జట్టులోకి వస్తానని డిమాండ్ చేయలేదు: డివిలియర్స్

Submitted on 12 July 2019
AB de Villiers breaks silence, says,‘did not try to force his way into South Africa’s World Cup squad’

వరల్డ్ కప్ 2019ఆరంభంలో దక్షిణాఫ్రికా జట్టులోకి మాజీ ప్లేయర్ డివిలియర్స్ జట్టులోకి తిరిగి వచ్చేందుకు తీవ్రంగా ఒత్తిడి తెచ్చాడని వార్తలు వచ్చాయి. అవన్నీ వదంతులేనని కొట్టిపడేస్తూ డివిలియర్స్ కామెంట్ చేశాడు. టోర్నీలో దక్షిణాఫ్రికా ప్రస్థానం ముగిసింది. కాబట్టి నేను మాట్లాడొచ్చనుకుంటా అని తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. 

తానెప్పుడూ జట్టులో చోటు కోసం డిమాండ్ చేయలేదని రిటైర్మెంట్ రోజునే దాని గురించి ఆలోచించానని అన్నాడు. ‘అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించిన రోజు.. పర్సనల్‌గా దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డుని ఒక్కటే అడిగాను. ప్రపంచకప్‌లో ఆడేందుకు అవకాశం దొరుకుతుందా.. అని. ఇక తర్వాత దాని గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. జట్టు‌కి అవసరమైతే రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుని వరల్డ్‌కప్ కోసం ఆడతానని ఆఫర్ ఇవ్వలేదు. నేను కేవలం రిటైర్ అవ్వాలనుకుంది కుటుంబంతో కలిసి గడపాలని. అంతేకానీ, డబ్బులు కోసం జట్టును వదిలేయాలనే స్వార్థంతో కాదు'

'వరల్డ్ కప్‌ కోసం జట్టుని మరో 2 రోజుల్లో ప్రకటించబోతుండగా కెప్టెన్ డుప్లెసిస్‌తో సరదాగా చాట్ చేశాడు. మేమిద్దరం స్కూల్ నాటి నుంచి స్నేహితులం. ఆ సమయంలో జట్టు అవసరాల గురించి చర్చ వచ్చింది. జట్టులోకి వస్తానని స్పష్టంగా చెప్పలేదు. ప్రపంచకప్‌ జట్టులోకి వచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నించాననే మాటల్లో వాస్తవం లేదు. అవన్నీ రూమర్లే’ అని డివిలియర్స్ తెలిపాడు. 

AB de Villiers
South Africa
2019 icc world cup
world cup 2019


మరిన్ని వార్తలు