అక్షరం

Sunday, September 13, 2015 - 13:19

సాహిత్యం సమాసాన్ని సమూలంగా మార్చేస్తుందా? మార్చక పోవచ్చు కాని మనిషిని తీవ్రంగా ఆలోచింపజేస్తుంది. మానవ సమూహాలను కదిలిస్తుంది. వినోదం, విజ్ఞానంతో పాటు సామాజిక చైతన్యాన్ని కూడా కలిగిస్తుంది. సామాజిక పురోగమనానికి దోహదం చేస్తుంది. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన వారెందరో మన మధ్యన ఉన్నారు. రాయలసీమలోని బహుజనుల బతుకు చిత్రాలను రైతుల వ్యథార్థ గాథలను కథలుగా అల్లిన, కథన శిల్పి సుంకోజి...

Sunday, September 6, 2015 - 12:55

మీరే భాషలో పలకరిస్తారో ఆ భాష మీదికాదు...నేను ఏ భాషలో ప్రతిస్పందిస్తానో అది నా భాషకాదు అంటూ.. సరికొత్త భాషలో కవితలు రాసి కవితా ప్రియులను మెస్మరిజం చేస్తూ విస్మయానికి గురి చేశారు యువ కవయిత్రి మెర్సీ మార్గరేట్. సరళమైన భాషలో సుమ సుకుమార భావాలతో అరుదైన ప్రతీకలతో కవితలల్లిన మెర్సీ మార్గరేట్ పరిచయకథనం.

Sunday, September 6, 2015 - 12:50

కొందరు గుండెలను పిండేసే పాటలు రాస్తారు. బడుగుజీవులు కష్టాలను కన్నీళ్ళను అక్షర భాషలోకి అనువదిస్తారు. పాటై ఆక్రోషిస్తాడు. అలాంటి గేయ కవే భానూరి సత్యనారాయణ. నవోదయం, ఎర్రసైన్యం, అరణ్యం లాంటి సినిమాల్లో పేదల ఈతి బాధలను విషాద గీతాలుగా మలిచిన భానురి సత్యనారాయణ జనం పాటలను ప్రముఖ గేయరచయిత స్ఫూర్తి పరిచయం.

Sunday, September 6, 2015 - 12:47

ప్రముఖ అభ్యుదయ నవలాకారుడు కన్నడ సాహితీవేత్త డా.యం.యం.కాల్ బుర్గి హిందూ మతోన్మాదుల చేతుల్లో హత్యకు గురయ్యారు. భారతరాజ్యాంగం భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. అయితే కొందరు మతోన్మాదులు స్వేచ్ఛగా తమ భావాలను ప్రకటించే కవులను రచయితలను మేధావులను దారుణంగా హతమారుస్తున్నారు. తాజాగా కర్నాటకలో ప్రముఖ సాహితీవేత్త కన్నడ హంపి యూనివర్సిటి మాజీవైస్ ఛాన్సర్ డా.యం.యం.కాల్ బుర్గిని...

Sunday, August 30, 2015 - 12:49

నేడు సమాజంలో అన్ని రంగాలలో పురుషులతో పాటు స్త్రీలు సమానంగా ఎదుగుతున్నారు. సాహిత్యరంగంలోనూ..అదే జరిగింది. ఇంతవరకు దాశరధి, సి.నా.రె, పెన్నా, సూరారం శంకర్ లాంటి పురుషులు మాత్రమే చేపట్టిన గజల్ ప్రక్రియను చేపట్టి తొలి గజల్ కవయిత్రిగా పేరు గడించారు డా.యం.బి.డి.శ్యామల. సుహృల్లేఖ, ఆలాపన గజల్స్ తోపాటు నాగుండె గుమ్మానికి పచ్చనాకువై , సజీవ క్షణాలకోసం లాంటి వచన కవితా సంపుటాలు...

