గోరింటాకు పెట్టుకున్నారా ?

15:14 - July 6, 2017

ఆషాడ మాసం వచ్చేసింది..ఈ మాసం వచ్చిదంటే చాలు ఆడవారి అరచేతుల్లో 'గోరింటాకు' మెరిసిపోతూ ఉంటుంది. ఆషాడంలో గ్రీష్మ రుతువు పూర్తి కావడంతో పాటు వర్ష రుతువు ప్రారంభం అవుతుంది. గోరింటాకు ఇష్టపడని మహిళలు చాలా అరుదుగా ఉంటారనే సంగతి తెలిసిందే. పండుగలు..శుభకార్యాల్లో మహిళలు తప్పకుండా గోరింటాకు పెట్టుకుంటారు. గ్రీష్మంలో శరీరం బాగా వేడి పెరుగుతుంది. ఆషాఢంలో మాత్రం వాతావరణం చల్లబడిపోతుంది. ఇలాంటి సమయాల్లో అనారోగ్యాలు తప్పవు. అంతేగాకుండా నిత్యం పనుల్లో ఉండే ఆడవారి చేతులు..పాదాలు పగులుతుంటాయి. ప్రధానంగా వర్షాకాలంలో ఈ సమస్య అధికంగా ఉంటుంది. అందుకు 'గోరింటాకు' చక్కటి పరిష్కారం.
గోరింటాకుకు శరీరంలో ఉండే వేడిని తీసే శక్తి ఉంది. రోగనిరోధకశక్తిని పెంచుతుంది.
గోరింటాకు ఆకులను నీళ్లు పోసి బాగా నూరి అందులో నిమ్మరసం కలుపుకోవాలి. చేతులు..కాళ్లు..పాదాల వరకు రుద్దితే మంటలు తగ్గుతాయి.
గోళ్లలో ఏర్పడే పుండ్లు, పుచ్చులు లాంటిని గోరింటాకు నయం చేస్తుంది.
గోరింటాకుని రాత్రి నానబెట్టి మరుసటి రోజు ఉదయాన్నె ఉడికించి కషాయంగా చేసి బెణికిన చోట, చిన్న చిన్న గాయాలు ఏర్పడ్డ భాగంలో పెట్టుకుంటే తొందరగా ఉపశమనం కలుగుతుంది.
మార్కెట్‌లో దొరికే కోక్, పౌడర్లకంటే గోరింటాకు చెట్టు నుంచే ఆకులు తెంపుకొని పెట్టుకునేందుకు ప్రయత్నించండి.

Don't Miss