పరువునష్టం కేసులో రాహుల్ కి బెయిల్

Submitted on 12 July 2019
Ahmedabad Metropolitan Court grants bail to Rahul Gandhi

పరువునష్టం దావా కేసులో కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి ఇవాళ(జులై-12,2019) గుజరాత్‌ మెట్రో పాలిటన్‌ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. అహ్మదాబాద్‌ జిల్లా కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌,ఆ బ్యాంక్ చైర్మన్‌ అజయ్‌ పటేల్‌ రాహుల్ కి వ్యతిరేకంగా ఈ కేసును దాఖలు చేశారు.

నోట్ల రద్దు సమయంలో అహ్మదాబాద్‌ కో ఆపరేటీవ్‌ బ్యాంక్‌ రూ. 745.59 కోట్ల కుంభకోణానికి పాల్పడ్డట్లుగా రాహుల్‌ గాంధీ, కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణదీప్‌ సింగ్‌ సుర్జేవాలా ఆరోపించారు. బ్యాంక్‌ అప్పటి డైరెక్టర్లలో అమిత్‌ షా ఒకరు. నిరాధార ఆరోపణలు చేసి తమ పరువుకు నష్టం కలిగించారన్న ఫిర్యాదు మేరకు కోర్టు వీరివురికి సమన్లు జారీ చేసింది.

విచారణ నిమిత్తం రాహుల్‌ ఈ ఉదయం అహ్మదాబాద్‌ కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన స్పందిస్తూ.. బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ భావజాలానికి వ్యతిరేకంగా పోరాటం చేసేందుకు అవకాశం కల్పించిన ప్రత్యర్థులకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.

Rahul gandhi
Gujarat
METROPOLITAN COURT
grants
bail
CRIMINAL DEFAMATION SUIT
Filled
Ahmedabad
COOPERATIVE BANK


మరిన్ని వార్తలు