విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి భర్తను చంపిన భార్య

19:48 - September 7, 2017

పశ్చిమగోదావరి : జిల్లాలో కట్టుకున్న భర్తనే హత్య చేసింది భార్య... విషపూరిత ఇంజక్షన్‌ ఇచ్చి చంపేసింది. గతనెల 29న దేవరపల్లి మండలం నిర్మలగిరిలోగుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు.... మృతుడు తూర్పుగోదావరి జిల్లా ద్రాక్షారామానికి చెందిన చేగొండి భీమశంకరంగా గుర్తించారు. ఆయనకు ఈ ఏడాది మేలో జయలక్ష్మితో వివాహమైంది. అతని భార్య ద్రాక్షారామంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేస్తోంది. అదే ఆసుపత్రిలో పనిచేసే సహోద్యోగి వీరేష్‌తో ఆమెకు వివాహేతర సంబంధం ఉంది. భర్తను అడ్డు తొలగించుకునేందుకు జయలక్ష్మి ప్లాన్‌ వేసింది. చర్చికి వెళదామంటూ గత నెల 29న భర్తను గౌరీపట్నంలోని నిర్మలగిరికి తీసుకొచ్చింది. తనకు నీరసంగా ఉందని భీమశంకరం చెప్పడంతో..... ఇంజక్షన్‌ ఇస్తాను. తగ్గిపోతుందంటూ అతన్ని నమ్మించింది. కిటమిన్ అనే హైపవర్‌ డ్రగ్‌ను అతని శరీరంలోకి ఎక్కించింది. భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న జయలక్ష్మి... తన ప్రియుడితో కలిసి అక్కడి నుంచి ఉడాయించింది. అయితే జయక్ష్మి అతని భర్త నిర్మలగిరిలో ఆటో దిగడం... చర్చి లోపలకి వెళ్లడం... జయక్ష్మి ఒక్కతే తిరిగి రావడం సీసీ కెమెరాల్లో రికార్డయింది. పోలీసులు జయలక్ష్మిని, ఆమెకు సహకరించిన వీరేష్‌ను అరెస్టు చేశారు.

 

Don't Miss