తెలంగాణ స్పోర్ట్స్ స్కూల్‌ లో 4వ తరగతి అడ్మిషన్లు

Submitted on 26 May 2019
Admissions In Telangana State Sports School 2019

తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్‌ లో 2019-2020 విద్యా సంవత్సరానికి గాను నాలుగవ తరగతిలో ప్రవేశాల కోసం నోటిఫికేషన్ విడుదలైంది. విద్యార్ధులను చదువుతో పాటు జాతీయ, అంతర్జాతీయ స్థాయి క్రీడా కారులుగా తీర్చిదిద్దుతున్నది. ఈ పాఠశాలలో సీట్ల కొరకు ఆసక్తి కల్గిన విద్యార్థుల తల్లితండ్రులు తమ పిల్లలను చేర్పించాలని అనుకుంటున్నారా. అయితే జూన్ 19వ తేదీ లోపు మండల స్థాయిలో, జూన్ 26 నుంచి జులై 3వ తేదీ వరకు డివిజన్ స్థాయిలో, జులై 11 నుంచి 20 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికకు ప్రతిభా పరీక్షలు నిర్వహిస్తారు. ఆగస్టు మొదటి వారంలో ప్రవేశం కల్పిస్తారు. 

విద్యార్ధులు ఆటల్లోనే కాకుండా పదవ తరగతి, ఇంటర్ లో కూడా రాష్ట్ర స్థాయి ర్యాంకులు సాధించేలా చదివిస్తామని తెలిపారు. మా పాఠశాలలో చదివి ఉన్నత స్థాయిలో స్థిరపడిన పిల్లలు చాలా మంది ఉన్నారు. 2019-20 సంవత్సరానికి 120 మంది విద్యార్ధులకు  ప్రవేశాలు నిర్వహించనున్నారు. పరీక్షలు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉంటాయి. తెలంగాణ స్పోర్ట్స్ పాఠశాలలు రాష్ట్రంలో మూడు ఉన్నాయి.

1. తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ స్కూల్ - హకీంపేట
2. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ - కరీంనగర్
3. రీజినల్ స్పోర్ట్స్ స్కూల్ - అదిలాబాద్.  

దరఖాస్తు చేసుకోడానికి కావాల్సిన సర్టిఫికెట్స్ :
ప్రస్తుతం చదువుతున్న స్కూల్ నుంచి స్టడీ సర్టిఫికెట్.
* 3వ తరగతి ప్రోగ్రెస్ రిపోర్ట్.
* 10 పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.
* ఆధార్ కార్డు.
* కాస్ట్ సర్టిఫికెట్.
* డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్.

Admissions
Telangana State Sports School
2019

మరిన్ని వార్తలు