అక్షరం

Sunday, January 3, 2016 - 13:18

జూపాక సుభద్ర .. ఈ పేరు వింటేనే ఒక దళిత ధిక్కార స్వరం కంచుకంఠంతో ధ్వనిస్తుంది. తెలంగాణా దళిత వాడల విషాద జీవనకథనాలు కళ్లముందు సాక్షాత్కరిస్తాయి. దళిత స్త్రీల గుండె ఘోషలు వినిపిస్తాయి. తెలంగాణా దళిత స్త్రీల వేదనలను విషాద జీవితాలను కథలుగా కవితలుగా అక్షరబద్ధం చేసిన ప్రముఖ కవయిత్రి కథనశిల్పి జూపాక సుభద్ర సాహిత్యాన్ని విశ్లేషిస్తారు ప్రముఖ సాహితీ విమర్శకులు జి.లక్ష్మీనర్సయ్య.....

Sunday, January 3, 2016 - 13:16

సాహిత్యం సామాజిక మార్పుకు దోహదపడుతుంది.మానసిక వికాసానికి వేదిక అవుతుంది.భావోద్వేగాలతో రసానుభూతికి గురిచేస్తుంది.అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో దేశంలో ఉన్నారు.అలాంటి వారిలో 2015 జ్ఞానపీఠపురస్కారం పొందిన  గుజరాత్ కవి రఘువీర్ చౌదరి ఒకరు. ఒక కవిగా నవలాకారునిగా నాటక కర్తగా, సాహితీ విమర్శకునిగా బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించిన గుజరాత్ సాహితీ మూర్తి రఘువీర్ చౌదరిని 2015...

Sunday, December 27, 2015 - 07:07

చినిగిన చొక్కా అయినా తొడుక్కో ఒక్క మంచి పుస్తకం కొనుక్కో ..అన్నారు కందుకూరి వీరేశలింగం పంతులు. ఈ కంప్యూటర్ యుగంలో ఇంటర్ నెట్ లు, బ్లాగులు, ఫేస్ బుక్ లు ఎన్నో అందుబాటులోకొచ్చాయి. అయినా పుస్తకాలకున్న డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. ఇదే విషయాన్ని హైదరాబాద్ బుక్ ఫెయిర్ నిరూపించింది. తెలంగాణా కళాభవన్ లో ఈ నెల 18 నుండి 27 వరకు హైదరాబాద్ బుక్ ఫెయిర్ జరిగింది. సమీక్షా కథనం కోసం వీడియో...

Sunday, December 27, 2015 - 07:05

దళిత అస్తిత్వవాదం తెలుగులో డ్రైవింగ్ ఫోర్సుతో ప్రవేశించింది. ఎందరో దళిత కవులు రచయితలు తమ కలాలకు పదును పెట్టారు. బలమైన అభివ్యక్తితో కవితా సంపుటాలు వెలువరించారు. అలాంటి వారిలో ఖడ్గచాలనం, శబ్దధనువు లాంటి కవితా సంకలనాలు వెలువరించిన ధనుంజయ ఒకరు. అన్వేషి పేరుతో దళిత స్పృహతో అద్భుత కవిత్వం రాస్తున్న ధనుంజయ పరిచయ కథనం నేటి కొత్తకెరటాల్లో. విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి....

Sunday, December 27, 2015 - 07:03

ప్రజలకు విజ్ఞానాన్ని వినోదాన్ని పంచేది సాహిత్యం. పశుత్వం కలిగిన హృదయాలను సంస్కరించి మానవత్వం వైపు నడిపించేది సాహిత్యం. ఒక్కమాటలో చెప్పాలంటే... హితం చేకూర్చేది సాహిత్యం. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో ప్రముఖ నటుడు, కవి, సాహితీ సహృదయుడు, స్నేహశీలి రంగనాథ్ ఒకరు. ఇటీవల కన్నుమూసిన రంగనాథ్ ప్రత్యేక కథనం. రంగనాథ్..ఈ పేరువింటేనే పంతులమ్మ, అమెరికా అమ్మాయిలాంటి సినిమాలే...

