జగన్ బెయిల్ పిటిషన్ పై తీర్పు28 కి వాయిదా
16:41 - April 21, 2017
హైదరాబాద్: అక్రమాస్తుల కేసులో సాక్షులను ప్రభావితం చేసేలా ప్రవర్తిస్తున్నారని పేర్కొంటూ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలని సీబీఐ అధికారులు సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై ఈ రోజు విచారణ జరిపిన న్యాయస్థానం వాదనలు విని, ఈ నెల 28కి తీర్పును వాయిదా వేసింది. అయితే, మరోవైపు న్యూజిలాండ్ వెళ్లేందుకు తనకు అనుమతి ఇవ్వాలని సీబీఐ కోర్టులో జగన్ పిటిషన్ వేశారు. మే 15 నుంచి జూన్ 15 మధ్య 15 రోజులు వెళ్లేందుకు ఆయన అనుమతి కోరారు. వేసవి సెలవుల నిమిత్తం కుటుంబంతో కలిసి వెళ్లాలని జగన్ పిటిషన్ లో పేర్కొన్నారు. అయితే, దీనిపై విచారించిన కోర్టు పలు అభ్యంతరాలు తెలుపుతూ తమ నిర్ణయం ఈ నెల 28న తెలుపుతామని చెప్పింది.