అక్షరం

Sunday, January 22, 2017 - 11:10

తెలంగాణ పాటకు పుట్టినిల్లు. ప్రజాచైతన్య గీతాల ఏరువాక. ఇక్కడ ఎందరో గేయరచయితలు నిబద్ధతతో రచనలు చేస్తున్నారు. ప్రజలను చైతన్య వంతులను చేస్తున్నారు. అలాంటి వారిలో కర్నాటి రఘురాం గౌడ్ ఒకరు. ఆయన ఎన్నో రచనలు చేశారు. సమాజంలోని అనేక అంశాలపై పుస్తకాలు రాశారు. గేయరచయిత కర్నాటి రఘురాం గౌడ్ ఇంకా ఎలాంటి పాటలు..పుస్తకాలు రాశారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

 

Sunday, January 22, 2017 - 10:57

సాహిత్యం సామాజిక చైతన్యానికి ఉపయోగ పడుతుంది. వివిధ చారిత్రక సందర్భాలకు ఆధారాలను అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన కవులు రచయితలు ఎందరో ఉన్నారు. తెలుగు సాహిత్యంలో ఎందరో కథారచయితలు అద్భుతమైన కథలను రాస్తున్నారు. అరుదైన కథలు సృష్టిస్తున్నారు. వారిలో కాటూరు రవీంద్ర త్రివిక్రమ్ ఒకరు. ఆయన కార్గిల్ కథలు పేరుతో కథానికా సంకలనాన్నివెలువరించారు. తెలుగు సాహిత్యంలో అన్ని...

Sunday, January 15, 2017 - 19:43

తెలంగాణాలో కవులకు కళాకారులకు కొదువలేదు. ఇక్కడ మట్టిలోనే ప్రతిఘటన ఉంది. కవులు గేయాలు రాయడమేకాదు కాళ్లకు గజ్జెకట్టి ప్రజావేదికలపై కదం తొక్కుతారు. ప్రజలను ఉద్యమాలబాట పట్టిస్తారు. అలాంటి వారిలో నడిమెట్ల రామయ్య ఒకరు. ఆయన చిన్నతనం నుండి పాటలు రాయడం ..వాటికి బాణీలు కట్టి ప్రజలకు వినిపించి వారిని చైతన్యవంతులను చేయడమే వృత్తిగా పెట్టుకున్నారు. ప్రముఖ ప్రజాకవి నడిమెట్ల రామయ్యపై మరింత...

Sunday, January 15, 2017 - 13:13

హైదరాబాద్ : సాహిత్యం సమాజానికి దర్పణం పడుతోంది. కవులు, రచయితలు తమ రచనలతో ప్రజలను చైతన్యవంతులను చేస్తారు. అలాంటి రచయితల్లో ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానం రాజు ఒకరు. రాగమేదైనా కళ్లుమూసుకుని వినలేను...కవిత్వమైనా సరే... దృశ్య చంచలం కావాలి అంటున్న కవి దాట్ల దేవదానం రాజు. యానాం కు చెందిన ప్రముఖ కథకుడు కవి దాట్ల దేవదానం రాజు అనేక కథలు కవితా...

Sunday, January 8, 2017 - 12:48

మువ్వా పద్మావతి రంగయ్య పౌండేషన్, తానా సంయుక్తంగా ఖమ్మంలో సాహితీ సాంస్కృతిక సంబురాలు నిర్వహించారు. మువ్వా పౌండేషన్ అధ్యక్షులు మువ్వా శ్రీనివాస్ రావు, తానా అధ్యక్షులు జంపాల చౌదరి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సంబరాల్లో మంత్రి తుమ్మల నాగేశ్వరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి, గోరటివెంకన్నలతో పాటు పలువురు కవులు, రాజకీయ ప్రముఖులు పాల్గొన్న ఆ సాహితీ మహోత్సవం...

Sunday, January 8, 2017 - 12:42

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. రాజ్యానికి ప్రజలకు మధ్య చైతన్య వారధిగా నిలుస్తుంది. ప్రతి దేశంలో కవులు కళాకారులే ఉద్యమాలకు ఊపునిచ్చారు. ప్రజలను పోరుబాట పట్టించారు. అలాంటి వారిలో తెలుగు సాహిత్యంలో దిగంబర కవిత్వోద్యమానికి దిక్సూచిగా నిలిచిన కవి నగ్నముని. నగ్నముని..... ఈ పేరు వింటేనే దిగంబర సాహిత్యోద్యమం చప్పున గుర్తొస్తుంది. దివిసీమ ఉప్పెన నేపథ్యంతో నగ్నముని...

