సరోగసీకి అడ్డాగా భాగ్యనగరం

20:39 - June 19, 2017

నిబంధనలు తుంగలో తొక్కుతున్నారు.. సైలెంట్ గా దందా సాగిస్తున్నారు. పిల్లలు లేని వారి ఆ కొరతను తీర్చే అపురూపమైన అవకాశాన్ని వ్యాపారంగా మార్చి.. పేద మహిళల జీవితాలతో ఆడుకుంటున్నారు. ఇన్ ఫెర్టిలిటీ సెంటర్ల మాటున జరుగుతున్న ఈ వ్యాపారానికి చెక్ పడేదెప్పుడు? సంతాన సాఫల్య కేంద్రాలు, బ్రోకర్ల ఆటకట్టించేదెప్పుడు? ఈ అంశంపై ప్రత్యేక కథనం..సరోగసీతో పిల్లల్ని కనండి తప్పులేదు. కానీ, వ్యాపారంగా మాత్రం కాదు.. మీ ఫీజు తీసుకోండి కానీ, లక్షలకు లక్షలు కొల్లగొడుతూ, అభాగ్యుల ఆరోగ్యాలతో మాత్రం ఆడుకోకండి.. ఇదీ చట్టం చెప్తున్న విషయం. మరి భాగ్యనగరంలో సరోగసీ ఏ రూపంలోకి మారింది?

అంగట్లో అమ్మతనం..
అంగట్లో అమ్మతనం అమ్ముడుపోతోందా? సరోగసీకి అడ్డాగా భాగ్యనగరం నిలుస్తోందా? అడ్డ గోలుగా సరోగసీ కేంద్రాలు నిర్వహిస్తూ అక్ర మార్జనకు కొన్ని ఆసుపత్రులు తెరదీశాయా? ఎంత వసూలు చేస్తున్నారు? ఎంత వెనకేసుకుంటున్నారు? సరోగసీ చట్టం ఏం చెప్తోంది? అమ్మతనం వ్యాపారం అయింది. నవమాసాలు మోసే తల్లి గర్భం వ్యాపారానికి పెట్టుబడి అవుతోంది. పేద మహిళలకు ఇది శాపంగా మారుతోంది. కేవలం 9నెలలు కళ్లు మూసుకుంటే లక్షలొస్తాయని ఆశపెట్టి ఇందులోకి దించుతున్నారు బ్రోకర్లు. బిడ్డల భవిష్యత్తు కోసం కొందరు, తమ బతుకులు మారతాయని మరికొందరు.. సరొగేట్‌ మదర్‌గా రెడీ అవుతున్నారు. ఆస్పత్రి ఉంది.., సరొగేట్ మందర్ ఉంది.. పిల్లలు కావలసిన దంపతులూ ఉన్నారు.. మరి సీన్ లో బ్రోకరెలా వస్తున్నాడు? సరొగేట్ మదర్ ని అక్రమంగా నిర్బంధిస్తున్నారా? ఆ తర్వాత కాంప్లికేషన్స్ పట్టించుకోవటం లేదా? పిల్లలకోసం తపించేవారికి వైద్యశాస్త్రం సరొగసీ లాంటి వరాలన్ని అందించింది. కానీ, కొందరు దీన్ని వ్యాపారంగా మార్చి, అసలు లక్ష్యాన్ని దెబ్బతీస్తున్నారు. చట్టాలను కఠినంగా అమలు చేసి, మానిటరింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసినపుడే అటు పిల్లలు కావాలనుకునే తల్లిదండ్రులకు , ఇటు నిరుపేద మహిళలకు న్యాయం జరుగుతుంది. మరింత విశ్లేషణకు వీడియో క్లిక్ చేయండి.

Don't Miss