జాన్వితో నటిస్తానన్న విజయ్, నాకు ఓకే అన్న జాన్వి..

14:10 - November 30, 2018

ధడక్‌ సినిమాతో బాలీవుడ్‌ లోకి ఎంట్రీ ఇచ్చిన అందాల తార  శ్రీదేవి కూతురు జాన్వి కపూర్‌ తో తప్పకుండా నటిస్తానని టాలీవుడ్ సంచలన హీరో విజయ్‌ దేవరకొండ అన్నాడు. ఇటీవల బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘కాఫీ విత్‌ కరణ్‌’ షో సందర్భంగా.. ఓ రోజు ఉదయం నటుడిగా నిద్రలేచే అవకాశం వస్తే నువ్వు ఏ నటుడిగా మారాలని అనుకుంటున్నావు? ఎందుకు? అని కరణ్‌ జోహార్‌ జాన్విని ప్రశ్నించారు. దానికి సమాధానంగా.. విజయ్‌ దేవరకొండ, అతనితో కలిసి నటించాలని ఉంది అని జాన్వీ సమాధానం ఇచ్చింది.
ఈ విషయం బాలీవుడ్‌, టాలీవుడ్‌ వర్గాల్లో మారుమోగింది. దీనిగురించి విజయ్‌ దేవరకొండను ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థ ప్రశ్నించగా.. నేను కూడా జాన్వితో, కరణ్‌ జోహర్‌ తో కలిసి తర్వలోనే పని చేస్తాను అని చెప్పాడు. ఇటీవల ‘టాక్సీవాలా’ ప్రమోషన్స్‌ కోసం ముంబై వెళ్లిన విజయ్‌.. అక్కడ కరణ్‌ జోహార్‌ ను కలిసినట్టు వార్తలు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తుంటే విజయ్‌, కరణ్‌ కాంబినేషన్‌ లో ఓ సినిమా రాబోతున్నట్లు తెలుస్తోంది.
 

Don't Miss