తన దగ్గర పనిచేసిన వ్యక్తి పాడె మోసిన మెగాస్టార్

Submitted on 26 June 2019
Amitabh Bachchan and Abhishek Bachchan perform last rites of secretary

సినీ దిగ్గజాలలో ఒకరైన అమితాబ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఆయన మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అమితాబ్ చేసే మానవతా సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. బాలీవుడ్ లెజెండరీ యాక్టర్, మెగాస్టార్ అమితాబ్.. ఇటీవల రైతుల రుణాలను కట్టి వార్తల్లో నిలవగా.. పుల్వామా దాడిలో చనిపోయిన సైనికులకు కూడా సాయం చేశారు. ప్రతీ సంధర్భంలోనూ తనలోని మానవాత్వాన్ని పేద, దనిక అనే తేడాలు లేకుండా చూపెడుతున్న అమితాబ్ బచ్చన్ లేటెస్ట్ గా చేసిన పనికి నెటిజన్లు ఫిదా అయిపోయారు.

అమితాబ్ బచ్చన్‌ దగ్గర సుదీర్ఘకాలంపాటు సెక్రటరీగా పనిచేసిన 77 ఏళ్ల శీతల్ జైన్ అనే వ్యక్తి ఇటీవల కన్నుమూశారు. 40 ఏళ్లపాటు అమితాబ్‌కు సెక్రెటరీగా పనిచేసిన శీతల్ జైన్ మరణించగా.. తన దగ్గర పని చేసిన వ్యక్తికి గౌరవంగా అతని అంత్యక్రియల్లో పాల్గొనడమే కాకుండా.. అతని పాడెను కూడా మోశారు అమితాబ్ బచ్చన్.. ఆయన కొడుకు అభిషేక్ బచ్చన్. అమితాబ్, అభిషేక్ పాడెను మోసి గొప్ప మనసు చాటుకోగా ఆ ఫోటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అమితాబ్ బచ్చన్ 'గులాబో సితాబో' సినిమాలో నటిస్తున్నారు. 

Amitab Bachan
Abhishek Bachan
Secretary
Seetal

మరిన్ని వార్తలు