అమెజాన్ ఎకో డివైజ్ :  Alexa.. హిందీలోనూ మాట్లాడగలదు!

Submitted on 10 June 2019
Amazon Echo Device : Alexa Will Soon Be Able To Speak In Hindi, As Per An Amazon Executive

ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ ప్రవేశపెట్టిన ఎకో రేంజ్ డివైజ్ లు.. Alexa Voice AI కోసం మాత్రమే కాదు.. వాయిస్ ఫస్ట్ కన్వర్షనల్ ఏఐతో వినియోగదారులతో సంభాషించే ఆప్షన్ అందిస్తోంది. ఇప్పటివరకూ Alexa.. ఇంగ్లీష్ లో మాత్రమే మాట్లాడేది. English వ్యాఖ్యానాలు, పదాలను మాత్రమే అర్థం చేసుకోలదు.

ఇకపై కొత్త రీజనల్ లాంగ్వేజీలను కూడా అలెక్సా.. నేర్చుకోనే పనిలో పడింది. అమెజాన్ ఎకో డివైజ్ లపై పనిచేసే Alexa.. త్వరలో హిందీలో కూడా మాట్లాడేందుకు సిద్ధం అవుతోంది. చిన్ని చిన్న వ్యాఖ్యాలే కాదు.. ఏకంగా Hindi సంభాషణ కూడా చేయగలదు.
Also Read : కస్టమర్ కు కట్టండి : సోనీ టీవీ కంపెనీకి రూ.3లక్షల జరిమానా

ఓ రిపోర్ట్ ప్రకారం.. Alexa హెడ్ సైంటిస్ట్, వైస్ ప్రెసిడెంట్ రోహిత్ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘అవును.. అలెక్సాలో ప్రాంతీయ భాషల సామర్థ్యాలపై వర్క్ చేస్తున్నాం. ఇండియన్ మార్కెట్ యూజర్ల కోసం ప్రాంతీయ భాషలపై ఫోకస్ పెట్టాం’ అని చెప్పారు.

Alexa హిందీ భాషను అర్థం చేసుకోవడం సవాల్ తో కూడినదిగా భావిస్తున్నామని ప్రసాద్ అన్నారు. Alexa హిందీని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోవాలంటే.. ఎన్నో మాండలికాలు, సందర్భాలు, యాస (స్వరాలు)లను అవగాహన చేసుకోవాల్సి ఉందని చెప్పారు.

2018 ఏడాదిలో అమెజాన్ Alexa లాంగ్వేజ్ లెర్నింగ్ మోడల్ Cleo ను లాంచ్ చేసింది. ఈ మోడల్ ద్వారా అలెక్సా హిందీ సహా ఇతర లాంగ్వేజీలను నేర్చుకునేందుకు ఇండియన్ కస్టమర్లకు ప్రయోజనకరంగా ఉండనుంది. అలెక్సా హిందీ భాష కోసం.. అమెజాన్ ఇండియాలోని టాలెంటెడ్ సైంటిస్టులు, ఇంజినీర్లను రిక్రూట్ చేయాలని చూస్తోంది.
Also Read : ఏంటీ బాదుడు : బ్యాంక్ నుంచి 10 లక్షలు డ్రా చేస్తే.. పన్ను కట్టాలి

Alexa
Hindi
 Amazon Echo Device
Amazon Executive
Echo Range Device
Regional languages

మరిన్ని వార్తలు