అక్షరం

Sunday, February 28, 2016 - 12:14

వివిధ సాహితీ వేదికల వేడుకల విశేషాల్లేంటో వీడియోలో చూడండి.. 

Sunday, February 21, 2016 - 13:27

బిక్కి కృష్ణ గారు రచించిన 'కాలం నది ఒడ్డున' పుస్తకం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. ఆ వివేశాలు వీడియోలో చూడగలరు. 

Sunday, February 21, 2016 - 12:46

కోరస్, నెత్తుటి వెన్నెల, అక్షర కవాతు లాంటి కవితా సంపుటాలతో తెలుగు సాహిత్యంలోకి దూసుకొచ్చిన అభ్యుదయ కవిత్వపు చైతన్య కెరటం దామెర రాములు. వస్తు వైవిధ్యం,శిల్ప శోయగంతో ఆయన కవిత్వం రాస్తుంటారు. వరంగల్ జిల్లాకు చెందిన ప్రముఖ కవి దామెర రాములుపై ప్రత్యేక కథనం. తెలుసుకోవాలంటే వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 21, 2016 - 12:42

తెలుగు సాహిత్యంలో స్త్రీవాద సాహిత్యానికి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది.ఇటీవల కాలంలో స్త్రీవాదం వెనుక బడిందన్న అపవాదును పటాపంచలు చేస్తూ ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక జాతీయ స్థాయి సదస్సులు ఏర్పాటు చేస్తూ అన్ని ప్రాంతాల మహిళల సమస్యలపై చర్చలు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబార్ లోని ఆంధ్ర మహిళా సభలో ప్ర.ర.వే. నిర్వహించిన జాతీయ సదస్సు విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి. 

Sunday, February 14, 2016 - 13:35

అరుణ్ సాగర్.. ఈ పేరుకో వైబ్రేషన్.. ఎలక్ట్రానిక్ మీడియాలో అతనో  సెన్సేషన్. కవిత్వాభిమానులకు ఇష్టమైన అబ్సెషన్. ఒక్కమాటలో చెప్పాలంటే అరుణ్ సాగర్ అంటే కొత్తదనం, సూటిదనం, ఓ విస్ఫోటనం, ప్రవహించే ఎర్రదనం. తెలుగు కవిత్వాన్ని కొత్త పుంతలు తొక్కించిన కవి ఆయన. స్వర్ణ భస్మమురా మన కవిత, అలజడి చెందిన అక్షర సమూహమన్న  నిత్య నవయవ్వన కవి. సీలేరు ఒడ్డున విరుగుతున్న విల్లు ఫెటఫేటేల్ ధ్వానాల్...

Sunday, February 7, 2016 - 11:58

నాడు శంబూకుని శిరస్సు తెగిపడటం ఓ కుట్ర.. ఏకలవ్యుని బొటవ్రేలును గురుదక్షిణగా తెగ్గొట్టడం ఓ కుట్ర.. నేడు రోహిత్ ను ఆత్మహత్యకు పురికొల్పడం మరో కుట్ర. తరాలు మారుతున్నా.. మారని వివక్ష అనేక రూపాల్లో అన్ని దిక్కులనుండీ కబళిస్తుంటే విలవిల్లాడిన సున్నిత హృదయం అతనిది. ఎన్నో కలలతో ఆశలతో ఆశయాలతో యూనివర్సిటీలలో చదువుకోవాలని వచ్చిన దళిత విద్యార్థులు ఇలా అర్థాంతరంగా తనువులు చాలించడం...

Sunday, January 31, 2016 - 13:51

సాహిత్యం సమాజాన్ని ప్రభావితం చేస్తుందా..? మనుషుల్లో మార్పును తీసుకొస్తుందా? ప్రజలను ఉద్యమాల బాట పట్టిస్తుందా? అంటే ఇలాంటి ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానం చెప్పుకోవాలి. ఎందరో  కవులు రచయితలు, నాటకకర్తలు సమాజహితం కోసం రచనలు చేస్తూనే ఉన్నారు. ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారు. అలాంటి వారిలో  దెంచనాల శ్రీనివాస్ ఒకరు. కవి, నాటక రచయిత దెంచనాల శ్రీనివాస్ ప్రత్యేక కథనంతో పాటు కంటి...

