క‌ర్ణాట‌క‌లో పొలిటిక‌ల్ హీట్ : బీజేపీలోకి ఇద్ద‌రు కాంగ్రెస్ MLAలు!

Submitted on 26 May 2019
Amid Congress-JDS coalition turmoil, 2 Karnataka Congress MLAs meet BJP's SM Krishna

లోక్ స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల అనంత‌రం  కర్ణాటకలో కాంగ్రెస్‌- జేడీఎస్‌ కూటమి ప్రభుత్వం పరిస్థితి దినదిన గండంగా మారింది. ఇద్దరు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు రమేశ్‌ జార్కిహోళి, సుధాకర్ లు ఇవాళ‌(మే-26,2019)ఉద‌యం బీజేపీ సీనియ‌ర్ లీడ‌ర్  ఎస్‌ఎం కృష్ణతో సమావేశం కావడం చర్చనీయాంశంగా మారింది.బెంగళూరులోని కృష్ణ నివాసంలో ఈ భేటీ జరిగింది.ఈ సమావేశంలో కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర భాజపా అధ్యక్షుడు బీవై యడ్యూరప్ప కూడా ఉన్నట్లు సమాచారం.

లోక్ సభ ఎన్నిక‌ల్లో బీజేపీ 25 స్థానాలు గెలుచుకోవడంతో అది కూటమి ప్రభుత్వంపై ప్రభావం చూపే అవకాశం ఉందని భావిస్తున్న స‌మ‌యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలిద్దరూ పార్టీ మారాలనే యోచలో ఉన్నట్లు అందుకే బీజేపీ నాయ‌కుల‌తో సమావేశం జరిగినట్లు వార్తలు రాగా వాటిని రమేశ్‌ తోసిపుచ్చారు. ఇది రాజకీయ పరంగా జరిగింది కాదని, లోక్ సభ ఫలితాల్లో బీజేపీ ఘన విజయానికి శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినట్లు రమేశ్‌ తెలిపారు.

అయితే రమేశ్‌  వ్యవహార శైలి కొన్ని రోజులుగా కాంగ్రెస్‌-జేడీఎస్‌ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. రమేశ్‌ పార్టీ మారే యోచనలో ఉన్నట్లు కొన్ని రోజుల క్రితం కూడా వార్తలొచ్చాయి. తర్వాత వీటిని ఆయన ఖండించారు. నాలుగైదు రోజుల క్రితం మ‌రో కాంగ్రెస్ ఎమ్మెల్యే రోష‌న్ బోగ్ తాను బీజేపీకి స‌పోర్ట్ చేస్తాన‌ని ప‌రోక్షంగా వ్యాఖ్య‌లు చేసిన విష‌యం తెలిసిందే.రాష్ట్ర కాంగ్రెస్ నాయ‌కుల‌పై రోష‌న్ బేగ్ తీవ్ర విమ‌ర్శ‌లు చేసిన విష‌యం తెలిసిందే.

LOKSABHA ELECTION RESULTS
JDS
Congress
Govt
karnataka
BJP
sm krishna
ramesh jarkiholi
Sudhakar
MLA
meet
BENGALURU

మరిన్ని వార్తలు