అక్షరం

Sunday, July 24, 2016 - 10:59

థూ.. కథ తో అంతులేని చర్చను రేకెత్తించిన కథకులు పివి సునీల్ కుమార్. నీలవేణి పేరుతో ఆయన ఇటీవల తన కథా సంకలనాన్ని విజయవాడలో విడుదల చేశారు. ఆ సమావేశ విశేషాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Sunday, July 24, 2016 - 10:57

సాహిత్యం సమాజానికి దర్ఫణం పడుతుంది. ప్రజలను చైతన్య వంతం చేస్తుంది. విజ్ఞాన వినోదాలను పంచి పెడుతుంది. ప్రజాపోరాటాలకు ప్రేరణనిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన ఎందరో కవులు రచయితలు మనమధ్యనే ఉన్నారు. అలాంటి వారిలో ప్రగతిశీల భావాలతో కవిత్వం రాసిన శిలాలోలిత ఒకరు. ఆధునిక తెలుగు సాహిత్యంలో అద్బుతమైన కవయిత్రిగా పేరుపొందిన విధుషీమణి శిలాలోలిత. ఆమె కవిత్వం, సాహితీ విమర్శ,...

Sunday, July 17, 2016 - 13:12

పాట ఒక పూలతోటలా రాగాల పరిమాళాలను వెదజల్లుతుంది. ఒక్కోసారి పాట విప్లవాల పోరుబాటను చూపిస్తుంది. పాటకు అంతటి శక్తి ఉంది. అలాంటి పాటలు రాసిన గేయకవి జినుకల సదానందం. ఆయన ప్రకృతి, రైతులు, అమ్మప్రేమ, దేశభక్తి మెుదలైన అంశాలపై అనేక పాటలు రాశాడు. మానవత్వం, ప్రేమతత్వం పరిమళించే పాటలు రాసిన జినుకల సదానందంను పరిచయం చేస్తున్నాడు ప్రముఖ గేయరచయిత స్ఫూర్తి నేటి జనంపాటలో... మరిన్ని వివరాలను...

Sunday, July 17, 2016 - 13:00

ఆకాశంలోసగం అక్షరానికి దూరం అన్న మాటను నేడు మహిళలు వమ్ముచేశారు. చాలామంది స్త్రీలు అక్షరసేద్యం చేస్తూ అద్భుతమైన కవితలు రాస్తున్నారు. అలాంటి వారిలో సుజలగంటి ఒకరు. మానవసంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిన నేటి దుర్మార్గపు సమాజంపై ఆమె నిప్పులు చెరిగారు. ప్రేమ, స్నేహం ,అనుబంధాలు అన్నీ పవిత్రంగా ఉండాలని ఆమె కథలు రాశారు. శత్రుపూరిత వైఖరివల్ల మానవసంబంధాలు దెబ్బతిని కుటుంబాలు...

Sunday, July 17, 2016 - 12:56

సాహిత్యం మనుషుల ప్రవర్తనలో మార్పు తెస్తుందా? సమాజాన్ని సమున్నత విలువలవైపు నడిపిస్తుందా? అంటే నిజమేనంటారు సాహితీ విమర్శకులు. అయితే గొప్పభావాలు, సమున్నత ఆశయాలు, మానవతా విలువలు కలిగి ఉన్న సృజనకారులవల్లనే సమాజం బాగుపడుతుంది.అలాంటి వారిలో అద్భుత కవిత్వం రాస్తూ దళిత ధిక్కారస్వరం వినిపిస్తున్న దుర్గాప్రసాద్ అవధానం.. 

యేమీ జరగనట్టుగానే పైకేమీ కనిపించనికుండానే అమాయక దు:ఖం...

Sunday, July 10, 2016 - 10:44

అంగవైకల్యం కళల్లో రాణించటానికి అడ్డురాదని ఎందరో రుజువు చేశారు. అలా తన అంగవైకల్యాన్ని అధిగమించి గాయకుడిగా రాణిస్తున్నాడు బాలకృష్ణ. వివిధ సామాజికాంశాలపై ఆయన రాసిన పాటలు ఆకట్టుకుంటాయి. చక్కగా పాడుతూ జనం పాటల ప్రవాహమైపోతాడాయన. గేయరచయిత, గాయకులు బాలకృష్ణ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి.