Sunday, January 1, 2017 - 13:33

'నేను పుట్టకముందే దేశ ద్రోహుల జాబితాలో నమోదైఉంది నా పేరు. కన్నబిడ్డను సవతి కొడుకుగా చిత్రించింది చరిత్ర'.. అంటూ తెలుగులో ఓ కవితోద్యమానికి నాంది వాక్యం పలికిన కవి ఖాదర్ మొహిద్దీన్. 'పుట్టుమచ్చ' అనే కవితా సంకలనంతో తెలుగు సాహిత్యంలో ఓ మైలు రాయిగా నిలిచారు. ఆ సంకలనం వచ్చి పాతికేళ్లు అవుతున్న సందర్భం ఒకటైతే... ఆయన ఆరుణ్ సాగర్ అవార్డు అందుకోకపోవడం మరో విషయం. ఈ సందర్భంగా టెన్ టివి...

Sunday, December 25, 2016 - 13:34

హైదరాబాద్‌ వాసులకు డిసెంబర్‌ మాసం అనగానే టక్కున గుర్తుకొచ్చేది పుస్తక మహోత్సవం. ఈ మహోత్సవాలలో పుస్తకాలు విరివిగా దొరకడమే కాకుండా పలు అరుదైన పుస్తకాలు బుక్ ఫెస్టివల్ లో లభించటం ప్రత్యేకత. ఈ ఏడాది బుక్‌ ఫెయిర్‌ డిసెంబర్‌ 15 నుంచి 26 వరకూ ఎన్టీఆర్‌ స్టేడియంలో జరిగుతున్నాయి. బుక్‌ ఫెయిర్‌లో సుమారు 300కు పైగా స్టాళ్లు ఉండడం, ప్రతి రోజూ ఏదో ఒక సాహిత్య పరమైన కార్యక్రమాలు ఇక్కడ...

Sunday, December 25, 2016 - 13:29

పాఠశాల విద్యార్ధులకు వారం రోజుల్లో తెలుగు భాషను నేర్పించవచ్చను రుజువు చేశారు రచయిత నెల్లూరు నర్శింహారావు. లయ ఆధారంగా ఒక తెలుగు వాచకాన్ని రూపొందించారు నెల్లూరు నర్శింహారావు..తెలుగు గేయ నేపథ్యంలో రాసిన నెల్లూరు నర్శింహారావు వాచకంపై సమీక్షణం మీకోసం ఈ వీడియో సిద్ధంగా వుంది. 

Sunday, December 25, 2016 - 13:19

ఆధునిక తెలుగు కవిత్వంలో తనదైన ముద్రవేసిన ప్రముఖ కవి పాపినేని శివశంకర్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ మేరకు బుధవారం నాడు కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. పాపినేని కవితా సంపుటి 'రజనీగంధ'కు గాను ఈ అవార్డు ప్రకటించింది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ అవార్డును బహుకరించనున్నారు. కాగా, పాపినేని శివశంకర్ స్వగ్రామం గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని...

Sunday, December 18, 2016 - 13:00

తెలుగునాడి పత్రికకు సంపాదకత్వం వహిస్తూ, తెలుగు సాహిత్యానికి సంబంధించిన అన్ని చర్చల్లోనూ విరివిగా పాల్గొనే జంపాల చౌదరి పరిచయం అక్కర్లేదు. తెలుగు కథల గురించి విశేషమైన కృషి చేసిన చౌదరి గారు, చాలా కాలం తానా పత్రికకు సంపాదకత్వం వహించారు. ఆయనతో 'అక్షరం' ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన పలు విశేషాలను తెలియచేశారు. ఆయన ఎలాంటి అభిప్రాయాలు వెల్లడించారో తెలుసుకోవాలంటే వీడియో క్లిక్...

Sunday, December 11, 2016 - 13:35

ప్రపంచ దేశాల కవిత్వానికి వేల ఏళ్ళ చరిత్ర వుంది. మాతృభాషలోనే కాకుండా ప్రపంచ భాషల్లో కవిత్వాలను పరికించాలనే తపన అనేకమంది పాఠకుల్లో వుంటుంది. అటువంటి వారికోసం ప్రముఖ అనువాద రచయిత 'ముకుంద రామారావు అనే గాలి పేరుతో వివిధ దేశాల కవిత్వాన్ని అనువాదం చేశారు. అవేంటో చూద్దాం..