Sunday, August 30, 2015 - 12:46

సాహిత్యం సమాజ పురోగమణానికి దిక్సూచిలాంటిది. మానవ సమాజాలు అగాధాలవైపు జారిపోతున్నపుడళ్లా తొలుత ఆందోళన చెందేది సృజనకారులే. నిరంతరం మార్పును ఆశిస్తూ రేపటి తూర్పుకు ఆహ్వానం పలికే కవులు రచయితలు ఎందరో ఉన్నారు. అలాంటి వారిలో అణగారిన కులాల బతుకు చిత్రాలను కథలుగా అక్షరీకరించిన కథన శిల్పి తుమ్మల రామకృష్ణ. గ్రామీణ అభాగ్యుల దుర్భర బతుకు చిత్రాలను ఆయన అద్భుత కథలుగా మలిచారు. తరతరాలుగా...

Sunday, August 23, 2015 - 19:44

ఇప్పుడు ఉగాది పద్యాలు రాసే కాలం పోయింది. అర్థం పర్థంలేని అవధానాలకు కాలం చెల్లింది. యువకులు రక్తం మరిగే శక్తులు మండే ఉద్రిక్త కవిత్వం రాస్తున్నారు. సమాజంలోనూ.. మనుషుల్లోనూ ఉన్న ద్వంద్వనీతిని ప్రశ్నిస్తూ కవితాస్త్రాలు సంధిస్తున్నారు. ఆ కోవకు చెందిన యువకవి కలిదిండి వర్మ. ఆయన ఇటీవల నేను మాత్రం ఇద్దరిని అన్న కవితా సంపుటిని వెలువరించాడు. కవి సంగమం నుండి ఎగసిపడిన సరికొత్త కవితా...

Sunday, August 23, 2015 - 19:41

కథల్లోనూ, కవితల్లోనూ వర్ణించలేని భావావేశాలను పాటల్లో అభివ్యక్తీకరించే గేయకవులెందరో మనమధ్య ఉన్నారు. సాంఘిక దురాచారాలను దుర్భల జాతి జనుల ఈతి బాధలను మానవ సంబంధాల మాధుర్యాలను అద్బుతమైన గేయాలుగా ధ్వనింపజేశారు తెలంగాణాకు చెందిన రాం చందర్ భీంవంశీ. ఆయన రాసిన గేయాలు ప్రజల గుండె గాయాలు, శిధిల బతుకుల రుధిర శిల్పాలు. మానవసంబంధాల మధుసంతకాలు. తల్లి ప్రేమ గురించి రాసినా, చెల్లి వరకట్నపు...

Sunday, August 23, 2015 - 19:39

సాహిత్యం సరికొత్త ఆలోచనలను రేకెత్తిస్తుంది. సమాజపు పురోగమనానికి దోహదం చేస్తుంది. సృజనాత్మక రచయితల వల్లనే సమాజం ఒక అడుగు ముందుకెళుతుంది. అలాంటి కవులు రచయితలెందరో మన సమాజంలో నిబద్ధతతో రచనలు చేస్తున్నారు. వారిలో తన ధిక్కార స్వరంతో బహుజన జీవితాలను కథా శిల్పాలుగా మలుస్తున్న కథనశిల్పి తుమ్మల రామకృష్ణ. ఒకనాడు పచ్చగా కళకళలాడిన పల్లెలు నేడు బోసిపోయి వల్లకాడుల్లా కనిపిస్తున్నాయి....

Sunday, August 16, 2015 - 12:52

శ్రమ నుండి పుట్టిన పాటను తెలంగాణా రచయితలు ప్రజాచైతన్య కేతనంగా ఎగరేస్తున్నారు. ప్రపంచీకరణ నేపథ్యంలో కుల వృత్తులు ధ్వంసం కావడం చూసి చలించి జ్వలించి ఎందరో గేయ రచయితలు అద్భుతమైన పాటలు రాస్తున్నారు. అలాంటి వారిలో అంబటి వెంకన్న ఒకరు. వస్తు వైవిధ్యంతో అంబటి వెంకన్న ప్రజా చైతన్య గేయాలు రాస్తున్నారు. 

Sunday, August 16, 2015 - 12:48

మనువు రాజ్యాంగం కూలటం మీ దురదృష్టమైతే మా అంబేద్కర్ రాజ్యాంగం కూర్చటం మా అదృష్టం అంటూ బలమైన భావజాలంతో కవిత్వాన్ని దళిత కవి నేతల ప్రతాప్ కుమార్ వినిపిస్తున్నారు. ఆయన రాసిన 'అన్నంగిన్నె' కవితాసంపుటి తెలుగు సాహిత్యంలో కొత్త భావ ప్రకంపనలు రేకెత్తించింది. ఉదయాలన్నీ ఇప్పుడు భూపాల రాగాలతో కాదు భీమ్ పాల రాగాలతో పల్లవించాలంటున్న నేతల ప్రతాప్ కుమార్ పరిచయ కథనం.