Sunday, July 10, 2016 - 10:43

మన ఓటుతో మనం చెక్కిన కుర్చీమీద కూర్చుందాం. తాటాకుల మీద కాల జ్ఞానాన్ని రాసిన వీరబ్రంహంగారి వారసులం అంటూ బహుజన కవిత్వాన్ని రాసిన కవి దాసోజు కృష్ణమాచారి. ఆయన బహుజన కులాల అస్తిత్వాన్ని గురించి అద్బుతమైన కవితలు రాశాడు. 'వన్నె' అన్న కవితా సంపుటిని వెలువరించాడు. కవి దాసోజు కృష్ణమాచారి పరిచయకథనం చూడాలంటే వీడియో క్లిక్ చేయండి.

Sunday, July 10, 2016 - 10:39

ఊయల ఊపగల చేతులు ప్రపంచాన్ని పాలించగలవంటారు. ఇవాళ ఆడవాళ్లు అన్ని రంగాల్లో ముందుకు దూసుకెళుతున్నారు. అయితే అత్యంత సాహసోపేతమైన ఇన్వెస్టిగేషన్ జర్నలిజంలో సాహసాలు చేస్తూ.. తన పరిశోధనలను ప్రపంచం ముందుంచింది రాణా అయూబ్. గుజరాత్ పైల్స్ అన్న సంచలనాత్మక పుస్తకం రాసిన జర్నలిస్ట్ రాణా అయూబ్ పై ప్రత్యేక కథనం. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Thursday, July 7, 2016 - 10:44

హైదరాబాద్ : దేశ వ్యాప్తంగా ముస్లిం సోదరులు రంజాన్‌ పర్వదినాన్ని ఘనంగా జరుపుకొంటున్నారు. నెలరోజులపాటు నిష్ఠతో కొనసాగించిన కఠిన ఉపవాస దీక్షలను విరమించారు. మసీదులు, ఈద్గాల వద్ద నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. సామూహిక ప్రార్థనలతో నగరంలో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. చార్మినార్‌,...

Sunday, July 3, 2016 - 08:26

గండె నిండా గాయాలు మండుతున్న గేయాలు అంటూ సమాజంలోని అవినీతి, అక్రమాలు, రాజకీయాలు, మహిళా సమస్యలపై కవితలు రాస్తున్న కవయిత్రి డా.వరలక్ష్మి. ఆమె ఇటీవలే భావతరంగాలు అనే కవితా సంపుటిని వెలువరించారు. వృత్తి వైద్యం అయినప్పటికీ ప్రవృత్తిగా కవిత్వం రాస్తున్న కవయిత్రి డా.వరలక్ష్మి వివరాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Sunday, July 3, 2016 - 08:24

పాటను తూటాల పేల్చితే ప్రజల గుండెల్లో చైతన్యం విస్ఫోటిస్తుంది. విషాదమైనా... వినోదమైనా పాటలోనే పరిపూర్ణత్వం చెందుతుంది. రాగ తాళ భావా యుక్తమైన గేయాలు మన మనో ప్రాంగణంలో చైతన్యదీపాలు వెలిగిస్తాయి. రసానందాన్ని కలిగిస్తాయి. అలాంటి పాటలు రాసిన గేయకవి విఠల్ రెడ్డి. సమాజంలోని అనేక విషాద దృశ్యాలను గాయాల బతుకులను గేయాలుగా మలిచిన విఠల్ రెడ్డి గురించి మరిన్ని విశేషాలు తెలుసుకోవాలంటే...

Sunday, July 3, 2016 - 08:22

వెయ్యేళ్ల తెలుగు సాహిత్యం ఏం చేసింది? రాజులనో మతాలనో కీర్తించింది. వర్ణ వ్యవస్థను పోషించింది. కులవ్యవస్థ ముసుగులో దళితులను వెలివాడలకు బలి చేసింది. కనిపించని మానవ హింసకు సాహిత్యం పరోక్షంగా దోహదపడింది. అయితే అనుకోని విధంగా అస్తిత్వవాదాలు సాహిత్యంలో ప్రవేశించాయి. అట్టడుగు కులాలనుండి అణువిస్ఫోటనంలా కలాలు ఎగసిపడ్డాయి. తమకు జరిగిన చారిత్రక విద్రోహాలను ఎండగట్టాయి. అలాంటి వారిలో...

