అక్షరం

Sunday, May 14, 2017 - 12:46

హైదరాబాద్: సమాజం బాగుపడాలంటే మంచి సాహిత్యం రావాలి. ప్రజలను చైతన్య పరిచే సాహిత్యాన్ని ఎందరో రచయితలు సృష్టిస్తున్నారు. ప్రజా ఉద్యమాల్లో కవులు, కళాకరుల పాత్రలను మరువలేము. అలాగే కవిత్వం, గేయాలు ప్రజలకు రసానందాన్ని కలిగిస్తూ ఆలోచింప చేస్తాయి. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తోన్న కవియిత్రి శైలజా మిత్ర ప్రత్యేక కథనంతో పాటు.. గేయకవి వీరభద్రం జనం పాటతో ఈ వారం మీ...

Sunday, May 7, 2017 - 16:27

ఆధునిక తెలుగు కథా సాహిత్యం లోకి కొత్తగా కొందరు రచయితలు ప్రవేశిస్తున్నారు.నూరేళ్ల తెలుగు సాహిత్యంలో ఎందరో కథారచియితలు తళుక్కుమన్నారు. వస్తు శైలీ విన్యాసాలతో అద్భుత కథలు సృష్టించారు.ఇటీవలి కాలంలో తెలుగు కథకుల సంఖ్య పెరుగుతోంది.కొత్తగా కలం పడుతూ ఎందరో కథారచయితలు ముందుకొస్తున్నారు.తమ ప్రాంతం ,తాము చూసిన జీవతం ,సమాజం గురించి కథలు రాస్తున్నారు.అలాంటి వారిలో ఆచార్య తానిపర్తి...

Sunday, April 30, 2017 - 13:32

వేమన..ఈ పేరు తెలియని తెలుగువారుండరు. సమాజంలోని మూఢనమ్మకాలను మూర్ఖాచారాలను, కట్టుబాట్లను, ఛాందసవాదాలను చావుదెబ్బతీస్తూ...ఆటవెలది పద్యాల్లో నిజాలను నిర్భయంగా వెల్లడించిన సాంఘిక విప్లవకారుడాయన. ప్రజల భాషకు పట్టంగట్టిన ప్రజాకవి ఆయన. విశ్వదాభిరామ వినురవేమ మకుటంతో.. పద్యాలు రాసి.., శ్రమములోన పుట్టు సర్వముతానేను అంటూ విప్లవాత్మక భావజాలాన్ని ఆనాడే చెప్పిన తాత్విక కవి ఆయన. లోతైన...

Sunday, April 23, 2017 - 12:11

తెరపై నవ్వుతూ కనిపిస్తారు. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తారు.. కానీ, వారి జీవితాల్లో మరెన్నో విశేషాలుంటాయి. ఆ ప్రయాణంలో ఎన్నో మలుపులుంటాయి. ప్రపంచానికి తెలియని మరెన్నో కోణాలూ వారిలో ఉంటాయి. ప్రముఖ కథారచయిత కూనపరాజు కుమార్ రాసిన హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ జీవిత చరిత్ర ఇటీవల విడుదలయింది. ఆ వివరాలతో పాటు, కుమార్ రాసిన న్యూయార్క్ కథా సంపుటి విశేషాలు చూద్దాం.. 

Sunday, April 23, 2017 - 12:08

కవిత్వానికి కాలం చెల్లిందా? వచనం రాయలేని వాళ్లే కవిత్వం రాస్తున్నారా? సాహితీ ప్రక్రియల ప్రాధాన్యం కాలానుగుణంగా మారుతుందా? ఇప్పుడు వచన సాహిత్యానికి, పాటకు మాత్రమే సమాజాన్ని ప్రభావితం చేయగల శక్తి ఉందా? కొందరు కవులు లేవనెత్తుతున్న ప్రశ్నలివి. దీనికి సమాధానం అంత తేలిక కాకపోవచ్చు. ఆధునిక కవిగా తన తెలుగు సాహిత్యంపై తన ముద్రవేసిన కవి ప్రసేన్ కథనంతో పాటు, న్యూయార్క్ కథలు, ఎమ్మెస్...

