చట్టసభల్లో యువత శాతం ఎంత?..

17:37 - July 9, 2018

హైదరాబాద్ : చట్టసభల్లో యువత వాటా ఎంత? అనే అంశంపై నగరంలోని సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో రౌండ్ టేబుల్ సమావేశం కొనసాగుతోంది. యంగ్ లీడర్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో ఈసమావేశంలో నిర్వహించబడుతోంది. ఈ సమావేశానికి పలువురు యువ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు, యువసంఘాల నాయకులు పాల్గొన్నారు. పంచాయితీ నుండి పార్లమెంట్ వరకూ చట్టసభల్లో యువత శాతం పెరగాలనే సమావేశం మాట్లాడిన వక్తలు డిమాండ్ చేశారు. చట్టసభలు, ఇతర రాజ్యంగ పదవుల్లో 65 ఏళ్లకు పైబడినవారికి చట్టసభలకు పోటీ చేయకుండా రూల్ పాస్ చేయాలని..చట్టసభల్లో యువతకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని యంగ్ లీడర్ అధ్యక్షుడు రోహిత్ రెడ్డి డిమాండ్ చేశారు. అలాగే ఒక వ్యక్తికి ఒకే పదవిని రెండు సార్లకు మించి ఇవ్వకూడదని యువ నేతలు సూచించారు. యువత శాతం పెరగాలని రౌండ్ టేబుల్ లో వక్తలు పిలుపునిచ్చారు. వయసు మీరిన వారు ప్రత్యక్ష రాజకీయాలలోనుండి తప్పుకుని యువతకు అవకాశం ఇవ్వాల్సిన అవసరముందన్నారు. యువతకు వారి రాజకీయ అనుభవాలను గైడ్ చేస్తు రాజకీయ సలహా దారులుగా వ్యవహరిస్తు యువతకు దిశా నిర్ధేశంగా నిలబడాలని వక్తలు కోరారు. చట్టసభల్లో యువత వాటా ఎంత అనే అంశం తెలంగాణ నుండి ప్రారంభమై ఢిల్లీ వరకూ కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. 

Don't Miss