Sunday, June 26, 2016 - 07:37

ఊరిలో దిగ్గానే తోటలోకి పరిగెత్తాను. జనకీకారణ్యంలో బోన్సాయ్ బతుకును మరచి ఆ ఉదయం సహజమైన మెుక్కై పల్లవించాను అంటూ నోస్టాల్జిక్ ఓరియంటెడ్ కవిత్వం రాసిన అనుభూతివాద కవయిత్రి, అనేక కథాసంపుటాలు నవలలు వెలువరించిన సృజనశీలి అల్లూరి గౌరీలక్ష్మి. ఆమె మానవ సంబంధాల మాధుర్యాలను, మానసిక సంఘర్షణలను, కథలుగా అల్లింది.. తను చూసిన దృశ్యాలను అందమైన కవిత్వంగా శిల్పీకరించింది. అతి సున్నిత...

Sunday, June 26, 2016 - 07:33

ప్రపంచమెుక పద్మవ్యూహం కవిత్వం తీరని దాహమన్నారు మహాకవి శ్రీశ్రీ. కేవలం కవిత్వమేకాదు సృజనాత్మక కళ ఏదైనా అది తీరని దాహంలానే ఉంటుంది. కొందరు కవిత్వం కోసం బతుకంతా పలవరిస్తారు. మరికొందరు కథారచనలోనే జీవితాన్ని కాస్తా గడిపేస్తారు. ఇంకొందరు గేయాలుగా మారిపోతారు. ప్రజల గాయాల బతుకులను గానం చేస్తారు. ప్రజలను చైతన్య పరుస్తారు. అలాంటివారిలో ఇటీవల కన్ను మూసిన ప్రముఖ గేయ రచయిత గూడ అంజయ్యకు...

Sunday, June 19, 2016 - 13:44

ఇటీవల యువ రచయిత్రి చైతన్య పింగళి రాసిన చిట్టగాంగ్ విప్లవ వనితలు పుస్తకానికి కేంద్రసాహిత్య యువపురస్కారం దక్కింది. వ్యక్తిగత విప్లవ పోరాటాల్లోగాక  మహిళలు పూర్తీస్థాయి సభ్యులుగా ఒక రహస్య సంస్థలో చేరి సాయుధ పోరాటం చేసిన అంశాలను రచయిత్రి ఈ పుస్తకంలో ఉటంకించారు.యువ రచయిత్రి చైతన్య పింగళి పుస్తక పరిచయ కథనం.. మీకోసం.. ఆ వివరాను వీడియోలో చూద్దాం....

 

Sunday, June 19, 2016 - 13:43

చిన్నారుల్లో దాగి ఉన్న సాహిత్యాభిలాషను, అభిరుచులను, కళలను వెలికి తీసేందుకు వారి అభిప్రాయాలను స్వేచ్ఛగా వెల్లడించేందుకు ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక, మహిళా చేతన, సంస్కృతి గ్లోబల్ స్కూల్ యాజమాన్యం సంయుక్తంగా నవతరంతో యువతరం అని ఓ కార్యక్రమం నిర్వహించింది. కార్యక్రమ నిర్వహణకు మాత్రమే పరిమితం కాకుండా, విద్యార్ధులు, రచయితల ఆలోచనలు, సృజనాత్మక పరిశీలనలు, కలిపి పండువెన్నెల పేరుతో ఓ...

Sunday, June 19, 2016 - 13:37

గాయాల తెలంగాణాపై వచ్చినన్ని గేయాలు మరేప్రాంతంలోనూ రాలేదు. ఇక్కడి రచయితలు ప్రతి అంశాన్ని, దృశ్యాన్ని, సవాలక్షసామాజిక సమస్యలను గేయాలుగా రాస్తున్నారు. అలాంటి వారిలో మానుకోట ప్రసాద్ ఒకరు. ఆయన పల్లెను ,నల్లరేగడి నేలను,చెరువులను రైతులను.ఇలా అనేకాంశాలపై ఎన్నో గేయాలు రాశాడు.గేయకవి మానుకోట ప్రసాద్ ను పరిచయం చేస్తున్నారు...మరో ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి ..నేటి జనం పాటలో... ఆ వివరాలను...

