ఇక వైసీపీ వంతు..అత్యవసర భేటీ...

18:09 - February 12, 2018

నెల్లూరు : ఏపీకి విభజన హామీలు అమలుపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన వారే పలు వ్యాఖ్యలు చేస్తుండడం..పవన్ ఇందులో జోక్యం చేసుకున్న సంగతి తెలిసిందే. బీజేపీతో పొత్తు కారణంగా వైసీపీ ఎలాంటి వ్యాఖ్యలు చేయడం లేదని..కేంద్ర బడ్జెట్ లో కూడా వైసీపీ అధినేత జగన్ స్పందించడం లేదని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.

తాజాగా పాదయాత్రలో ఉన్న జగన్ అత్యవసర భేటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆయన పాదయాత్ర నెల్లూరు జిల్లాలోని కలిగిరి మండలం పెద్దకొండూరుకు చేరుకుంది. వైసీపీ ఎంపీలు..ముఖ్య నేతలు..అందుబాటులో ఉన్న నేతలు సమావేశంలో పాల్గొననున్నారు. ప్రత్యేక హోదా కోసం ఎలాంటి పోరాటం చేయాలి ? కేంద్రంపై వత్తిడి ఎలా తేవాలనే దానిపై చర్చించనున్నారు. అంతేగాకుండా రాష్ట్రంలో జరుగుతున్న తాజా రాజకీయ పరిణామాలు...కేంద్ర బడ్జెట్ లో రాష్ట్రానికి జరిగిన కేటాయింపులపై చర్చించనున్నారు. 

Don't Miss