మేకపాటి హెల్త్ పై టెన్షన్...

16:10 - April 7, 2018

ఢిల్లీ : వైసీపీ ఎంపీల దీక్ష కొనసాగుతోంది. వైసీపీ ఎంపీ మేకపాటి ఆరోగ్యంపై టెన్షన్ వాతావరణం నెలకొంటోంది. ఆయన ఆరోగ్య పరిస్థితి అంతగా బాగలేకపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఏపీకి ప్రత్యేక హోదా..రాష్ట్ర విభజన హామీలు అమలు చేయాలంటూ రాజీనామా చేసిన ఐదుగురు వైసీపీ ఎంపీలు ఆంధ్రా భవన్ వద్ద ఆమరణ దీక్షలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుండి వీరు దీక్షలు కొనసాగిస్తున్నారు. 75 సంవత్సరాలున్న వైసీపీ ఎంపీ మేకపాటి దీక్షపై అనుమానాలు నెలకొన్నాయి. కానీ ఆయన కూడా దీక్షలో పాల్గొన్నారు. శనివారం ఆయన ఆరోగ్యంలో మార్పులు చోటు చేసుకున్నాయి. ఉదయం నుండి మేకపాటి నీరసంగా కనిపించారు. తీవ్రమైన తలనొప్పి..హై బీపీతో బాధ పడుతున్నారు. వాంతులు కూడా చేసుకోవడంతో ఆర్ఎంఎల్ వైద్యులు అక్కడకు చేరుకుని రెండు సార్లు పరీక్షలు నిర్వహించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దీక్ష చేయడం మంచిది కాదని వైద్యులు సూచించారు. వైద్యుల సూచనల మేరకు పోలీసులు ఆయన్ను ఆర్ఎంఎల్ ఆసుపత్రికి తరలించారు. కానీ దీక్ష చేస్తానని మేకపాటి పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం మెరుగుపడాలని వైసీపీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఆకాంక్షిస్తున్నారు. 

Don't Miss