Sunday, June 19, 2016 - 13:35

సాహిత్యం సమాజానికి దర్పణం పడుతుంది. ప్రజలను చైతన్యవంతుల్ని చేస్తుంది. ప్రజాపోరాటాలకు మద్ధతునిస్తుంది. ఒక ప్రాంతంలోని ప్రజల జీవనదృశ్యాలను ఆ ప్రాంతపు రచయితలు అక్షరీకరిస్తారు. అలాంటి వారిలో తెలంగాణ కథనశిల్పి బోయజంగయ్య ప్రత్యేక కథనంతో పాటు ,కేంద్రసాహిత్య అకాడమి యువపురస్కార గ్రహీత చైతన్య పింగళి పుస్తక పరిచయంతో ఈ వారం మీ ముందు కొచ్చింది 10 టి.వి.అక్షరం.
అద్భుత కథలుగా...

Sunday, June 12, 2016 - 12:51

తెలుగు సాహిత్యంలో అట్టగు వర్గాల గొంతు వినిపిస్తోంది. అస్తిత్వ సాహిత్యమై చారిత్రక విద్రోహాలను ప్రశ్నిస్తోంది. ఒకప్పుడు రాజుల ఆస్థానాలకు పరిమితమైన సాహిత్యం నేడు దళిత బహుజనుల ధిక్కారస్వర భాస్వరమై ప్రకాశిస్తోంది. వెయ్యేళ్ళ తెలుగు సాహితీ చరిత్రను పరిశీలిస్తే అందులో దళిత బహుజనుల సృజనకారులకు చోటు లేదు. అందుకే వారి చరిత్రలు మరుగున పడిపోయాయి. వారి పూర్వీకులు ఎలా జీవించారో వారి...

Sunday, June 12, 2016 - 12:46

గోదావరి నదీపరీవాహక ప్రాంతంలో అనాదిగా ఆదివాసీలు నివసిస్తున్నారు. వారి కళలు సంస్కృతి, జీవన విధానం అన్నీ నదిపై ఆధారపడి ఉంటాయి. ఈ విషయంపై పరిశోధనలు చేసి 'వెన్ గోదావరీ కమ్స్' అన్న పుస్తకాన్ని వెలువరించారు ఉమామహేశ్వరి. ఆదివాసీల హృదయలయల అలల గలగలలు వినిపించే గోదావరినది చరిత్రకు అక్షరరూపమిచ్చారామె. ప్రముఖ రచయిత్రి పరిశోధకురాలు ఉమామహేశ్వరి ఎంతో శ్రమించి రాసిన వెన్ గోదావరి కమ్స్...

Sunday, June 5, 2016 - 15:13

పాలమూరు మట్టిబిడ్డడు..నిరక్షరాస్యుడు..గొర్రెల పెంపకమే వృత్తిగా కలిగిన వాగ్గేయకారుడు..అతడే కొండన్న..ఈయనకు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులున్నారు. చదువు రాకపోయినా పాటలు రాయడం ఎలా వచ్చింది ? కుటుంబ జీవితం ఎలా మొదలయ్యింది ? గొర్లు..మహబూబ్ నగర్ కరవు పరిస్థితులు..అడవుల్లో పక్షుల కిలకిలలు..గువ్వలకు సంబంధించిన..చిలుకల పలుకులు..తెలంగాణ ఉద్యమంపై..ఇలా అంశాలపై కొండన్న పాటలు రాసిండు. మస్త్...

Sunday, June 5, 2016 - 13:03

భారత దేశంలో కుల సమాజం ఉంది. ఆ కులాలలో కూడా ఉపకులాలు ఉన్నాయి. దీంతో కుల వర్గీకరణ సమస్య ఒక సవాలుగా మారింది. ఈ నేపథ్యంలో ఎస్సీ ఉపకులాల సమైఖ్యతను ఆశిస్తూ ఇటీవల ఉప్పోళ్ల రమేష్ సంపాదకత్వంలో 'కువ్వ' అన్న కవితా సంకలనం వెలువడింది. అన్ని వర్గాల కవుల కలాల కదలికలతో వెలువడిన కవితా కదంబమది. ఒక ప్రత్యేక ప్రయోజనాన్ని ఆశిస్తూ వెలువరించిన 'కువ్వ' కవితా సంపుటిలోని కవిత్వాన్ని ప్రముఖ సాహితీ...