Sunday, April 9, 2017 - 11:57

ఎవరో ఒకరు ఊరికే పలకరిస్తారు గాని.. లోపలి నిశ్శబ్దాన్ని కదిపేదెవరు? అంటూ సున్నిత భావాలను తన కవిత్వంలో పలికించిన కవయిత్రి అరుణ నారదభట్ల. ఆమె ఇటీవల 'ఇన్నాళ్ళ మౌనం తరువాత' అనే కవితా సంకలనాన్ని వెలువరించారు. చైత్రానికి చిగురాకుకూ మధ్య తీయని సంగమమే కవిత్వం అంటున్న అరుణ కొత్త డిక్షన్ తో భావనా బలంతో కవిత్వం రాస్తున్నారు. అరుణ నారదభట్ల మరిన్ని విషయాల కోసం వీడియో క్లిక్ చేయండి.

...
Sunday, April 9, 2017 - 11:53

సాహిత్యం సమాజంలోని దుర న్యాయాలను, దుర్మార్గాలను ఎండగడుతుందా? ఎక్కడ అన్యాయాలు జరిగితే అక్కడ పాటై భగ్గుమంటుందా ? ప్రజాఉద్యమాలకు ఊపునిస్తుందా? అంటే కచ్చితంగా నిజమేనంటారు సృజనకారులు. కారం చేడు, చుండూరు, లక్ష్మింపేట లాంటి సంఘటనలు చూసి దళిత కవులు, పులులై గర్జించారు. పాటల తూటాలు పేల్చారు. కులరక్కసి గుండెల్లో వణుకు పుట్టించారు. ఈ నాడు పాటలేని ప్రజా ఉద్యమాలను ఊహించలేం. ఉద్యమాలు...

Sunday, April 2, 2017 - 12:47

తెలంగాణ అంటేనే పాట గుర్తొస్తుంది. ఇక్కడ పాట రాయని రచయిత లేడంటే అందులో ఆశ్చర్యం లేదు. తెలంగాణా సంస్కృతి, నిరంతర ప్రజాపోరాటాల చరిత్ర, ఇక్కడి దొరల దాష్టీకాలు, దౌర్జన్యాలు, దోపిడీలను చూసి చలించిన సృజనకారులెందరో గేయ రచయితలయ్యారు. అలాంటి వారిలో దుబ్బ రామచంద్రయ్య ఒకరు. ఆయన అనేక సామాజిక అంశాలపై అద్భుతమైన పాటలు రాశాడు. నల్గొండ కళాకారుడు గేయరచయిత దుబ్బ రామచంద్రయ్య గురించి...

Sunday, April 2, 2017 - 12:44

సాహిత్యం ప్రజల్లో విజ్ఞాన వినోదాలను పంచి పెడుతుంది. చైతన్యం కలిగిస్తుంది. ప్రపంచం లోని అనేక సాహిత్యాలను సంస్కృతులను తెలియజేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న సృజనకారులెందరో మన మధ్య ఉన్నారు. వారిలో ప్రపంచమంతా పర్యటించి యాత్రాసాహిత్యాన్ని ఆదినారాయణ అందిస్తున్నారు. శతాబ్దాల నాటి నిశ్శబ్ద కవచాలని వొలుచుకుంటూ పుడమి పునాదుల్లో నుండి మొలకెత్తిన విత్తానాన్ని నేను.. ఏ దేశం...

Sunday, March 26, 2017 - 13:34

తెలంగాణాలో ఎందరో గేయ రచయితలు ఉన్నారు. ప్రజాసమస్యలను అక్షరీకరిస్తూ ఎన్నో పాటలు రాస్తున్నారు. ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అలాంటి వారిలో దేవణ్ణ ఒకరు. సమాజంలోని అనేక సమస్యలపై ఎప్పటికప్పడు స్పందిస్తూ వందలాది పాటలు రాసిన గేయరచయిత దేవణ్ణ జనం పాటలు చూద్దాం....