Sunday, December 20, 2015 - 12:32

హైదరాబాద్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆడిటోరియంలో ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డుల ప్రధానోత్సవం జరిగింది. 2014 సంవత్సరానికి గాను ప్రముఖ దళిత కవి విల్సన్ సుధాకర్ రాసిన మాకూ ఒక భాష కావాలి కవితా సంపుటికి, 2015 సంవత్సరానికి ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి రాసిన పూలండోయ్ పూలు కవితా సంపుటికి 2015 ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డులను అందజేశారు. 

Sunday, December 20, 2015 - 10:52

సాహిత్యం సమాజాన్ని ఎంతగానో ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా అస్తిత్వ సాహిత్య ఉద్యమాల ద్వారా స్త్రీలు దళితులు చైతన్యవంతులయ్యారు. దాని వెనుక ఎందరో సృజనకారులు రచయితల కృషి ఉంది. అలాంటి వారిలో తెలుగు స్త్రీవాద సాహిత్యానికి ఒకదశను దిశను నిర్దేశించిన ప్రముఖ రచయిత్రి ఓల్గా ఒకరు. ఆమెను ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. ఓల్గా రాసిన విముక్త కథల సంపుటికి ఈ అవార్డు లభించింది...

Thursday, December 17, 2015 - 17:21

హైదరాబాద్ : ప్రముఖ రచయిత్రి ఓల్గా కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. 2015కు గాను ఓల్గాకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించింది. విముక్త అనే కథా సంపుటికిగాను ఆమె ఈ అవార్డు దక్కించుకున్నారు. ఈ ఏడాది జనవరిలో లోక్‌నాయక్‌ అవార్డు, మార్చిలో కందుకూరి స్మారక పురస్కారం, నవంబర్‌లో ప్రతిభా పురస్కారాన్ని అందుకున్నారు. ఓల్గా అసలు పేరు పోపూరి...

Sunday, December 13, 2015 - 12:41

హైదరాబాద్ : సాహిత్యం సమాజాన్ని సంస్కరిస్తుంది. మంచి చెడ్డలను విడమర్చి చెప్తుంది. మానవ జాతి పురోగమనానికి సూచీ అవుతోంది. ప్రజలకు విజ్ఞాన వినోదాన్ని అందిస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో వాహిద్ ఒకరు. గజల్ రచయిత 'వాహిద్' ప్రత్యేక కథనంతో పాటు... ప్రజా గేయ రచయిత గంగిరెడ్డి సన్యాసిరావు జనం పాట, యువ కవి డాక్టర్ కత్తిమళ్ల ప్రతాప్ యువ కథనాలతో.. వివిధ...

Sunday, December 6, 2015 - 14:14

మంచి చెడ్డలు ఎంచి చూడగ మనుజులందున రెండెకులములు. మంచి అన్నది మాలయైతే..ఆ మాల నేనగుదున్... అంటూ సగర్వంగా ఆనాడే ప్రకటించి కులం పునాదులు కదిలించిన ధిక్కారస్వర కవితా తరంగం గురజాడ. అందుకే వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో ముగ్గురే మహాకవులని ..వారిలో తెలుగుకు కావ్య గౌరవం కల్పించిన తిక్కన, అచ్చ తెనుగులో ఆటవెలది పద్యాలకు ప్రాణం పోసిన వేమన, తెలుగు జీవద్భాషకు పట్టంగట్టిన గురజాడ..ఈ ముగ్గురే...

Sunday, December 6, 2015 - 14:13

ఆధునికి తెలుగు సాహిత్యాన్ని ఒక మలుపుతిప్పి దిశానిర్దేశం చేసిన మహాకవి గురజాడ అప్పారావ్. అంత వరకు వచ్చిన ఇతిహాస కావ్య ప్రబంధ సాహిత్యాలను పక్కనపెట్టి ఆధునికి భాషకు, ప్రజా సాహిత్యానికి పట్టం గట్టిన మహా రచయిత గురజాడ. ఒకవైపు దేశభక్తిని, మరోవైపు వ్యవహారికి భాషోద్యమాన్ని, ఇంకోవైపు సంఘసంస్కరణ రచనలను ఏకకాలంలో సమాజంపై విసరేసి పెనుదుమారం సృష్టించిన సృజనచైతన్య ఝంఝామారుతమతడు. అధునాతన...

