ఈవీఎంలపై గుర్తులు కనిపించట్లేదు రాజా: పోసాని

09:23 - December 7, 2018

హైదరాబాద్ : ప్రతీ డైలాగ్ కు ముందు రాజా అంటు నవ్వులు పండించే ప్రముఖ నటుడు, రచయిత అయిన సోనాని కృష్ణ మురళి ఈ ఉదయం హైదరాబాద్ నగర పరిధిలోని ఎల్లారెడ్డి గూడ పీజేఆర్‌ కమ్యూనిటీ హాల్‌ లో ఏర్పాటుచేసిన పోలింగ్ కేంద్రానికి ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయన వచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ చేసిన ఏర్పాట్లపై నటుడు, రచయిత పోసాని కృష్ణ మురళి అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సోసాని మాట్లాడుతు..ఈవీఎంలపై ఏ గుర్తు ఎక్కడ ఉందో కనిపించడం లేదని ఆయన ఆరోపించారు. ఈవీఎంలు ఉన్నచోట వెలుతురు సరిగ్గా లేదని, అధికారులు లైట్లను అమర్చలేదని ఏ గుర్తు ఎక్కడ ఉందో సరిగ్గా కనిపించడం లేదని, దీనివల్ల వృద్ధులు, కంటి సమస్యలు ఉన్నవాళ్లు అధికంగా ఇబ్బంది పడుతున్నారని పోసాని కృష్ణమురళి ఎన్నికల ఏర్పాట్లపై అసంతృప్తి వ్యక్తంచేశారు. 
   

Don't Miss