Sunday, March 26, 2017 - 13:30

ఆమె కలంలో అధునాతన భావాల జలపాతాలు జాలువారుతుంటాయి
ఆమె గళంలో ప్రగతిశీల భావనల సముద్రాలు ఉప్పొంగుతుంటాయి
ఆమె స్త్రీజాతి స్వేచ్ఛను కోరి రచనలు చేసిన కవయిత్రి...
ప్రేమకు పెళ్ళికి మధ్య నలిగిపోయిన అంతరాల అంత:సంఘర్షణను అక్షరాల్లో చూపించిన నవలా రచయిత్రి...
ప్రవాసాంధ్ర జీవన దృశ్యాలను కథలుగా..... నవలలుగా శిల్పీకరించిన కథనశిల్పి...
ఆమె కల్పన రెంటాల..
...

Sunday, March 26, 2017 - 13:28

ఆధునిక తమిళ కథా, నవలా సాహిత్యంలో విశేష కృషిచేసిన సుప్రసిధ్ధ రచయిత అశోక్ మిత్రన్. జీవిత వాస్తవికతకు అద్దం పట్టే కథలు, నవలలను రాసిన అశోక మిత్రన్ అసలు పేరు జగదీశ త్యాగరాజన్. ఆయన 1931 సెప్టెంబర్ 22న సికింద్రాబాద్ లో జన్మించారు. 20 ఏళ్లు సికింద్రాబాద్ లోనే చదువుకున్నారు. తర్వాత 1952 లో మద్రాస్ వెళ్ళిపోయారు. అక్కడ జెమిని స్టూడియోలో దశాబ్దం పైగా పని చేశారు.
200 కథలు,...

Sunday, March 19, 2017 - 13:12

ఏడాది పొడుగునా వేచి వేచి ఒక చెట్టు
ఒళ్ళంతా పువ్వులతో
తనను తాను తిరిగి పొందేవేళ..
అంటూ అద్భుత భావనా బలంతో కవిత్వం రాసిన అరుదైన కవి విన్నకోట రవిశంకర్. మనిషి తనలోని ఆత్మను అందంగా ఆవిష్కరించడమే కవిత్వమని భావించే రవిశంకర్ ఏ వస్తువునైనా అద్బుతమైన కవితా శిల్పంగా మార్చగలరు. కుండీలో మర్రిచెట్టు కవితా సంకలనంతో వస్తూ వస్తూనే తెలుగు కవిత్వంపై తనదైన ముద్రను వేశారు. అదే...

Sunday, March 5, 2017 - 12:50

తెలంగాణా అంటేనే గేయ రచయితలు గుర్తుకొస్తారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్న గేయ రచయితలెందరో తెలంగాణాలోనే ఉండటం ఆశ్చర్యమనిపిస్తుంది. అలాంటి వారిలో వడ్డెముద్దంగుల ఎల్లన్న ఒకరు. ఆయన ఎన్నో ప్రజాసమస్యలపై గేయాలు రాశారు. సబ్బండనాదం పేరుతో ఒక పాటల పుస్తకాన్ని వెలువరించారు.

Sunday, March 5, 2017 - 12:44

గానుగెద్దు జీవితంలో సంపాదనకు, అప్పులకు, ఆస్తులు కూడబెట్టటానికి... వృత్తి జీవితానికి కాలం గడిచిపోతుంది. ఇది సాధారణ వ్యక్తుల జీవితం. కానీ, అతికొద్ది మంది వృత్తిని, ప్రవృత్తిని బ్యాలెన్స్ చేస్తూ, చుట్టూ ఉన్న అనేకానేక సమస్యల పరిష్కారానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారిలో ప్రముఖ కథారచయిత్రి , సంఘ సేవకురాలు ఆలూరి విజయలక్ష్మి ఒకరు. ఆమె చేసేది వైద్య వృత్తి. కాని ఆమె నిరంతరం...

Sunday, February 26, 2017 - 12:57

కవులు, రచయితలు, కళాకారులు, ప్రేక్షకుల సహకారంతో నాలుగేళ్లు పూర్తి చేసుకున్న టెన్ టీవీ అక్షరం 'అక్షరం సమీక్షణం' పేరుతో ఓ వేడుకను నిర్వహించింది. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగిన ఈ సెలబ్రేషన్స్ లో ప్రముఖ కవి కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత కె శివారెడ్డితో పాటు సాహితీ ప్రముఖులు ఖాదర్ మొహియుద్దీన్, ప్రసాదమూర్తి, యాకూబ్, స్ఫూర్తి, జి. లక్ష్మీనర్సయ్య, అట్టాడ...