Sunday, November 29, 2015 - 12:54

కొందరు పాటలను వినోదం కోసం రాస్తారు. మరి కొందరు విజ్ఞానం కోసం రాస్తారు. కాని తెలంగాణా గేయ రచయితలు మాత్రం వినోదం, విజ్ఞానంతో పాటు ప్రజలను చైతన్యవంతం చేయడానికే ఎక్కువగా పాటలల్లారు. అలాంటి వారిలో బండి సత్తెన్న ఒకరు. అక్షరాస్యత మెదలుకొని అమరవీరులను కీర్తించే వరకు వస్తు వైవిధ్యంతో ఆయన ఎన్నో పాటలు రాశారు. ప్రముఖ గేయ రచయిత బండి సత్తెన్న జనం పాటలపై ప్రత్యేక కథనం..

Sunday, November 29, 2015 - 12:52

సాహిత్యం సమాజానికి దిక్సూచిలాంటిది. ప్రజల్లోమూఢ నమ్మకాలు మూర్ఖపు విశ్వాసాలను తొలగించడానికి సాహిత్యం తోడ్పడుతుంది. ప్రగతిశీల భావాలు పెంపొందించడానికి సాహిత్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో గురజాడ అప్పారావ్ కు మెదటి స్థానం దక్కుతుంది. నవంబర్ 30 న గురజాడ వర్థంతి. ''దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా'' అన్నారు మహాకవి గురజాడ అప్పారావ్ ....

Sunday, November 22, 2015 - 12:47

జయధీర్ తిరుమల రావు..ఈ పేరు వింటేనే అట్టడుగు వర్గాల సాహిత్యానికి అక్షర రూపం ఇచ్చిన ఒక పరిశోధకుడు. ఒక సృజన శీలి. ఒక కవి. ఆయన వివిధ ప్రాంతాల్లో అధ్యాపకుడిగా పనిచేస్తూనే గిరిజన సంస్కృతి...జానపద కళారూపాలు తెలంగాణ పోరాట ఉద్యమాల నేపథ్యంలో వచ్చిన సాహిత్యాన్ని వెలుగులోకి తె చ్చారు. అలాంటి నిబద్ధత కలిగిన రచయిత..పరిశోధకులు..కవి..సాహితి విమర్శకులు జయదేవ్ తిరుమల రావుపై ప్రత్యేక కథనం.....

Sunday, November 1, 2015 - 10:50

జి.లక్ష్మీనర్సయ్య ..ఈ పేరు వింటేనే మనకు రెండు దశాబ్దాలక్రితం ఆంధ్రజ్యోతిలో వచ్చిన కవితా నిర్మాణ పద్ధతులు,సామాజిక కళావిమర్శ వ్యాసపరంపరలే గుర్తొస్తాయి. ఆధునిక సాహిత్య విమర్శలో ఆయన ఒక సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. సాధికారికమైన ఆయన విమర్శ తెలుగు సాహిత్యంలో పెను దుమారం రేపింది. అంతే కాదు దళిత బహుజన సృజన కారులను ఎందరినో వెలుగు లోనికి తెచ్చిన ఘనత లక్ష్మీనర్సయ్య గారికే...

Sunday, October 25, 2015 - 19:45

కవిత్వం రాస్తే రసం చిప్పిల్లేలా ఉండాలి అన్నారు ప్రబంధకవి మల్లన. కవిత్వం కవిపిండుకున్న తాత్వికబిందువు అంటాడు యుగకవి శేషేంద్ర. ఈ ఇద్దరి కవుల మాటలను అక్షరాలా పాటించి కవిత్వం రాశాడో కవి. ఆయనే మునిమడుగు రాజారవ్. రసం చిప్పిల్లే కవితా పాదాలు, గాఢతాత్విక బిందువుల కలబోతగా కవితలల్లిన మధుర కవి రాజారావ్ పరిచయ కథనం.

Sunday, October 25, 2015 - 19:43

కవి కన్ను ఫ్రిజం..కవిత్వం మెస్మరిజం అన్నారు. మరి అలాంటి మెస్మరిజం కవిత్వాన్ని రాస్తున్న వందలాది కవులు ఒక చోట చేరితే ఎలాఉంటుంది ? ఇక అక్కడ కవిత్వానికి... కవులకు పండగే ..పండగ..అలాంటి పండగవాతావరణం..ఇటీవల కోనసీమలోని అంతర్వేదిలో కనిపించింది. ప్రపంచవ్యాప్తంగా వచ్చిన ఎందరో తెలుగు కవులతో ప్రపంచతెలుగు కవితోత్సవ ప్రాంగణం కళకళలాడింది. అంగరంగ వైభవంగా జరిగిన ప్రపంచ తెలుగు కవితోత్సవంపై...

