కడప దాటిన 'యాత్ర'ఫస్ట్ లుక్..

14:55 - April 7, 2018

సినిమా పరిశ్రమలో ప్రస్తుతం బయోపిక్ ల హవా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రముఖుల బయోపిక్ లతో వచ్చిన సినిమాలు కాసుల వర్షం కురిపించాయి. ఈ నేపథ్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖర్ రెడ్డి జీవితకథను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు 'యాత్ర' అనే టైటిల్ ను ఖరారు చేసిన విషయం కూడా తెలిసిందే. ఈ సందర్భంగా 'యాత్ర' ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. రాజశేఖర్ ను మరిపించేలా వున్న ప్రముఖ నటుడు ముమ్ముట్టి పోస్టర్ రిలీజ్ అయ్యింది..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' ..
మహి వి రాఘవ్ దర్శకత్వంలో దివంగత నేత వైఎస్. రాజశేఖర్ రెడ్డి బయోపిక్ 'యాత్ర' నుండి ఫస్ట్ లుక్ పోస్టర్ ని వదిలారు. ఈ సినిమాలో వైఎస్ఆర్ పాత్రలో నటిస్తున్న మమ్ముట్టి వైఎస్ లాగా చేయి ఊపుతూ కనిపిస్తున్న పోస్టర్ లో 'కడప దాటి ప్రతి గడపలోకి వస్తున్నాను.. మీతో కలిసి నడవాలనుంది.. మీ గుండె చప్పుడు వినాలనుంది.. ' అనే వ్యాఖ్యలతో పోస్టర్‌ను రిలీజ్ చేశారు. విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 9 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. మరి అన్ని బయోపిక్స్ లా యాత్ర సినీ అభిమానులను అలరిస్తుందా? లేదా అనే అంశాన్ని వెండితెరపై చూడాల్సిందే.

 

Don't Miss