జియో గిగాఫైబర్ ఎఫెక్ట్ : Tata Sky, BSNL బ్రాడ్ బ్యాండ్ ఆఫర్లు ఇవే

Submitted on 17 July 2019
After Jio GigaFiber free broadband offer, BSNL, Tata Sky brings its broadband service Offers

జియో మొబైల్ డేటా నెట్ వర్క్, గిగాఫైబర్ డేటా నెట్ వర్క్ సర్వీసుల దెబ్బకు ఇతర టెలికం నెట్ వర్క్ దిగ్గజాలు దిగి వస్తున్నాయి. జియో పోటీని తట్టుకోలేక భారీ డేటా ఆఫర్లతో ముందుకొస్తున్నాయి. యూజర్లంతా జియోకు మారిపోకుండా ఉండేందుకు బ్రాడ్ బ్యాండ్ ఆఫర్లతో ఊరిస్తున్నాయి. ప్రభుత్వ రంగ టెలికం సంస్థ BSNL, బ్రాడ్ క్యాస్టర్ Tata Sky కూడా బ్రాడ్ బ్యాండ్ సర్వీసులను చౌకైన ధరకే ఆఫర్ చేస్తున్నాయి. రీజియన్ల వారీగా తమ కస్టమర్లను ఆకర్షించేందుకు టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ ప్లాన్లను అప్ డేట్ చేసింది. టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ ఇంటర్నెట్ సర్వీసులను దేశంలోని 21నగరాల్లో వివిధ డేటా ప్లాన్లను యూజర్లకు ఆఫర్ చేస్తోంది. 

Tata Sky డేటా ఆఫర్లు :
అహ్మదాబాద్‌లో టాటా స్కై .. ఒక నెల, 3 నెలలు, 6 నెలలు చొప్పున రూ.590 అన్ లిమిటెడ్ డేటా ప్లాన్ అందిస్తోంది. బేసిక్ ప్లాన్ కింద 16Mbps స్పీడ్‌తో డేటా ఆఫర్ చేస్తోంది. అంతేకాదు.. ఒక రూటర్ కూడా ఉచితంగా అందిస్తోంది. డేటా రోల్ ఓవర్, సేఫ్ కస్టడీ ఆప్షన్లు కూడా ఇస్తోంది. రూ.700 ప్లాన్ తో 25mbps డేటా స్పీడ్, రూ.800 ప్లాన్ తో 50mbps స్పీడ్ డేటా ఆఫర్ చేస్తోంది. టాటా స్కై కూడా జియోకు పోటీగా రూ.1,100, రూ.1,300 అన్ లిమిటెడ్ ప్లాన్ ను 45mbps, 100mbps స్పీడ్ వరకు డౌన్ లోడ్ స్పీడ్ అందిస్తోంది. రూటర్ ఇన్ స్టాలేషన్ కూడా ఉచితంగా అందిస్తోంది. 

క్వార్టర్లీ డేటా ప్లాన్స్ :
నెలవారీ ప్లాన్లతో పాటు టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ క్వార్టర్లీ డేటా ప్లాన్లను కూడా అందిస్తోంది. ప్రారంభ డేటా ప్లాన్లు రూ.1,770, రూ.2,100, రూ.2,400తో డౌన్ లోడ్ స్పీడ్ 16mbps, 25mbps, 50mbps స్పీడ్ తో అందిస్తోంది. అదే విధంగా రూ.3,300, రూ.3,90 డేటా ప్లాన్లపై 75mbps, 100mbps డౌన్ లోడ్ స్పీడ్ ఆఫర్ చేస్తోంది. ఈ డేటా ప్లాన్లన్నీ ఫ్రీ రూటర్ సదుపాయంతో యూజర్లు పొందవచ్చు.    

9 నెలల డేటా ప్లాన్స్ :
టాటా స్కై బ్రాడ్ బ్యాండ్ అందించే 9 నెలల డేటా ప్లాన్లలో రూ.5,310పై 16mbps డేటా స్పీడ్ అందిస్తుండగా.. రూ.6,300, రూ.7,200 డేటా ప్లాన్ పై 25mbps, 50mbps డౌన్ లోడ్ స్పీడ్ తో అందిస్తోంది. అలాగే రూ.9,900, రూ.11,700 డేటా ప్లాన్లపై 75mbps, 100mbps డౌన్ లోడ్ స్పీడ్ తో టాటా స్కై ఆఫర్లు అందిస్తోంది. 

నెలవారీ డేటా ప్లాన్ : 
ముంబైలో నెలవారీ అన్ లిమిటెడ్ డేటా ప్లాన్లను టాటా స్కై అందిస్తోంది. టాటా స్కై అందించే బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో డేటా ప్లాన్ ప్రారంభ ధర రూ.999 నుంచి అందుబాటులో ఉంది. ఇతర నెలవారీ డేటా ప్లాన్లలో రూ.1,549, రూ.1,599లపై 50mbps, 100mbps డౌన్ లోడ్ స్పీడ్ తో అందిస్తోంది. 

BSNL ఫ్రీ ట్రయల్ ఆఫర్ : 
జియో గిగాఫైబర్ అందించే ప్రివ్యూ ఆఫర్ మాదిరిగా BSNL కూడా బ్రాడ్ బ్యాండ్ సర్వీసులో ఫ్రీ ట్రయల్ ఆఫర్ అందిస్తోంది. గిగాఫైబర్ ఆఫర్ లో నెలకు 100GB డేటా అందిస్తుండగా.. BSNL రోజుకు 5GB డేటా ఆఫర్ చేస్తోంది. నెలపాటు వ్యాలిడెటీ ఉండే ఈ ఆఫర్ ను కస్టమర్ నెలలో 270GB వరకు డేటా పొందవచ్చు. గిగాఫైబర్ అన్ లిమిటెడ్ వ్యాలెడిటీ అందిస్తుండగా.. BSLN ప్లాన్ మాత్రం యాక్టివేషన్ నుంచి నెలవరకే అందిస్తోంది. గరిష్టంగా డేటా స్పీడ్ 10mbps వరకు పొందవచ్చు. 

BSNL వినియోగదారుల్లో ఎవరికి ల్యాండ్ లైన్ కనెక్షన్ ఉందో వారికి కూడా బ్రాండ్ బ్యాండ్ సేవలను అందించాలని భావిస్తోంది. ఈ ఆఫర్ ను పూర్తి ఉచితంగా అందించాలని చూస్తోంది. నెలవారీ ఛార్జీలు, సెక్యూరిటీ డిపాజిట్ లేకుండానే యూజర్లకు ఆఫర్ అందించాలని BSNL ప్లాన్ చేస్తోంది.  

జియో గిగాఫైబర్ సర్వీసు ద్వారా యూజర్లకు ప్రివ్యూ ఆఫర్ కింద అన్ని కూపన్లతో కలిపి 100Mbps స్పీడ్ అందిస్తోంది. అంటే.. కనీసం 50Mbps స్పీడ్‌తో పాటు డేటా కోటా కింద యూజర్ నెలకు 1100GB డేటాను పొందవచ్చు. బేస్ ప్లాన్ కింద నెలకు రూ.600కే డేటా సర్వీసు యాక్సస్ చేసుకోవచ్చు. కాంప్లిమెంటరీ జియో హోమ్ టీవీ సర్వీసు ద్వారా ఉచితంగా 600 టీవీ ఛానళ్లను స్ట్రీమింగ్ చేసుకోవచ్చు.

Jio GigaFiber
 free broadband offer
BSNL
Tata Sky
broadband service Offers

మరిన్ని వార్తలు