150 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే : గురు పౌర్ణమి, చంద్రగ్రహణం

Submitted on 15 July 2019
After 150 years Guru pournami is a full moon and a lunar eclipse

ఆకాశంలో ఉండి అలరించే చందమామపైకి వెళ్లేందుకు చేపట్టిన ఇస్రో ప్రయోగం చంద్రయాన్-2 వాయిదా పడింది. అందరినీ అలరిస్తు..ఆసక్తిని రేకెత్తించే అందాల చందమామ గురించి చెప్పుకోవాలంటే ఎన్నో..వింతలు..విశేషాలకు కొదవ లేదు. అటువంటి మరో విశేషం త్వరలోనే మనల్ని కనువిందు చేయనుంది. కొన్ని దశాబ్దాల క్రితం వచ్చిన ఆ సందర్భం మరోసారి అంటే మళ్లీ 150 సంవత్సరాల తరువాత వచ్చింది. అదే గురుపౌర్ణమి, చంద్రగ్రహం కొన్ని గంటల వ్యవధిలోనే రావటం. 
Also Read : అనుకోని అవాంతరం : ఆగిన చంద్రయాన్ - 2

జులై 16న గురు పౌర్ణమి. పురాణాల ప్రకారంగా వేద వ్యాసుడిని కురుపాండవ వంశాలు గురువుగా కొలిచాయి. మహాభారతాన్ని రచించిన వ్యాసుడు జయంతికి గుర్తుగా గురు పౌర్ణమిని జరుపుకోవటం సంప్రదాయంగా వస్తోంది. గురుపౌర్ణమి రోజునే చంద్రగ్రహణం కూడా ఏర్పడుతోంది. ఇలా కొన్ని గంటల వ్యవధిలోనే గురుపౌర్ణమి, చంద్రగ్రహం ఈ  రెండు సందర్భాలు రావడం అరుదు. 1870 జూలై 12న ఒకే సమయంలో చంద్రగ్రహణం, గురు పౌర్ణమి వచ్చాయి.

మళ్లీ ఇప్పుడు 150 ఏళ్ల తర్వాత అటువంటి సందర్బం వచ్చింది. 16వ తేదీ తెల్లవారుజామున 1.30 నుంచి మొదలై సాయంత్రం 4 గంటల వరకు గురుపౌర్ణమి ఘడియలు ఉండగా..17వ తేదీ తెల్లవారుజామున 12.13 గంటలకు మొదలై 5.47 వరకు చంద్రగ్రహణం ఉంది. ఈ రెండింటికి మధ్య తేడా కేవలం 8 గంటలు. మళ్లీ చంద్రగ్రహణం 2021 మేలో వస్తుంది. 
Also Read : సిద్ధమౌతున్న జాతీయ టారిఫ్ విధానం : వేళలను బట్టి కరెంటు ఛార్జీలు

Guru pournami
lunar eclipse
150 years

మరిన్ని వార్తలు