కరుణ్ నాయర్ ట్రిపుల్ సెంచరీ..

16:45 - December 19, 2016

తమిళనాడు : చెన్నై టెస్ట్‌లో టీమిండియా మరో  రికార్డ్‌ బద్దలు కొట్టింది. చెపాక్‌లో కరుణ్‌ నాయర్‌ త్రిబుల్‌ సెంచరీతో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసింది. టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో టాప్‌ టెన్‌లో టీమిండియా చోటు దక్కించుకుంది. 
టీమిండియా రికార్డ్‌ల మోత 
టెస్టుల్లో తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శిస్తోన్న టీమిండియా చెన్నై టెస్ట్‌లో రికార్డ్‌ల మోత మోగించింది. చెపాక్‌లో కరుణ్‌ నాయర్‌ త్రిబుల్‌ సెంచరీతో టీమిండియా టెస్టుల్లో అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసింది.
2009లో భారత జట్టు 726 పరుగులు  
2009లో ముంబై వేదికగా శ్రీలంకతో జరిగిన టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో భారత జట్టు 726 పరుగులు నమోదు చేసింది.దాదాపు 8ఏళ్ల తర్వాత 726 పరుగుల మార్క్‌ను భారత్‌ అధిగమించింది. కరుణ్‌ నాయర్‌ అంచనాలకు మించి అదరగొట్టడంతో భారత్‌ అనూహ్యంగా అత్యుత్తమ ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేయగలిగింది. ట్రిపుల్‌ సెంచరీతో రికార్డ్‌ల మోత మోగించిన కరుణ్‌ నాయర్‌...భారత్‌ను పోటీలో నిలపడం మాత్రమే కాదు 700 పరుగుల మార్క్‌ దాటడంలో కీలక పాత్ర పోషించాడు.
చెన్నె టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 759 పరుగులు 
చెన్నె టెస్ట్‌ రెండో ఇన్నింగ్స్‌లో 759 పరుగులకు ఇన్నింగ్స్‌ డిక్లేర్‌ చేసిన భారత్‌ జట్టు...టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో టాప్‌ టెన్‌లో చోటు దక్కించుకుంది.ఓవరాల్‌గా  టెస్టుల్లో అత్యధిక ఇన్నింగ్స్‌ స్కోర్‌ నమోదు చేసిన జట్ల జాబితాలో భారత్‌ ప్రస్తుతం 7వ స్థానానికి చేరుకుంది. 
టెస్టులు...700 పరుగుల మార్క్‌.. 4వ సారి  
ఇదే ఇన్నింగ్స్‌లో 666 పరుగుల మార్క్‌ దాటి.... చెపాక్‌లో అత్యధిక ఇన్నింగ్స్‌ టోటల్‌  స్కోర్‌ చేసిన జట్టుగా భారత్‌ రికార్డ్‌ సృష్టించింది. ఓవరాల్‌గా టెస్టుల్లో భారత జట్టు 700 పరుగుల మార్క్‌ దాటం ఇది 4వ సారి కావడం విశేషం. ప్రస్తుతం ఐసీసీ టెస్ట్‌ ర్యాంకింగ్స్‌లో టాప్‌ ప్లేస్‌లో ఉన్న టీమిండియా....ట్రెడిషనల్‌ ఫార్మాట్లో మరిన్ని ప్రపంచరికార్డ్‌లు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

 

Don't Miss