44 ఫోర్లు..23 సిక్సర్లు..

12:41 - December 26, 2016

కోల్ కతా : విధ్వంకర బ్యాటింగ్ ఎప్పుడైనా చూశారా ? టీ20, ఇతర వన్డేల్లో చూస్తూనే ఉంటాం అని అంటారు కదా..కానీ ఇతను చేసిన బ్యాటింగ్ చూసి ఉండరు. ఎందుకంటే ఆకాశామే హద్దు అన్నట్లు బంతిని బాదాడు. ఏకంగా 44 ఫోర్లు..23 సిక్సర్లు సాధించాడంటే అతను బ్యాటింగ్ ఎలా చేశాడో అర్థం చేసుకోవచ్చు. క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ బెంగాల్ ఫస్ట్ డివిజన్ మూడు రోజుల టోర్నమెంట్ జరుగుతోంది. బారిషా క్లబ్ తో దక్షిణ్ కాలికటా సంసాద్ తలపడింది. బారిషా క్లబ్ తరపున పంకజ్ షా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇతను సెంచరీతో సత్తా చాటాడు. విధ్వంసకర బ్యాటింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఆదివారం 44 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో ఇన్నింగ్స్ కొనసాగించిన పంకజ్ చెలరేగిపోయాడు. 44 ఫోర్లు..23 సిక్సర్లతో 413 పరుగులు పూర్తి చేసి నాటౌట్ గా మిగిలాడు. 192/2 ఓవర్ నైట్ స్కోరు తో ఇన్నింగ్స్ ఆరంభించిన బారిషా క్లబ్ జట్టు 708/8 వద్ద డిక్లేర్డ్ చేసింది. గత సీజన్ లో రాజస్థాన్ తో మ్యాచ్ సందర్భంగా రంజీల్లో పంకజ్ అరంగ్రేటం చేశాడు. బెంగాల్ తరపున ఇప్పటి వరకు 12 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడాడు.

Don't Miss