గుడ్ న్యూస్ : బ్యాంకు ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత

Submitted on 11 June 2019
Allow basic savings account holders to make at least 4 withdrawals a month

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు ఆర్బీఐ గుడ్ న్యూస్ వినిపించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు కనీస సదుపాయాలకు తోడు చెక్ బుక్ తో పాటు ఇతర సేవలనూ ఉచితంగా పొందే అవకాశం ఆర్బీఐ కల్పించింది. బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులు తమ ఖాతాల్లో మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలనే నిబంధనను ఆర్బీఐ తొలగించింది.

నెలలో 4 సార్లు నగదు విత్ డ్రా (బ్యాంకులు, ఏటీఎంలు) చేసుకునే వెసులుబాటు తీసుకొచ్చింది. ఈ మేరకు బ్యాంకులకు ఆర్బీఐ ఆదేశాలు ఇచ్చింది. ఈ సదుపాయాలు కల్పిస్తున్నందుకు అకౌంట్ లో కనీస బ్యాలెన్స్ ఉంచాలని బ్యాంకులు నిర్దేశించకూడదని ఆర్బీఐ స్పష్టం చేసింది. జూలై 1వ తేదీ నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయి.

బేసిక్ సేవింగ్స్ ఖాతాలు అంటే ఎటువంటి కనీస బ్యాలెన్స్ అవసరం లేకుండా నిర్వహించుకునేందుకు వీలున్నవి. అయితే చెక్ బుక్ తో పాటు ఇతర సదుపాయాలు కోరితే.. బ్యాంకులు మినిమమ్ బ్యాలెన్స్ ఉంచాలని అడుగుతున్నాయి. అందరికి ఆర్థిక సేవలను చేరువ చేసే లక్ష్యంలో భాగంగా బీఎస్ బీడీఏను సేవింగ్స్ ఖాతాగా కొన్ని రకాల సదుపాయాలు ఎటువంటి ఛార్జీలు లేకుండానే అందించాలని బ్యాంకులకు ఆర్బీఐ చెప్పింది.

కనీస సదుపాయాలకు అదనంగా బ్యాంకులు చెక్ బుక్ వంటి విలువ ఆధారిత సేవలనూ ఉచితంగానే అందించాల్సి ఉంటుంది. ఈ మేరకు బీఎస్ బీడీఏ నిబంధలను ఆర్బీఐ సడలించింది. అంతేకాదు ఏటీఎంల నుంచి నెలలో 4 సార్లు ఉచితంగా క్యాష్ విత్ డ్రా, బ్యాంకు శాఖల్లో డిపాజిట్లు, ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డు జారీ వంటివి బీఎస్ బీడీఏలకు కనీస సదుపాయల్లో భాగంగా ఉన్నాయి.

బేసిక్ సేవింగ్స్ ఖాతాదారులకు మరిన్ని ఉచిత సేవలు:
* ఖాతాల్లో మినిమిమ్ బ్యాలెన్స్ అవసరం లేదు
* ఉచితంగా ఏటీఎం కమ్ డెబిట్ కార్డు జారీ
* నెలలో ఎన్నిసార్లు అయినా ఉచితంగా డిపాజిట్లు
* నెలలో 4 సార్లు ఉచితంగా నగదు విత్ డ్రా చేసుకోవచ్చు
* యాక్టివేషన్ ఛార్జీలు వసూలు చేయకూడదు

Allow
basic savings account holders
withdrawals
RBI
free
minimun balance

మరిన్ని వార్తలు