సాహస నారి :విమానంలో ఒంటరిగా అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టేసింది 

Submitted on 16 May 2019
Adventure woman..Aarohi Pandit is world's first woman to fly solo across Atlantic Ocean in Light Sport Aircraft

అన్ని రంగాల్లో మహిళలు తమదైన ముద్రను చాటుతున్నారు. సాహసాలలో కూడా తాము తక్కువ కాదని నిరూపించిన సందర్భాలు ఎన్నో. ఎన్నెన్నో. ‘నావికా సాగర్‌ పరిక్రమ’ పేరుతో  భారత నారీ శక్తి ప్రపంచ యాత్రతో సముద్రంలో  ఆరుగురు వీరనారీమణులు సాగర యాత్ర చేసి సాహసానికి ప్రతీరూపంగా నిలిచారు. ఏడు నెలల కాలంలో ప్రపంచాన్ని చుట్టువచ్చారు. 

ఇటువంటి మరో సాహసం చేసిన నారీ శక్తి చాటి చెప్పింది. భారత మహిళా పైలట్ ‘ఆరోహి పండిట్’ ఓ విమానంలో ఒంటరిగా అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టివచ్చేసి ఔరా నారీ అనిపించుకుంది. ముంబయిలోని బొరివ్లీ ప్రాంత నివాసి అయిన 23 ఏళ్ల ఆరోహి పండిట్ ‘లైట్ స్పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ సినస్ 912’లో 18 దేశాల మీదుగా 37,000 కిమీలు ప్రయాణించి సాహసానకి మారుపేరుగా నిలిచింది.
 

లైట్ ఎయిర్ క్రాఫ్ట్‌లో ప్రపంచాన్ని చుట్టి వచ్చేందుకు సెలక్ట్ అయిన  మొదటి  ఎనిమిది మంది మహిళల్లో ఆరోహీ స్థానం సంపాదించింది. తన ఫ్రెండ్ తో కలిసి ట్రైనింగ్ తీసుకుంది. 2018  జులై 30న ప్రారంభించిన ఈ  సాహసయాత్ర 10 నెలలపాటు  120 గంటలు గగనతలంలో ప్రయాణించి సోమవారం (మే 13)న కెనాడోని ఇక్లాలిట్ ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యింది. 

కాగా ఆరోహీ ప్రయాణించిన విమానం ఒకే ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ విమానానికి ఆరోహీ ‘మహీ’ అని పేరుపెట్టింది. సింగిల్ ఇంజన్ ఉండటంతో ఎమర్జన్సీ సమయంలో ల్యాండ్ అయ్యేందుకు వీలుగా బలిస్టిక్ ప్యారాచూట్ ను రెడీగా పెట్టుకుంది. స్పెషల్ శాటిలైట్ట్రాకర్, ఆధునిక ఏవియానిక్స్ కూడా ఈ విమానంలో అందుబాటగులో ఉన్నాయి. కాగా ప్రపంచంలో అట్లాంటిక్ సముద్రాన్ని చుట్టివచ్చిన తొలి మహిళా పైలట్‌గా ‘ఆరోహి పండిట్’ ఘనత సాధించింది. 

Aarohi Pandit
world's first woman
fly solo across
Atlantic Ocean
Light Sport Aircraft

మరిన్ని వార్తలు