Sunday, January 24, 2016 - 12:53

దళిత బహుజన భావజాలంతో అద్భుతమైన అభివ్యక్తితో కవిత్వం రాస్తున్నకవి యం వెంకట్. ఆయన రాసిన వర్జి కావ్యం సంచలనం సృష్టించింది. సముద్రం నేపథ్యంగా మత్స్యకారుల ఛిద్రమైన జీవన చిత్రాలకు అద్దం పట్టే కవిత్వం రాసిన అసలు సిసలైన కవి ఆయన. నల్గొండ జిల్లాకు చెందిన కవి వెంకట్ కవిత్వం ధిక్కార స్వరమై ఎగసింది. సాహితీ విశ్లేషకులు జి.లక్ష్మీనర్సయ్యగారి వ్యాఖ్యానంతో వెంకట్ పై ప్రత్యేక కథనం. మరిన్ని...

Sunday, January 24, 2016 - 12:51

సాహిత్యం సామాన్య ప్రజలను సైతం కదిలించాలి. వారిని ఆలోచింపజేయాలి. చైతన్యవంతులను చేయాలి. అన్యాయాలను అక్రమాలను ఎదిరించే ఉద్దీపన శక్తిగా పనిచేయాలి. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో మన మధ్యలో ఉన్నారు. ఈ పేరు వింటేనే ...కల్పన, దొంగల సంత, మహిత, పుష్పవర్ణమాసం మెుదలైన అద్భుత కథలు గుర్తొస్తాయి. నిశిత పరిశీలనతో, వాస్తవికత ఉట్టి పడే విధంగా కథలల్లడంలో ఆమె దిట్ట. ఆమె కేవలం కథలే...

Sunday, January 17, 2016 - 12:42

ఆధునిక తెలుగు సాహిత్యంలో అగ్రశ్రేణి విమర్శకునిగా, ప్రముఖ కవిగా వెలుగొందిన అద్దేపల్లి రామ్మోహన్ రావు ఇటీవలే కన్ను మూశారు. తన 80ఏళ్ల జీవితంలో సుమారు 55 ఏళ్లు రచనలు చేసి ఎందరో కవులను, రచయితలను ప్రభావితం చేశారు. తన పాఠలతో… గజల్స్ గానంతో సాహితీ వేదికలను ఉర్రూతలూగించిన ఆయన గళం మూగబోయింది. అందరినీ ప్రేమించే అరుదైన వ్యక్తి, స్నేహశీలి, ప్రముఖ కవి, సాహితీ విమర్శకులు అద్దేపల్లి...

Sunday, January 10, 2016 - 12:44

హైదరాబాద్ : భారతీయ సాహిత్యంలో ఎంతో వైవిద్యం, వైరుధ్యం ఉంది. అయితే అస్థితత్వ ఉద్యమాల నేపథ్యంలో అన్ని వర్గాల నుంచి కవులు, రచయితలు వచ్చారు. ప్రపంచ సాహితీ పరిచయంతో వస్తు శిల్పాల్లో ఊహించని మార్పులు వచ్చాయి. రచయితలు అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు అందుకుని గుర్తింపు పొందారు. అలాంటి వారిలో బుకర్ ప్రైజ్ అందుకున్న అరవింద్ అడిగా ఒకరు. 2008లో బుకర్ ప్రైజ్ అందుకున్న...

Sunday, January 3, 2016 - 13:21

వనితా కవితా లత మనలేవు లేక జత అన్నాడో సినీ కవి. నిజమే సాహితీరంగంలో కృషిచేసే కవులకు కళాకారులకు ప్రోత్సాహం అవసరం. అలాంటి సాహితీ వేదికలు, సాంస్కృతిక సంస్థలు చాలా తక్కువగానే కనిపిస్తాయి. అలాంటి సంస్థల్లో ఖమ్మంజిల్లాకు చెందిన మువ్వా రంగయ్య పద్మావతీ చారిటబుల్ ట్రస్ట్ ఒకటి. ఈ సంస్థ ప్రతి యేటా సుప్రసిద్ద కవులకు, కళాకారులకు  అవార్డులు ప్రదానం చేస్తోంది. ప్రముఖులు రాసిన పుస్తకాలను...

Sunday, January 3, 2016 - 13:18

జూపాక సుభద్ర .. ఈ పేరు వింటేనే ఒక దళిత ధిక్కార స్వరం కంచుకంఠంతో ధ్వనిస్తుంది. తెలంగాణా దళిత వాడల విషాద జీవనకథనాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. దళిత స్త్రీల గుండె ఘోషలు వినిపిస్తాయి. తెలంగాణా దళిత స్త్రీల వేదనలను విషాద జీవితాలను కథలుగా కవితలుగా అక్షరబద్ధం చేసిన ప్రముఖ కవయిత్రి కథనశిల్పి జూపాక సుభద్ర సాహిత్యాన్ని విశ్లేషిస్తారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య.....

