కొంపముంచింది వాట్సాప్ సంభాషణలేనా...

10:47 - July 15, 2017

హైదరాబాద్: టాలీవుడ్ లో డ్రగ్స్ వినియోగం కలకలం రేపుతోంది. ఇప్పటికి బయటకు వచ్చింది కొంత మంది పేర్లే... మరో లిస్ట్ తయారవుతోందనే ఎక్సైజ్ అధికారుల వ్యాఖ్యలు ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. మొబైల్ ఫోన్ బుక్, కాల్ డేటా రికార్డులు, వాట్సాప్ సంభాషణలు...డ్రగ్స్ విక్రయదారులు దర్యాప్తులో వెల్లడించిన విషయాలు... వీటితో డ్రగ్స్ కేసులో టాలీవుడ్ ప్రముఖులకు సంబంధాలున్నాయనే విషయాన్ని వెల్లడించాయి. ఎక్సైజ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారుల దర్యాప్తులో వాట్సాప్ మెసేజ్ లు కీలక సాక్ష్యంగా మారటం సంచలనం రేపింది. డ్రగ్ ముఠా సభ్యులతో తాము జరిపిన వాట్సాప్ సంభాషణలే తమ కొంప ముంచాయని ఎక్సైజ్ శాఖాధికారుల నుంచి నోటీసులు అందుకున్న వారంటున్నారు. డ్రగ్ బాగోతంలో 12 మంది టాలీవుడ్ నటీనటులతో పాటు వారి డ్రైవర్లు, పీఏలు, వారి సన్నిహితుల పాత్ర ఉందని తేలింది. ఇప్పటి వరకూ నోటీసులు అందుకున్న వ్యక్తులే కాకుండా కెల్విన్ కాల్ లిస్ట్‌లో మరో 23మంది ప్రముఖుల పేర్లు ఉన్నట్లుగా ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ గుర్తించినట్లుగా తెలుస్తోంది. అయితే ఆ 23మంది ఇంతకీ ఎవరన్న విషయం మాత్రం చెప్పలేదు.

Don't Miss