Sunday, February 26, 2017 - 12:48

ఓ సాహిత్య కార్యక్రమం ఎలక్ట్రానిక్ మీడియాలో ఇముడుతుందా? ప్రతీ వారం ఇవ్వగలరా? అసలు అక్షరాన్ని విజువల్ గా ఎలా చూపిస్తారు..? ఇప్పటికే కొందరు ప్రయత్నించారు.. విరమించుకున్నారు.. మరి ఈ ప్రయత్నం మాత్రం ఎంతవరకు విజయవంతమౌతుంది? ఇలాంటి ప్రశ్నలు అనేకం వినిపించాయి.. అన్ని ప్రశ్నలకు సమాధానంగా నాలుగేళ్లు... రెండువందల వారాలు.. పూర్తి చేసుకుని .. సరికొత్త ప్రణాళికలతో, మరిన్ని విన్నూత్న...

Sunday, February 19, 2017 - 12:09

తెలంగాణా అంటేనే పాట వినిపిస్తుంది. ప్రాణం లేచొస్తుంది. హృదయం కంపిస్తుంది. దేహం కదం తొక్కుతుంది. ఉద్రేకం ఉప్పొంగుతుంది. ఉద్యమాలకు పురుడు పోస్తుంది. అంతటి శక్తిమంతమైన పాటలు రాసిన గేయరచయితలు తెలంగాణాలో ఎందరో ఉన్నారు. వారిలో గడ్డం ఉదయ్ ఒకరు. ఈ గేయరచయిత చదివింది పదో తరగతే అయినా సమాజాన్ని బాగా పరిశీలించి మానవాభ్యుదయం కోసం ఎన్నో పాటలు రాశారు. ప్రజాకవి గడ్డం ఉదయ్ గురించి మరిన్ని...

Sunday, February 19, 2017 - 12:02

సాహిత్యం నేడు సమాజానికి అవసరమా? ప్రపంచీకరణ నేపథ్యంలో మనుషులు వస్తువులగా మారిపోయింది నిజం కాదా? సమస్త మానవ విలువలు, కళలు, సంస్కృతులు రోజురోజుకు కనుమరుగవున్నాయి కదా? మరి ఇలాంటి తరుణంలో సాహిత్యం నిర్వహించే పాత్ర ఏమిటి? ఇలాంటి విషయాల గురించి తీవ్రంగా ఆలోచించేవారే నిజమైన సృజన కారులు. అలాంటి రచయితల్లో రామదుర్గం మధుసూధనరావు ఒకరు. రాయల సీమంటే కరువుకు తోబుట్టువు..ఫ్యాక్షన్ గొడవలకు...

Sunday, February 12, 2017 - 13:55

సాహిత్యం సముద్రమంత లోతైనది. ఈ విశ్వమంత విశాలమైనది. వేల ఏళ్ల పరిణామంలో తొలి అడుగు నుంచి ఉరుకుల, పరుగుల వేగం వరకు రాజరికం, బానిసత్వం, ఆధిపత్య, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఎన్నో మలుపులు  మరెన్నో మైలు రాళ్లు. సమాజాన్ని నడిపించే శక్తుల మూలాలను వ్యక్తిలో, దాని సమూహంలో ఒడిసిపట్టుకుని సాహిత్యం అక్షరీకరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య సాహిత్య గతి.. అధ్యయనం చాలా ముఖ్యంగా మారింది...

Sunday, February 12, 2017 - 13:52

సాహిత్యం సముద్రమంత లోతైనది. ఈ విశ్వమంత విశాలమైనది. వేల ఏళ్ల పరిణామంలో తొలి అడుగు నుంచి ఉరుకుల, పరుగుల వేగం వరకు రాజరికం, బానిసత్వం, ఆధిపత్య, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యం వరకు ఎన్నో మలుపులు  మరెన్నో మైలు రాళ్లు. సమాజాన్ని నడిపించే శక్తుల మూలాలను వ్యక్తిలో, దాని సమూహంలో ఒడిసిపట్టుకుని సాహిత్యం అక్షరీకరిస్తూ ఉంది. ఈ పరిస్థితుల మధ్య సాహిత్య గతి.. అధ్యయనం చాలా ముఖ్యంగా మారింది...

Pages

Don't Miss