Sunday, January 3, 2016 - 13:16

సాహిత్యం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.మానసిక వికాసానికి వేదిక అవుతుంది.భావోద్వేగాలతో రసానుభూతికి గురిచేస్తుంది.అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో దేశంలో ఉన్నారు.అలాంటి వారిలో 2015 జ్ఞానపీఠపురస్కారం పొందిన  గుజరాత్ కవి రఘువీర్ చౌదరి ఒకరు. ఒక కవిగా నవలాకారునిగా నాటక కర్తగా, సాహితీ విమర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన గుజరాత్ సాహితీ మూర్తి రఘువీర్ చౌదరిని 2015...

Sunday, December 27, 2015 - 07:07

చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక్క మంచి పుస్తకం కొనుక్కో ..అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్ నెట్ లు, బ్లాగులు, ఫేస్ బుక్ లు ఎన్నో అందుబాటులోకొచ్చాయి. అయినా పుస్తకాలకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిరూపించింది. తెలంగాణా కళాభవన్ లో ఈ నెల 18 నుండి 27 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగింది. సమీక్షా కథనం కోసం వీడియో...

Sunday, December 27, 2015 - 07:05

దళిత అస్తిత్వవాదం తెలుగులో డ్రైవింగ్ ఫోర్సుతో ప్రవేశించింది. ఎందరో దళిత కవులు రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. బలమైన అభివ్యక్తితో కవితా సంపుటాలు వెలువరించారు. అలాంటి వారిలో ఖడ్గచాలనం, శబ్దధనువు లాంటి కవితా సంకలనాలు వెలువరించిన ధనుంజయ ఒకరు. అన్వేషి పేరుతో దళిత స్పృహతో అద్భుత కవిత్వం రాస్తున్న ధనుంజయ పరిచయ కథనం నేటి కొత్తకెరటాల్లో. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి....

Sunday, December 27, 2015 - 07:03

ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేది సాహిత్యం. పశుత్వం కలిగిన హృదయాలను సంస్కరించి మానవత్వం వైపు నడిపించేది సాహిత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే... హితం చేకూర్చేది సాహిత్యం. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో ప్రముఖ నటుడు, కవి, సాహితీ సహృదయుడు, స్నేహశీలి రంగనాథ్ ఒకరు. ఇటీవల కన్నుమూసిన రంగనాథ్ ప్రత్యేక కథనం. రంగనాథ్..ఈ పేరువింటేనే పంతులమ్మ, అమెరికా అమ్మాయిలాంటి సినిమాలే...

Sunday, December 20, 2015 - 12:32

హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2014 సంవత్సరానికి గాను ప్రముఖ దళిత కవి విల్సన్ సుధాకర్ రాసిన మాకూ ఒక భాష కావాలి కవితా సంపుటికి, 2015 సంవత్సరానికి ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి రాసిన పూలండోయ్ పూలు కవితా సంపుటికి 2015 ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డులను అందజేశారు. 

Sunday, December 20, 2015 - 10:52

సాహిత్యం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అస్తిత్వ సాహిత్య ఉద్యమాల ద్వారా స్త్రీలు దళితులు చైతన్యవంతులయ్యారు. దాని వెనుక ఎందరో సృజనకారులు రచయితల కృషి ఉంది. అలాంటి వారిలో తెలుగు స్త్రీవాద సాహిత్యానికి ఒకదశను దిశను నిర్దేశించిన ప్రముఖ రచయిత్రి ఓల్గా ఒకరు. ఆమెను ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి ఈ అవార్డు లభించింది...

Thursday, December 17, 2015 - 17:21

హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి ఓల్గా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2015కు గాను ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విముక్త అనే కథా సంపుటికిగాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో లోక్‌నాయక్‌ అవార్డు, మార్చిలో కందుకూరి స్మారక పురస్కారం, నవంబర్‌లో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఓల్గా అసలు పేరు పోపూరి...

Sunday, December 13, 2015 - 12:41

హైదరాబాద్ : సాహిత్యం సమాజాన్ని సంస్కరిస్తుంది. మంచి చెడ్డలను విడమర్చి చెప్తుంది. మానవ జాతి పురోగమనానికి సూచీ అవుతోంది. ప్రజలకు విజ్ఞాన వినోదాన్ని అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో వాహిద్ ఒకరు. గజల్ రచయిత 'వాహిద్' ప్రత్యేక కథనంతో పాటు... ప్రజా గేయ రచయిత గంగిరెడ్డి సన్యాసిరావు జనం పాట, యువ కవి డాక్టర్ కత్తిమళ్ల ప్రతాప్ యువ కథనాలతో.. వివిధ...