Sunday, December 11, 2016 - 13:34

తెలుగులో ఎందరో గజల్స్ రాస్తున్నారు. కానీ తెలుగు గజల్స్ ను ఇంగ్లీషులో రాయటం మరో అరుదైన విషయం. ఈ విశేష గజల్స్ రచయిత ఎవరనుకుంటున్నారా? చెన్నై లో వుంటూ గజల్స్ రాస్తున్న విజయవాడకు చెందిన లోజిస్ మాన్ పై ప్రత్యేక కథనం ఈ వారం అక్షరం..

Sunday, December 11, 2016 - 13:32

తెలంగాణ పోరాటాల రణగడ్డ..ఉద్యమాల ముద్దుబిడ్డ..భూమి కోసం..భుక్తి కోసం..బానిసల బతుకుల విముక్తి కోసం ఎందరో వీరులు ఈ గడ్డపై పోరాటాలు చేశారు. ఎందరో రచయితలు కలం యోధులుగా ఎగిసిపడ్డారు. అందులో నల్లగొండకు చెందిన 'రాచకొండ రంగన్న'ఒకరు. నూనూగు మీసాల యవ్వనంలోనే ఉద్యమాల బాట పట్టినకలం యోధుడతడు..పేదల బాధల విషాదాలను అక్షరాల రూపంలో మలచిన కవి రాచకొండ రంగన్నతో ఈనాటి అక్షరం మనముందుకు వచ్చింది....

Sunday, December 4, 2016 - 13:04

ఇటీవల కాకినాడలో కవిసంధ్య, స్ఫూర్తి సాహితి, ఏపీ, పుదుచ్చేరి ప్రభుత్వాల సంయుక్త నిర్వహణలో యానాం కవితోత్సవం ఘనంగా జరిగింది. ఆ విశేషాలు వీడియోలో చూద్దాం....

 

Sunday, December 4, 2016 - 13:02

సినీ నిర్మాతలు ఆ నవలకి రెండు మిలియన్ డాలర్లు అంటే 14 కోట్ల రూపాయలు ఇస్తామన్నారు.. కానీ, తన నవల చదివి తన పాఠకులే సినిమాగా ఊహించుకోవాలనుకున్నాడు. దాన్ని ఏ దర్శకుడూ తెరకెక్కించకూడదని పాఠకుల మీద తన అపార గౌరవాన్ని చాటిన రచయిత గురించి విన్నారా? నాలుగు సంవత్సరాలపాటు వెల్లకిలా పడుకొని మైఖేలేంజిలో తన ప్రపంచ ప్రఖ్యాత సిస్టిన్ ఛాపెల్ పెయింటింగ్ వేశాడు.. అంతే  శ్రద్ధగా తన ఒక్కో నవలనీ...

Sunday, November 27, 2016 - 12:54

పరుగెత్తేటప్పుడు ప్రతిదీ పారదర్శకమే. పద్యం అద్దంలా ఉండదు. అబద్ధంలా ఉంటుంది. ఈ మాటలు అన్న కవి మరెవరో కాదు 'హెచ్చార్కే'. హెచ్చార్కేగా తెలుగు సాహీతి ప్రియులకు సుపరిచితులు. ఆయన పూర్తిపేరు కొణిదెల హనుమంతరెడ్డి. 'అక్షరం..అంతరంగం' ఆయనతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆయన తన జీవిత విశేషాలను వెల్లడించారు. పూర్తి వివరాలకు వీడియో క్లిక్ చేయండి. 

Sunday, November 20, 2016 - 12:47

నాజాతి చరిత్ర నా జాతి సౌందర్యాత్మక పని విలువలు వేల సంవత్సరా నుండి యజ్ఞంలో తగలబడుతూనే వున్నాయంటూ దళిత బహుజన ధిక్కార స్వరమై ఎగసిపడి కవి గుడిపల్లి నిరంజన్ కవితలు..లందపొద్దు అనే సంకలనంతో ఈనాటి అక్షరం..ఈ జి.లక్ష్మీ నరసయ్య విశ్లేషణ ఈనాటి అక్షరంలో చూడండి..

Sunday, November 6, 2016 - 14:54

ఇటీవల దళిత బహుజన కవులు అద్భుత సాహిత్యాన్ని సృష్టిస్తున్నారు. నల్గొండకు చెందిన భూతం ముత్యాలు దళిత తాత్వికతతో నవలలు కవితా సంపుటాలు వెలువరించారు. ఆయన రాసిన దళిత బహుజన సాహిత్యాన్ని విశ్లేషిస్తున్నారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య. మరిన్ని వివరాలను వీడియోలో చూద్దాం...