Sunday, June 5, 2016 - 12:58

ఒకనాడు సాహిత్యం కొంతమందికే పరిమితమై ఉండేది. నేడు అన్ని వర్గాల ప్రజలనుండి సృజనకారులు పుట్టుకొచ్చారు. తమ అస్తిత్వ మూలాలను అన్వేషిస్తూ సాహిత్యం సృష్టిస్తున్నారు. సామాజిక న్యాయం కోసం నిలదీస్తున్నారు. ధిక్కార స్వరాలు వినిపిస్తున్నారు. ప్రజాచైతన్య బావుటాలను ఎగరేస్తున్నారు. అలాంటి వారిలో జనం పాటలతో ప్రజలను చైతన్య పరుస్తున్నారు. పాట ఎప్పుడు ఎక్కడ ఎలా పుట్టిందో ఎవరైనా చెప్పగలరా?...

Monday, May 30, 2016 - 20:19

నేను ఆకాశం నీవు భూమి

నేను లేని నీవు అసంపూర్ణం

నాలో జ్వలిస్తున్న జ్వాలకు

వారసత్వం కోసం అన్వేషణ నాప్రేమ

ప్రేమించడం ప్రేమింపబడటం మిథ్య

అన్ని అనుబంధాలు అబద్దాలు,అవి అవసరాలు...

అంటూ స్త్రీపురుషుల సంబంధాలలోని డొల్లతనాన్ని కవిత్వంలో ఎండగట్టిన ప్రగతిశీల భావాల కవయిత్రి జ్వలిత.సమాజంలోని ప్రతి సంఘటనకు స్పందిస్తూ కవిత్వమై జ్వలించే కవన జ్వాల ఆమె...

Monday, May 30, 2016 - 20:13

ఆధునికి తెలుగు కథాసాహిత్యం కొత్తపుంతలు తొక్కుతోంది.ఎందరో యువతీ యువకులు అద్భుతమైన కథలు రాస్తున్నారు.వయసుకు మించిన పరిణతి, ప్రతిభ,సామాజిక సమస్యల విశ్లేషణ వీరి కథల్లో కనిపిస్తుంది.అలాంటి వారిలో ఎండ్లూరి మానస ఒకరు.పిన్నవయసులోనే ఆమె అద్భుతమైన కథలు రాసి తెలుగు కథాప్రియులను అబ్బుర పరిచింది.మానస రాసింది కేవలం పది కథలే అయినప్పటికి ఒక్కో కథ ఒక్కో ఆణి ముత్యంలా మెరుస్తూ అందరి దృష్టిని...

Sunday, May 15, 2016 - 14:28

పాటను తూటాలా ప్రజలగుండెల్లో పేల్చిన గేయ రచయితలెందరో ఉన్నారు. సమాజంలోని అనేక అంశాలపై వీరు పాటలు రాశారు. ప్రజా చైతన్యమే వీరి లక్ష్యం. అలాంటి వారిలో ఆర్.ఎ.వాసు ఒకరు. 

రైతుల కష్టాలను, వలసలను, చేనేత పరిశ్రమ దుస్థితిని, పేదపిల్లలు చదువుకునే హాస్టళ్ళ పరిస్థితిని, నిరుపేదలు జానెడు స్థలానికి కూడా నోచుకోని కడు దయనీయ పరిస్థితులను ఈ గేయ కవి తన పాటల్లో హృదయ విదారకంగా వర్ణించాడు....

Sunday, May 15, 2016 - 14:23

షాజహానా

        ఈ భూమి మీద నీ పాదమెంతో 
        నా పాదమూ అంతే
        అయినా కాలు బయట పెట్టడానికి 
        నాకు అవకాశమే లేదు
        అలసిన నామనసు  ఆనుకోడానికి
        ఇక్కడ స్థలం లేదు
        మరోగ్రహం ఏదైనా ఉందేమో వెతుక్కోవాలి
అంటూ పురుషాధిక్య సమాజంలో స్త్రీలకు స్వేచ్ఛలేదని.. మనిషిగా జీవించే హక్కు కూడా లేదని వాపోతూ అద్భుత...

Pages

Don't Miss