అణువిద్యుత్ కేంద్రాలతో ప్రమాదం

21:01 - April 26, 2017

31ఏళ్లు గడిచాయి నేటికీ ఆ విషాదపు ఆనవాళ్లు పచ్చిగానే ఉన్నాయి. అణువిద్యుత్ కేంద్రాలు ఎంతటి విధ్వంసాన్ని సృష్టించగలవో కళ్లకు కట్టింది. ఆ ప్రదేశంలో మరో 20వేల ఏళ్లకు కానీ మనిషనేవాడు బతికలేడని తేల్చింది. అయినా బుద్ది రావటం లేదు. పాఠాలు నేర్చుకోవటం లేదు. ఇంకా పక్కలో బాంబు పెట్టుకుని మురిసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఈ పరుగులో భారత్ మరింత దూకుడుగా వ్యవహరిస్తోంది. అణు విద్యుత్ కేంద్రాలతో పొంచి ఉన్న ప్రమాదాలకు అతిపెద్ద ఉదాహరణగా నిలిచిన చెర్నోబిల్ ఘటనకు ముప్ఫైఒక్క ఏళ్లయిన సందర్భంగా ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం. చెర్నోబిల్ అణు ప్రమాద దుర్ఘటనకు ముప్ఫైఒక్క ఏళ్లు. అయినా.. ప్రపంచానికి మాత్రం అణు ముప్పు తప్పలేదు. 2011లో ఫుకుషిమా ఘటన వణికించింది. న్యూక్లియర్ రియాక్టర్లలో అణువంత ప్రమాదం జరిగినా దాని ప్రభావం మానవాళిపై తీవ్రంగా ఉంటుంది. పట్టణాలు, నగరాలు మరుభూమిగా మారకతప్పదు. దీనికి ఉదాహరణలుగా మూడు ఘటనలు నిలుస్తున్నాయి..

 

Don't Miss