Sunday, August 16, 2015 - 12:44

సాహిత్యం ప్రజల హృదయాలను కదిలిస్తుంది..కరిగిస్తుంది. భావోద్వేగాలను రగిలిస్తుంది. ప్రజా సమూహాలను చైతన్య ప్రవాహాలుగా మార్చేస్తుంది. మనిషి మంచి మనిషిగా మార్చేది సాహిత్యమే. అలాంటి సాహిత్యాన్ని సృష్టిస్తున్న చైతన్య మూర్తులైన సృజనకారులెందరో ఉన్నారు. గ్లోబలైజేషన్ అన్నది చాపకిందనీరులా అంతటా ప్రవహిస్తోంది. ఈనేపథ్యంలో మానవ సంబంధాలు దెబ్బతింటున్నాయి. మార్కెట్ సంబంధాలుగా మారిపోతున్నాయి...

Monday, August 10, 2015 - 16:16

దళిత జీవిత కథనాలను కథలుగా ఆవిష్కరిస్తూ కలం బలం చూపిస్తున్న కథా రచయిత్రి డా.వినోదిని. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పనిచేస్తూ మరోపక్క దళితుల జీవన చిత్రాలను సహజత్వం ఉట్టిపడే కథలుగా శిల్పీకరిస్తున్న రచయిత్రి ఆమె. తరతరాలుగా దళితులపై జరిగిన, జరుగుతున్న చారిత్రక విద్రోహాలకు అక్షరరూపం కల్పించి, ధిక్కార స్వరాలు వినిపించి, కథలుగా శిల్పీకరించిన కథనశిల్పి డా .వినోదిని. ఆమె...

Monday, August 10, 2015 - 16:14

సామాజిక దురన్యాయాలను ఖండిస్తూ మూఢనమ్మకాలను నిరసిస్తూ, ప్రజా చైతన్య రచనలను ఆవిష్కరిస్తున్న కవి, గేయ రచయిత వల్లంపట్ల నాగేశ్వరావ్. గత నాలుగు దశాబ్దాలుగా ప్రజా సంక్షేమం కోసం కలం కదిలిస్తున్న ప్రజా వాగ్గేయకారుడతను. ఈ నాటి జనం పాటలో ప్రముఖ గేయ రచయిత గాయకుడు, వల్లంపట్ల నాగేశ్వరావ్ కథనం.

Monday, August 10, 2015 - 16:05

సాహిత్యం సమాజాన్ని సమూలంగా మార్చేస్తుందా? మార్చేయక పోవచ్చు కాని మార్పును తీసుకరావడానికి తీవ్రంగా ప్రయత్నిస్తుంది. ప్రజలను ఆలోచింపజేసేది. అనుభూతికి గురి చేసేది. ప్రజల్లో భావావేశాలు రగిలించేది సాహిత్యమంటే అందులో అతిశయోక్తిలేదు. అలాంటి సాహిత్యాన్ని సృష్టించిన సృజనకారులెందరో ఉన్నారు. వారిలో తెలుగు కథాసాహిత్యానికి అంతర్జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టిన తొలితరం కథా రచయిత... బుచ్చిబాబు...

Sunday, August 2, 2015 - 12:32

సాహిత్యం సామాజిక చైతన్యానికి వేదికవుతుంది. సామాజిక మార్పు కోసం ఎందరో సృజనకారులు తమ కలాలకు పదును పెడుతున్నారు. అలాంటి వారిలో డా.దేవరాజు మహారాజు ఒకరు. గత నాలుగు దశాబ్దాలుగా నిబద్దతతో కవిత్వం కథలు సాహితీ విమర్శలు, పాపులర్ సైన్స్ రచనలు చేస్తున్న ప్రముఖ రచయిత డా.దేవరాజ్ మహారాజుతో 10 టి.వి ప్రతినిధి, ప్రముఖ కవి డా.ప్రసాదమూర్తి ముఖాముఖి. ఈ విశేషాల కోసం వీడియో క్లిక్ చేయండి.

