తల్లిదండ్రులను పట్టించుకోకుంటే జైలుకే

Submitted on 12 June 2019
Abandoning Elderly Parents Will Now And Sons, Daughters In Jail In Bihar Cabinet decision

మీరు తల్లిదండ్రులను పట్టించుకోవడం లేదా..వారి బాగోగులు చూసుకోకుంటే మాత్రం మీకు చిప్పకూడే. అవును..నిజం..వృద్దాప్యంలో ఉన్న పేరెంట్స్ విషయంలో బీహార్ రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. వీరి సంక్షేమం పట్టించుకోకుంటే జైలుకు పంపించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నితీష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు కేబినెట్ కూడా గ్రీన్ సిగ్నల్ లభించింది. 

సమయం లేదనో..పట్టించుకోవడం వీలు కావడం లేదని..ఇతరత్రా కారణాలతో వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులను వదిలేస్తుంటారు. దీంతో వారు అక్కడే జీవితం గడపాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీనిపై సీఎం నితీష్ కుమార్ గవర్నమెంట్ దృష్టి సారించింది. పట్టించుకోని వారిని జైలుకు పంపించాలని నిర్ణయం తీసుకుంది. 

పేరెంట్స్ ని వారిని వదిలివేయడం దారుణమని..అటువంటి వారికి జైలు శిక్ష వేయడమే కరెక్టు అని కేబినెట్ నిర్ణయించింది. ఇందుకు చట్టంలో మార్పులు తీసుకురావాలని..కేసులు నమోదు చేసి జైలుకు పంపించేలా చర్యలు తీసుకోవాలని ఏకగ్రీవంగా తీర్మానించింది.

Abandoning
Parents
Sons
daughters
Jail
BIHAR
CM
Nithsh kumar
Cabinet decision

మరిన్ని వార్తలు