మహా'సిరి' ఉసిరి

11:36 - November 8, 2017

చలికాలంలో విరివిగా లభించే ఉసిరి సర్వరోగ నివారిణి అంటారు మన పెద్దలు..అదీకాక కార్తిక మాసంలో ఉసిరి తినడం తప్పనిసరి అంటారు కూడా. ఏదెలా ఉన్నా ఉసిరి ఆధ్యాత్మికంగానే కాకుండా ఆరోగ్య పరంగా కూడా మహా‘సిరి’. ఉసిరిలో విటన్ సి ఎక్కువగా ఉంటుంది.

వందగ్రా. ఉసిరిలో 80 శాతం నీరూ కొద్దిపాళ్లలో ప్రొటీన్లూ, పిండిపదార్థాలూ పీచూ లభిస్తాయి. 478మి.గ్రా. సి-విటమిన్‌ లభ్యమవుతుంది. ఎంబ్లికానిన్‌-ఎ, ఎంబ్లికానిన్‌-బి, ప్యునిగ్లుకానన్‌ వంటి పాలీఫినాల్సూ, ఎలాజిక్‌, గాలిక్‌ ఆమ్లం... వంటి ఫ్లేవనాయిడ్లూ పుష్కలంగా ఉంటాయి. కాల్షియం, ఐరన్‌, ఫాస్ఫరస్‌, పొటాషియం...

ఉదయాన్నే ఖాళీకడుపుతో ఉసిరి పొడిని తీసుకోవడంవల్ల దీర్ఘకాలిక దగ్గు, అలర్జీ, ఆస్తమా, టీబీ వంటివన్నీ తగ్గుముఖం పడతాయి.

వీర్యసమృద్ధికీ ఉసిరి ఎంతగానో తోడ్పడతుందట.

తిన్నది వంటబట్టేలా చేయడంలో దీన్ని మించింది లేదు. ఎండు ఉసిరి జీర్ణసంబంధమైన అన్ని సమస్యల్నీ నివారిస్తుంది. ఇది జీవక్రియను పెంచుతుంది. భోజనం తరవాత ఇది తింటే ఎంతో మేలు.

వేసవిలో ఉసిరి తినడంవల్ల చలువ చేస్తుంది.

కాలేయవ్యాధులకు ఉసిరి అద్భుతమైన మందు. శరీరంలోని విషతుల్యాలలను తొలగిస్తుంది.

నాడుల్ని బలోపేతం చేయడం ద్వారా మెదడుపనితీరుని మెరుగుపరుస్తుంది. ఉసిరి తీసుకోవడంవల్ల జ్ఞాపకశక్తీ, తెలివితేటలూ పెరుగుతాయట.

రుతుసమస్యల్ని తొలగించి సంతానోత్పత్తి సామర్థ్యాన్నీ పెంచుతుంది.

కఫదోషాల్ని నివారించడం ద్వారా వూపిరితిత్తుల సమస్యల్ని తగ్గిస్తుంది. ఉసిరి మలబద్ధకానికీ మంచి మందే.

ఉసిరిముద్దని తలకి పట్టించి స్నానం చేస్తే కళ్లమంటలు తగ్గుతాయట.

ఇది కంటిచూపును మెరుగుపరుస్తుంది. వంటి ఖనిజాలూ ఉసిరిలో దొరుకుతాయి.

Don't Miss