Sunday, July 26, 2015 - 12:47

అంటరానితనం దేశానికి తలవంపులు తెస్తున్న కళంకం. నిచ్చెనమెట్ల కుల సమాజంలో దళితులపై ఇప్పటికీ దాడులు జరుగుతూనే ఉన్నాయి. డా.అంబేద్కర్ నుండి వెన్నెలకంటి రాఘవయ్యదాకా ఎందరో కులవ్యవస్థ పోవాలని ఆశించారు. మహారాష్ట్రలోని దళిత పాంథర్స్ ఉద్యమం నుండి, కారంచేడు, చుండూరు పోరాటాల వరకు దళిత విముక్తికోసం ఎందరో తపించారు. అలాంటి వారిలో దళితులపై జరిగిన చారిత్రక విద్రోహాలకు అక్షర రూపమిచ్చి వారి...

Sunday, July 26, 2015 - 12:37

చేపను గాలంతో లాగినట్టు లాగేది జ్ఞాపకం. గూళ్ళు మారినా మారనివే గువ్వల గుర్తులు అంటూ సరికొత్తభావాలతో కవిత్వం రాస్తున్న అభ్యుదయకవి బాణాల శ్రీనివాసరావు. మట్టి మడతల్లోంచి వచ్చే మనిషి పరిమళాల్ని అసహ్యించుకునే యాంత్రిక హృదయాల నవ నాగరికుల కుసంస్కారాలను నిరసిస్తూ కులవృత్తుల సౌందర్యాన్ని ప్రశంసిస్తూ ఆయన పర్యాయపదం అన్న కవితా సంకలనాన్ని వెలువరించారు. రసార్ద్ర హృదయంతో శిల్ప వైవిధ్యంతో...

Sunday, July 26, 2015 - 12:36

ప్రజా సాహిత్యమన్నా, శ్రామిక విప్లవమన్నా ఆయనకు అంతులేని మమకారం. విప్లవ పోరాటాలకు ప్రజలను కార్యోన్ముఖులను చేసే సాహితీ సృజనకోసం ఆయన ఎంత గానో పరితపించారు. విరసం ద్వారా తనవంతు కృషి చేశారు. ప్రగతిశీల భావాల ప్రతిభామూర్తి.. విప్లవ సూరీడు. రేపటి సూర్యోదయంకోసం కలలుగన్న స్వాప్నికుడు. అలుపెరుగని నిరంతర శ్రామికుడు. కవి, విమర్శకులు, వి.ర.సం వ్యవస్థాపకుల్లో ఒకరు చలసాని ప్రసాద్. ఆయన మృతి...

Thursday, July 23, 2015 - 19:08

వాసింగ్టన్ డిసి: తెలుగు కవితా వినీలాకాశంలో సమాంతర ఛాయలు, సిక్త్స్ఎలిమెంట్స్ కావ్యాలతో మెరిసిన కవిత్వపు కాంతిపుంజం క్రాంతి శ్రీనివాస రావు. ఆయన మువ్వా శ్రీనివాస రావు పేరుతో కవితలు రాసి ప్రఖ్యాతి గడించారు. డా. ఆవంత్స సోమసుందర్ రాసిన కవితా విపంచి కాంతి గీతాలు పుస్తకావిష్కరణ వాసింగ్టన్ డి.సిలో నిర్వహించారు. ఈ సందర్భంగా మువ్వా శ్రీనివాస రావు మాట్లాడారు. అమెరికాలో తాను...

Sunday, July 19, 2015 - 12:49

''నడినెత్తిన భూగోళం పడినట్టుగా ఉంది. అణువణువున గ్లోబల్ వైరస్ మెదడును విచ్ఛిన్నం చేస్తోంది. అంతరాత్మ మూగగా రోదిస్తోంది'' అంటూ బలంగా కవిత్వం వినిపిస్తున్న రాయలసీమ యువకవి చిన కెంగార మోహన్. అతడు ఇటీవలే 'విన్యాసం' అన్న కవితా సంపుటిని వెలువరించాడు. ప్రపంచీకరణ దుష్ప్రభావాలు మానవ విధ్వంసానికి ఎలా కారకాలయ్యాయో కవిత్వీకరించారు. 

