ప్రత్యేక హోదాకోసం పోరాటం కొనసాగిస్తాం : జగన్

21:51 - February 16, 2017

గుంటూరు : ఏపీకి ప్రత్యేక హోదాకోసం పోరాటం కొనసాగిస్తామని... వైసీపీ అధినేత జగన్‌ అన్నారు. రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని సీఎం చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారని మండిపడ్డారు.. విద్యార్థులపై పీడీ యాక్ట్‌ కింద కేసులుపెడుతున్న చంద్రబాబుపై టాడా చట్టం కింద కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. 
యువభేరీ సదస్సు
గుంటూరు నల్లపాడు రోడ్డులోని మిర్చియార్డు... విద్యార్థులు, యువతీ యువకులు, వైసీపీ నేతలతో సందడిగా మారింది. వైసీపీ చేపట్టిన యువభేరీ సదస్సులో విద్యార్థులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.. ఈ కార్యక్రమానికి హాజరైన పార్టీ అధినేత జగన్‌... ఏపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.. ఎన్ని అడ్డంకులు సృష్టించినా తమ శ్వాస, హక్కు ప్రత్యేక హోదా అని స్పష్టం చేశారు.. 
చంద్రబాబు టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారన్న జగన్‌ 
చంద్రబాబు టీడీపీని తెలుగు ద్రోహుల పార్టీగా మార్చారని జగన్‌ ఆరోపించారు.. భాగస్వామ్య సదస్సు ఎంవోయూల సంగతి కేంద్ర ఇండస్ట్రీస్‌ చాంబర్‌ ఆఫ్ కామర్స్‌లో దాఖలైన ఐఈఎమ్ లే చెబుతాయని విమర్శించారు.. కంపెనీలు పెట్టే స్థాయి లేని వ్యక్తులకు సూటు బూటు వేసి వారితో ఎంవోయూలు కుదుర్చుకున్నారని మండిపడ్డారు. సదస్సులో విద్యార్థులు, యువతీయువకులు అడిగిన ప్రశ్నలకు జగన్‌ సమాధానమిచ్చారు.

 

Don't Miss