 

Sunday, November 6, 2016 - 14:50

సాహిత్యం సమాజానికి అద్దం పడుతుంది. సామాజిక చరిత్రకు అక్షర రూపమిస్తుంది. అంతేకాదు ప్రజలను చైతన్య ప్రవాహాలుగా మారుస్తుంది. అలాంటి సాహిత్యాన్నిసృష్టించిన కవులు రచయితలు ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో ఇటీవలే ప్రతిష్టాత్మకమైన మ్యాన్ బుకర్ ప్రైజ్ అవార్డు పొందిన అమెరికా రచయిత పాల్ బెయిటీ ప్రత్యేక కథనంతో పాటు, దళిత బహుజన కవి, భూతం ముత్యాలు ధిక్కార స్వరంతో ఈ వారం మీ...

Sunday, October 23, 2016 - 14:29

ఇటీవల  నవతెలంగాణా పబ్లిషింగ్ హౌస్ ప్రచురించిన దరువుల బండి,ప్రజాగేయాలు అన్న పుస్తకాల ఆవిష్కరణ సభ సుందరయ్య కళానిలయంలో జరిగింది.ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో జయధీర్ తిరుమలరావ్,గోరటి వెంకన్న,మెట్రో రైలు యం.డి.ఎన్వీరెడ్డి, భిక్షమయ్య, స్ఫూర్తి,పి.యన్. మూర్తి,పసునూరిరవీందర్ తదితరులు పాల్గొన్నారు.బండిసత్తెన్న సాహిత్యం ప్రజలను ఎంతగానో ఆలోచింపజేస్తుందని వక్తలు కొనియాడారు....

Sunday, October 23, 2016 - 14:27

ఒకప్పటి సాహిత్యం కొన్ని వర్గాలవారికే పరిమితమై ఉండేది. నేడు అట్టడుగు వర్గాలవారు అక్షరాస్యులు కావడంతో అన్ని కులాల అస్తిత్వంతో తెలుగు సాహిత్యం వెలువడుతోంది. ముఖ్యంగా దళిత బహుజన కులాల రచయితలు మునుపెన్నడూ లేని విధంగా కథలు నవలలు సృష్టిస్తున్నారు. అలాంటి వారిలో అనంతపురం జిల్లాకు చెందిన చిలుకూరి దేవపుత్ర ఒకరు. ఆయన ఇటీవలే కన్నుమూశారు. ఆ మహారచయిత కు నివాళులర్పిస్తూ వివిధ సాహితీ...

Sunday, October 16, 2016 - 13:51

ఒంగోలులో బహుజన కెరటాలు ఆధ్వర్యంలో పల్నాటి శ్రీరాములు అధ్యక్షతన జరిగిన బొజ్జాతారకం సంస్మరణ సభలో.. డా ప్రసాదమూర్తి రచించిన ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం సిద్ధాంత గ్రంధం ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ విమర్శకులు జి లక్ష్మీనర్సయ్య, గాయకుడు జయరాజు, ప్రొఫెసర్ వినోదిని, డా ఖాజా, శిఖామణి, కోయి కోటేశ్వరర్రావు తదితరులు పాల్గొన్నారు. 

Sunday, October 16, 2016 - 13:49

ఇటీవల సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో 'సుద్దాల హనుమంతు జానకమ్మ' జాతీయ పురస్కార ప్రదానోత్సవ సభ జరిగింది. 'సుద్దాల అశోక్ తేజ' ఆధ్వర్యంలో జరిగిన ఈ సభలో ప్రముఖ గేయకవి, గాయకుడు 'వంగపండు ప్రసాదరావు'కు పురస్కారం అందజేశారు. ఈ కార్యక్రమంలో గద్దర్, ఆర్.నారాయణమూర్తి, సినీనటుడు ఉత్తేజ్ ప్రముఖ కవి మువ్వా శ్రీనివాస్ రావు, నారాయణశర్మ తదితరులు పాల్గొన్నారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్...

Sunday, October 16, 2016 - 13:38

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుంది. సృజనకారులు తమ కలాలకు పదును పెట్టి ప్రజలను ఆలోచింపజేస్తారు. ఆహ్లాదం, ఆనందం వినోదాలతో పాటు రాజకీయ సామాజిక చైతన్యాలను కలుగజేస్తారు. అలాంటి వారిలో అమెరికా గేయరచయిత 2016 నోబెల్ అవార్డు గ్రహీత బాబ్ డిలాన్ ఒకరు. బాబ్ డిలన్.... ఈ పేరు వింటేనే అమెరికన్ జానపద గాయకుడు సింగర్, ప్రఖ్యాత గేయకవి మూర్తిమత్వం మనకళ్ళముందు సాక్షాత్కరిస్తుంది. సుమారు ఐదు...

Pages

Don't Miss