Sunday, December 6, 2015 - 14:14

మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండెకులములు. మంచి అన్నది మాలయైతే..ఆ మాల నేనగుదున్... అంటూ సగర్వంగా ఆనాడే ప్రకటించి కులం పునాదులు కదిలించిన ధిక్కారస్వర కవితా తరంగం గురజాడ. అందుకే వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ముగ్గురే మహాకవులని ..వారిలో తెలుగుకు కావ్య గౌరవం కల్పించిన తిక్కన, అచ్చ తెనుగులో ఆటవెలది పద్యాలకు ప్రాణం పోసిన వేమన, తెలుగు జీవద్భాషకు పట్టంగట్టిన గురజాడ..ఈ ముగ్గురే...

Sunday, December 6, 2015 - 14:13

ఆధునికి తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపుతిప్పి దిశానిర్దేశం చేసిన మహాకవి గురజాడ అప్పారావ్. అంత వరకు వచ్చిన ఇతిహాస కావ్య ప్రబంధ సాహిత్యాలను పక్కనపెట్టి ఆధునికి భాషకు, ప్రజా సాహిత్యానికి పట్టం గట్టిన మహా రచయిత గురజాడ. ఒకవైపు దేశభక్తిని, మరోవైపు వ్యవహారికి భాషోద్యమాన్ని, ఇంకోవైపు సంఘసంస్కరణ రచనలను ఏకకాలంలో సమాజంపై విసరేసి పెనుదుమారం సృష్టించిన సృజనచైతన్య ఝంఝామారుతమతడు. అధునాతన...

Sunday, November 29, 2015 - 12:54

కొందరు పాటలను వినోదం కోసం రాస్తారు. మరి కొందరు విజ్ఞానం కోసం రాస్తారు. కాని తెలంగాణా గేయ రచయితలు మాత్రం వినోదం, విజ్ఞానంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఎక్కువగా పాటలల్లారు. అలాంటి వారిలో బండి సత్తెన్న ఒకరు. అక్షరాస్యత మెదలుకొని అమరవీరులను కీర్తించే వరకు వస్తు వైవిధ్యంతో ఆయన ఎన్నో పాటలు రాశారు. ప్రముఖ గేయ రచయిత బండి సత్తెన్న జనం పాటలపై ప్రత్యేక కథనం..

Sunday, November 29, 2015 - 12:52

సాహిత్యం సమాజానికి దిక్సూచిలాంటిది. ప్రజల్లోమూఢ నమ్మకాలు మూర్ఖపు విశ్వాసాలను తొలగించడానికి సాహిత్యం తోడ్పడుతుంది. ప్రగతిశీల భావాలు పెంపొందించడానికి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో గురజాడ అప్పారావ్ కు మెదటి స్థానం దక్కుతుంది. నవంబర్ 30 న గురజాడ వర్థంతి. ''దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా'' అన్నారు మహాకవి గురజాడ అప్పారావ్ ....

Sunday, November 22, 2015 - 12:47

జయధీర్ తిరుమల రావు..ఈ పేరు వింటేనే అట్టడుగు వర్గాల సాహిత్యానికి అక్షర రూపం ఇచ్చిన ఒక పరిశోధకుడు. ఒక సృజన శీలి. ఒక కవి. ఆయన వివిధ ప్రాంతాల్లో అధ్యాపకుడిగా పనిచేస్తూనే గిరిజన సంస్కృతి...జానపద కళారూపాలు తెలంగాణ పోరాట ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని వెలుగులోకి తె చ్చారు. అలాంటి నిబద్ధత కలిగిన రచయిత..పరిశోధకులు..కవి..సాహితి విమర్శకులు జయదేవ్ తిరుమల రావుపై ప్రత్యేక కథనం.....

Sunday, November 1, 2015 - 10:50

జి.లక్ష్మీనర్సయ్య ..ఈ పేరు వింటేనే మనకు రెండు దశాబ్దాలక్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కవితా నిర్మాణ పద్ధతులు,సామాజిక కళావిమర్శ వ్యాసపరంపరలే గుర్తొస్తాయి. ఆధునిక సాహిత్య విమర్శలో ఆయన ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధికారికమైన ఆయన విమర్శ తెలుగు సాహిత్యంలో పెను దుమారం రేపింది. అంతే కాదు దళిత బహుజన సృజన కారులను ఎందరినో వెలుగు లోనికి తెచ్చిన ఘనత లక్ష్మీనర్సయ్య గారికే...

Pages

Don't Miss