Sunday, October 25, 2015 - 19:41

సాహిత్యం మానవజాతి వికాసానికి పాదులు వేస్తుంది. మనిషిలోని మృగత్వాన్ని తొలగించి మానవత్వాన్ని మేల్కొల్పుతుంది. మానవ సమూహాలను రసప్రవాహాల్లో ముంచెత్తుతుంది. ఆనందానుభూతులను పంచి పెడుతుంది. వారి భావోద్వేగాలకు అద్దం పడుతుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజలకారులెందరో ఉన్నారు. వారిలో కామల్ల అయిలయ్య ఒకరు. శ్రమ నుండి పాట పుట్టింది. ఆపాటే శ్రమను మరిపించి శ్రామికులను, సమస్త...

Sunday, October 18, 2015 - 13:56

ముసలి ఆకాశాన్ని వదిలి కొండ ఒడిలోకి సూర్యకుమారుడు..కొమ్మ రెక్కల కిందకు పక్షి సమూహం..ఇప్పుడా ఆకాశం ఒంటరి..దాని నిండా చీకటి. అంటూ మంచి భావుకతతో కవిత్వం రాసిన అభ్యుదయ కవి ఏనుగు నరసింహరెడ్డి. ఏ ఆడంబరాలు..అట్టహాసాలు..శబ్ధ డాంభీకాలు లేకుండా విదేశీ కవితల అనుకరణలు లేకుండా స్వచ్చమైన కవిత్వం రాస్తున్న అచ్చమైన పల్లె కవి ఏనుగునరసింహరెడ్డి. రైతు కోసం కవిత్వమై ధ్వనించారు. ఆయనపై పరిచయ కథనం...

Sunday, October 18, 2015 - 13:22

కవులు గుర్తింపు లేని శాసనకర్తలని శెల్లి మహాకవి అన్నారు. కవులే కాదు సృజనకారులు కూడా సామాజిక చైతన్యం కోసం నిరంతరం శ్రమిస్తుంటారు. ఏవో లక్ష్యాలు ఏర్పాటు చేసుకుని అక్షరాల చుట్టూ పరిభ్రమిస్తుంటారు. ప్రజా సమూహాలను కదిలిస్తుంటారు. ఉద్యమాలై ఎగిసి పడుతుంటారు. అలాంటి సృజనకారులకు నేడు దేశంలో రక్షణ కరువైంది. సంఘ విద్రోహ శక్తులు కలంపై జులుం ప్రదర్శిస్తున్నాయి. సృజనకారులను హతమారిస్తే...

Sunday, October 11, 2015 - 12:55

ఇవాళ తెలుగు కవిత్వం వస్తు వైవిధ్యంతో అభివ్యక్తి నవ్యతతో వెలువడుతోంది. ప్రజలను ఆలోచింపజేస్తుంది. బాగా స్పందింపజేస్తుంది. అలాంటి కవిత్వాన్ని పండిస్తున్న తెలుగు కవులలో సీనియర్ కవి జూకంటి జగన్నాథం ఒకరు. తెలంగాణాకు చెందిన ఈ కవి అనేక అంశాలను తనదైన దృక్కోణంలో కవిత్వంగా శిల్పీకరిస్తున్నారు. అనేక కవితా సంపుటాలు ఆవిష్కరించారు. ప్రముఖ కవి,కథకుడు జూకంటి జగన్నాథం పై ప్రత్యేక కథనం.....

Sunday, October 4, 2015 - 19:15

వెయ్యేళ్ళ తెలుగు సాహిత్యంలో కథ చంపూకావ్యాల పుటల్లో దాక్కొని సామాన్య ప్రజలకు చేరువకాలేక పోయింది. 19 వ శతాబ్దప్రారంభం నుండి స్వేచ్ఛగా ప్రజల మధ్య విహరించింది. గురజాడ దిద్దుబాటు కథతో అసలు సిసలైన తెలుగు కథాసాహిత్యం ప్రారంభమయింది. వస్తు శిల్పాల నవ్యతతో పాఠకులను అలరించింది. గత పాతికేళ్ళలో ఎందరో కథా రచయితలు అద్భుత కథలు సృష్టించారు. అలాంటి కథలలో కొన్ని మంచి కథలను ఎంపిక చేసి కథా...

