2 ప్రసంగాలు..అనేక ప్రస్నలు..

21:30 - January 2, 2017

నవంబర్8 నుంచి డిసెంబర్ 31 వరకు..రెండు ప్రసంగాలు.. 50 రోజులు.. అంతులేని గందరగోళం.. కోట్లాది ప్రజలకు నానా కష్టాలు.. కనీసం ఇప్పటికైనా కష్టాలు తీరతాయా అని ఆశపడ్డారు. కానీ, అసలు విషయం తప్ప పైపై మాటలు చాలా చెప్పి దాటవేశారనే విమర్శలు. అంటే పరిస్థితి ఇప్పట్లో మారే అవకాశం లేదా? ఈ సమస్య ఎటు తీసుకెళ్లనుంది? ఇదే అంశంపై ఈ రోజు వైడాంగిల్ స్టోరీ చూద్దాం.. నోట్ల రద్దు నిర్ణయంతో దేశంలో నెలకొన్న పరిస్థితుల పైన జాతిని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోడీ అసలు సమస్యల పైన దాటవేత ధోరణి అవలంభించారా... అంటే, అవునే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ప్రధాని మోడీ రైతులకు, పేదలకు అనేక వరాలు ప్రకటించారు. అయితే, అదే సమయంలో దాటవేత ధోరణి కూడా అవలంభించారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. మాటలు చెప్పి దాటేయాలని ప్రయత్నించారా? కృతజ్ఞతలు, బెదిరింపులు తప్ప వాస్తవంలో చెప్పిందేం లేదా? 50 రోజులుగా నోట్ల కష్టాలు అనుభవిస్తున్న ప్రజలకు ఇప్పట్లో ఉపశమనం లేదా? చిన్నా చితకా హామీలతో సమస్యను దాటేయాలని ప్రయత్నిస్తున్నారా? ఈ నోట్లరద్దు గండం గట్టేక్కేదెలా? ఇకముందు కూడా కొనసాగవలసిందేనా? ప్రధాని గొప్ప నిర్ణయం తీసుకున్నారనే అనుకుందాం... మరి ప్రజల కష్టాలు ఎంత కాలం? దీనికి సమాధానం కావాలి కదా.. డిజిటల్ ఎకానమీగా మారే అవకాశాలు సమీప భవిష్యత్తులో కనిపించని సమయంలో ఈ నోట్లరద్దు గండం గట్టేక్కేదెలా? నవంబర్ 8నుంచి డిసెంబర్ 31 వరకు సాగిన గందరగోళం.. ఇకముందు కూడా కొనసాగవలసిందేనా?గర్భిణులకు ఎకౌంట్ లో సొమ్ము... రైతుల రుణాలు, హౌస్ లోన్ వడ్డీ తగ్గింపు.. ఇవన్నీ మామూలు సందర్భంలో చెబితే అది వేరే సంగతి.. కానీ, దేశమంతా కరెన్సీ నోట్ల సర్జికల్ స్ట్రైక్ లో విలవిల్లాడుతూ ఉన్నపుడు, ప్రధాని ఏం చెప్తారా అని ఆశగా చూస్తున్నపుడు చెప్పిన హామీలివి? దీన్ని ఎలా అర్ధం చేసుకోవాలి.. ప్రజలేం ఆశిస్తున్నారు..బడ్జెట్ లో చెప్పాల్సిన కేటాయింపులు ప్రధాని మీటింగ్ లో వచ్చేశాయి. నోట్ల రద్దు గురించి చెప్పాల్సిన వివరాలు మాత్రం రాలేదా? మోడీ వ్యూహం విఫలమయిందా? అందుకే ఏ ప్రస్తావనా తీసుకురాలేదా? ప్రజల ఇబ్బందుల్ని అందుకే ప్రస్తావించలేదా? ప్రధాని స్పీచ్ ఇదే అంశాలను తెలియజేస్తోందా? దేశం పడుతున్న ఇబ్బందులను గుర్తించి మాట్లాడాల్సిన ప్రధాని ఆ అంశం గురించి పూర్తిగా విస్మరించటంపై సామాన్య ప్రజలనుంచి అనేక విమర్శలు వినిపిస్తున్నాయి.

Don't Miss