ప్రజావేదిక ఖాళీ చేస్తున్న అధికారులు : కూల్చివేతకు అంతా రెడీ

Submitted on 25 June 2019
Amaravathi praja vedika demolition work start

ఏపీ రాజధాని అమరావతిలోని ప్రజావేదికను కూల్చివేతకు రంగం సిద్ధం అయ్యింది. కలెక్టర్, ఎస్పీ సమావేశం ముగిసిన వెంటనే.. సీఎం జగన్ ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కదిలింది. కృష్ణా నది కరకట్టపై ఉన్న ప్రజావేదిక దగ్గరకు భారీ ఎత్తున CRDA అధికారులు, పోలీసులు చేరుకున్నారు. పెద్ద పెద్ద వాహనాలను కూడా తీసుకొచ్చారు. అందులోని ఫర్నిచర్, జనరేటర్లు, కుర్చీలు, బల్లలు, ఇతర సామాగ్రి మొత్తాన్ని జాగ్రత్తగా తీసుకెళుతున్నారు.

ప్రజావేదిక కూల్చటం జూన్ 26వ తేదీనే మొదలవుతుందని కలెక్టర్ల సమావేశంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగా అంతా సిద్ధం చేశారు. 9 కోట్ల రూపాయలతో టీడీపీ ప్రభుత్వం దీన్ని నిర్మించింది. కరకట్టపై ఉంది. అక్రమ నిర్మాణం అని తేల్చారు. కృష్ణా నది వరద ప్రవాహ మట్టం 22 అడుగులుగా ఉంటుంది. అంత కంటే దిగువన 19 అడుగుల్లోనే ప్రజావేదిక నిర్మించారు. అంటే కృష్ణానదికి పూర్తి వరద వస్తే ప్రజావేదిక మునుగుతుంది. నదీ పరివాహక ప్రదేశంలో నిర్మాణాలు చేపట్టకూడదని చట్టం చెబుతుంది. అందులో భాగంగానే తొలగిస్తున్నారు.

కృష్ణానది పరివాహక ప్రాంతంలో కరకట్టపై అక్రమంగా నిర్మించిన అనేక భవనాల కూల్చివేతకు.. ప్రజావేదిక ముహూర్తం పెట్టినట్లు అయ్యింది. అక్రమ నిర్మాణదారుల్లో ఇదే ఆందోళన నెలకొంది. 

Amaravathi
Praja Vedika
demolition. AP
cm jagan
YSR congress
TDP

మరిన్ని వార్తలు