప్పారు. వీటిని తిరిగి ఇవ్వడానికి సిద్ధమేనన్నారు. యోగి ప్రభుత్వానిది చాలా చిన్న మనసని ధ్వజమెత్తారు. ఉపఎన్నికల్లో ఓటమితో కృంగిపోయిన బిజెపి ఇలాంటి పనులు చేస్తోందని అఖిలేష్‌ మండిపడ్డారు. ఎస్పీ-బిఎస్పీ కూటమితో బిజెపికి భయం పట్టుకుందన్నారు. యూపీ గవర్నర్‌ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించడం లేదని...ఆయన లోపల ఆర్‌ఎస్‌ఎస్‌ ఆత్మ ఉందని విమర్శించారు.

Don't Miss