Sunday, July 19, 2015 - 12:43

తెలంగాణా అంటేనే బతుకమ్మ పాటల పూలతోట. బడుగు జీవుల కన్నీటి పాట. ప్రజా పోరాటాల ప్రగతి బాట. ఈ మట్టిపై ఎన్నో పాటల పారిజాతాలు, విప్లవాల అరుణ మందారాలు పూయించిన పాటల తొటమాలులున్నారు. ఇక్కడి కవులు గేయ రచయితలు అభ్యుదయ గీతాలు రాశారు, విప్లవకారులను కీర్తించారు. ఉద్యమాల అరుణారుణ రాగాల కెరటాలై ఎగసిపడ్డారు. ప్రజాచైతన్య గేయాలై ఎగసిపడ్డారు. ప్రజల గాయాల బతుకులకు రాగాలలేపనాలద్దారు. అలాంటి గేయ...

Sunday, July 19, 2015 - 12:41

సాహిత్యం మనిషికి మంచిని బోధిస్తుంది. మానవత్వాన్ని ప్రభోధిస్తుంది. ఉన్నత సమాజం వైపు మానవాళిని నడిపిస్తుంది. సాహిత్య నేపథ్యం లేని మానవ సమూహాల్లో.. సమాజాల్లో.. చైతన్యం తొణికిసలాడదు. ప్రగతి కనిపించదు. మానవజాతి చరిత్రను మలుపుతిప్పడంలో సాహిత్యం చారిత్రాత్మకమైన పాత్రను పోషించిందనడంలో ఎట్టి సందేహం లేదు. అందుకు ప్రధాన కారకులు..ప్రేరకులు.. సృజనకారులే. .అలాంటి వారిలో జాతీయోద్యమకాలంలో...

Sunday, July 12, 2015 - 12:58

సాహిత్యం నేపథ్యంగా ఉన్న వారి జీవితాల్లో విలువలుంటాయి. వెలుగులుంటాయి. జాలి, ప్రేమ, కరుణలు జాలు వారుతుంటాయి. సృజన కారుల కళ్లల్లో మానవత్వం తొనికిసలాడుతుంటుంది. సమ సమాజం కోసం ఎందరో కవులు..రచయితలు కలలు కన్నారు. కలాలు ఝులిపించారు. సృజన స్వరాలై గర్జించారు. తమ ధిక్కార స్వరాలు వినిపించారు. అలాంటి వారిలో డా.రావి రంగారావు ఒకరు.
'నీ కన్నుల వృషభాలు వాలు చూపుల నాగలి కట్టి నా...

Sunday, July 12, 2015 - 12:49

మట్టి నరాలు తెగిన చోట పచ్చదనం శ్వాసించదంటూ ప్రపంచీకరణ ఇంద్రజలాన్ని కవిత్వంతో ఇంద్రజాలంగా మార్చిన యువ కవితా కెరటం గవిడి శ్రీనివాస్. మానసిక నేత్రంతో ప్రపంచాన్ని వీక్షించి చీకట్లో వెలుగుతున్న ఆత్మను కవిత్వంగా ఆవిష్కరించిన అనుభూతి కవి. గవిడి శ్రీనివాస్ పరిచయ కథనం..

Sunday, July 12, 2015 - 12:43

బాల్యం ఎగిరి గంతులేస్తుంది. యవ్వనం గంభీరంగా రంకెలేస్తుంది. వృద్దాప్యం మౌనంగా ఘోషిస్తుందని అంటారో ఓ కవి. కానీ తెలంగాణ కళాకారుడు మాత్రం ఈమూడు దశల్లోనూ పాటై పల్లవిస్తాడు. భావమై పరిమళిస్తాడు. కాళ్ల గజ్జెలు ఘల్లుమనేలా వేదికపై కదం తొక్కుతాడు. కరుణ..వీర..రౌద్ర రసాలను ఏకకాలంలో పోషిస్తాడు. మానత్వం సజీవంగా ఉందని చాటి చెబుతాడు. అలాంటి ఉత్తమ ఉపాధ్యాయుడు, ప్రజా వాగ్గేయకారుడే బయ్యారం...

Pages

Don't Miss