Sunday, October 4, 2015 - 19:13

నాకవితా వధూటి వదనంబు ఎగాదిగాజూచి..భళీ భళీ ..అన్నవాడె నీదేకులమన్న ప్రశ్నవెలయించి చివాలున లేచిపోగా బాకునగుమ్మినట్లయినదని మహాకవి గుర్రం జాషువా బాధపడ్డారు. అంతే కాదు గవ్వకు సాటిరాని పలుకాకుల మూకలు నన్నెవ్విధిదూరిన ననువరించిన శారదలేచిపోవునే అంటూ గంభీరంగా ప్రకటించుకున్నారు. నాల్గుపడగల హైందవనాగరాజును కలం ఖడ్గంతో కుళ్లుబొడిచాడు. అలాంటి నవయుగ కవిచక్రవర్తి, పద్యకవికోకిల, దళిత కవితా...

Sunday, September 20, 2015 - 19:00

జానపదుల హృదయాల నుండి పెల్లుబికి గొంతు నుండి వెల్లువలా పొంగుకొచ్చిన ప్రజారంజక గీతం పాట. అయితే ఈనాడు ఆ పాటను ప్రజలను చైతన్య పరచడానికి గేయ రచయితలు ఉపయోగిస్తున్నారు. అలాంటి వారిలో ఎన్నార్ ఒకరు. తెలంగాణా ప్రాంతంలోని అనేక సామాజిక సమస్యలకు స్పందించి పదునైన పాటలు రాస్తున్న గేయ రచయిత, గాయకుడు ఎన్నార్ జనం పాటను ప్రముఖ గేయ రచయిత స్పూర్తి పరిచయం.

Sunday, September 20, 2015 - 18:55

సాహిత్యం ఎప్పుడు పుట్టింది ? ఎక్కడ పుట్టింది ? అంటే సరైన సమాధానం చెప్పలేం. అయితే మానవులు శ్రమించే క్రమంలో జానపద సాహిత్యం పుట్టింది. ఆ తర్వాత కావ్యాలు ఇతిహాసాలు ప్రబంధాలు ఆధునిక సాహిత్యం వచ్చింది. ఆధునిక సాహిత్యం ప్రజా సాహిత్యంగా పేరు పొందింది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారిలో త్రిపురనేని శ్రీనివాస్ ఒకరు. త్రిపురనేని శ్రీనివాస్.. ఈ పేరు వినగానే రహస్యోద్యమం గుర్తొస్తుంది...

Sunday, September 13, 2015 - 13:21

బిడ్డను లాలించే ఆ చేతులకు.. హద్దు మీరితే శిక్షించడమూ తెలుసు. కరుణ కురిపించే ఆ కనులకు క్రోధంతో కన్నెర్ర చేయడమూ తెలుసు. అంటూ స్త్రీ గురించి క్షమయా ధరిత్రీ కవితను శిల్పీకరించిన కవయిత్రి శైలజాబండారి. ఆమె ఇటీవల చేతి చివర ఆకాశం అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు. కవి సంగమం నుండి ఎగసిపడిన కొసమెరుపుల కవితా రసతరంగం శైలజ బండారి పరిచయ కథనం.

Sunday, September 13, 2015 - 13:20

బతుకు పోరులో సంతసించాల్సిన విషయాలేవీ లేనపుడు పాట ఒక ఊరట. ఊటలన్నీ అడుగంటినపుడు ప్రజల కన్నీటి ధారల ఊట పాట. అలాంటి పాటలను పోరు బాటలో ఎర్రెర్రని జెండాలుగా ఎగరేసిన గేయ రచయిత పయిలం సంతోష్. తెలంగాణా వాగ్గేయ కారుడు, గేయ రచయిత పయిలం సంతోష్ ను నేటి జనం పాటలో ప్రముఖ గేయ రచయిత స్ఫూర్తి పరిచయం చేస్తున్నారు.

Pages

Don't Miss