గూండాల దాడి నుంచి భర్తను రక్షించిన ఇల్లాలు

20:26 - February 5, 2018

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో రౌడీయిజాన్ని అణగదొక్కడానికి పోలీసులు ఎన్‌కౌంటర్లు చేస్తున్నా వారి ఆగడాలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. లక్నోలో గూండాల నుంచి తన భర్తను రక్షించుకోవడానికి ఓ ఇల్లాలు చూపిన తెగువపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. కాకోరీ పిఎస్‌ పరిధిలో నివసిస్తున్న ఆబీద్‌ అలీని ఇంట్లో నుంచి బయటకు పిలిచారు. అనంతరం అతనిపై కర్రలతో బాదారు. ఈ దృశ్యాన్ని చూసిన ఆ ఇల్లాలు ఇంట్లో నుంచి అపర కాళిలా మారింది. ఇంట్లో నుంచి లైసెన్స్‌డ్‌ రివాల్వర్‌ తెచ్చి తన భర్తపై దాడి చేస్తున్న రౌడీలపై  కాల్పులు జరిపింది. ఆ కాల్పులకు భయపడి గూండాలు పారిపోయారు.  రివాల్వర్‌లో కాల్పులు జరిపిన ఆ మహిళ ఓ న్యాయవాది. ఈ ఘటనకు సంబంధించిన విజువల్స్‌ సిసిటివీలో రికార్డ్‌ అయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని ఆబిద్‌ దంపతులు ఆరోపించారు. 

 

Don't Miss