జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు

20:31 - July 31, 2017

ప్రకృతి సహకారం లేదు.. సరే..ప్రభుత్వం ఏం చేస్తోంది..?ఈ దేశ పౌరులుగా కనీస రక్షణలను పొందాల్సిన పౌరులను గాలికొదిలేసిన ఏలికలు దశాబ్దాలుగా సాధించిందేమిటి? ఇన్ని వేల మంది చనిపోతే చీమకుట్టినట్టుగా కూడా అనిపించని సర్కారీ పెద్దలకు మెలకువ ఎప్పుడొస్తుంది? ఇంకెన్ని మరణాలు రావాలి? ఇంకెన్ని గ్రామాలు నాశనం కావాలి? ఉద్ధానం ప్రశ్నిస్తోంది..! సమాధానం కోసం డిమాండ్ చేస్తోంది..!! ఇదే ఈ రోజు వైడాంగిల్ స్టోరీ..ఆ గ్రామాల్లో ఏం జరుగుతోంది? జనాలు పిట్టల్లా ఎందుకు రాలిపోతున్నారు? కారణాలు ఎందుకు తెలియటం లేదు?ప్రకృతి క్రూరంగా చూస్తోంది. సర్కారు నిర్లక్ష్యం చూపుతోంది. వెరసి ఉద్ధానం ప్రాంతమంతా విలవిల్లాడుతోంది. రోగాల బారిన ప్రజలతో, వేలాది మరణాలతో స్మశాన దృశ్యం కనిపిస్తోంది. మరి దీనికి పరిష్కారం లేదా? ప్రభుత్వాలు పట్టించుకోవా? ఏళ్లు గడుస్తున్నాయి.. కానీ, సమస్యలో మార్పు లేదు.. మూడు దశాబ్దాలుగా ముప్పుతిప్పలు పెడుతోంది.. వేలాదిమందిని పొట్టన పెట్టుకుంది. ఎన్నో గ్రామాలు.. వేలాది జీవితాలు అతలాకుతలమవుతున్నాయి. ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్, రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి.. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు..వరుసగా సిఎంలు మారుతున్నారు .. కానీ, వాళ్ళిచ్చిన హామీ నెరవేరడం లేదు.. ఇక్కడి ప్రజల తలరాత మారటం లేదు. ఎన్నికలొస్తాయి.. హామీలు కుమ్మరిస్తారు..మీటింగుల్లో చెమటోడుస్తారు.. వరాల జల్లులు కురిపిస్తారు..అధికారంలోకి వచ్చాక మొహం చాటేస్తారు.. గట్టిగా అడిగితే నాలుగు మాటలు చెప్పి కాలం గడిపేస్తారు.. ఇంతకుమించి ఉద్ధానానికి ఒరిగిందేమిటి...మరింత సమాచారం కోసం వీడియో చూడండి.

 

 

Don't Miss