మీకే నచ్చిందంటే : టోపీ గొడుగుల ఐడియా అద్భుతం

Submitted on 29 June 2019
Ananda Mahindra tweeted a video of Hat umbrella, drone is better than the umbrella

వర్షం కాలం వచ్చేసింది.. బయటకు వెళ్తే చాలు.. వర్షంలో తడిచిపోవాల్సిందే. గొడుగు తీసుకెళ్దామంటే సౌకర్యంగా ఉండదు. గట్టిగా గాలిస్తో ఎగిరిపోవచ్చు. బైక్ మీద వెళ్లాలన్నా ఇబ్బందిగా ఫీల్ అవుతుంటాం. ఇకపై వర్రీ కావాల్సిన పనిలేదు. డ్రోన్ గొడుగులు, టోపీ గొడుగులు వచ్చేశాయ్.. ఫ్యాషన్ కి ఫ్యాషన్.. సింపుల్ గా ధరించవచ్చు. సౌకర్యవంతంగా ఉంటాయి. తక్కువ బరువు ఉంటుంది.

క్యారీ చేయడం ఎంతో తేలికగా ఉంటుంది కూడా అంటున్నారు మహీంద్ర కంపెనీ ఆనంద్ మహీంద్రా. ఆసక్తికరమైన వీడియోలతో ఎప్పుడూ  ట్విట్టర్ లో పోస్టులతో యాక్టివ్ గా ఉండే ఆయన మరో కొత్త వీడియోతో ముందుకొచ్చారు. అదే.. క్యాప్ అంబరిల్లా. ఇటీవల డ్రోన్ అంబరిల్లా అంటూ ఫన్నీ వీడియో పోస్టు చేసిన ఆయన.. ఇదిగో టోపీ గొడుగులు వచ్చాయ్ చూడంటి అంటూ ట్వీట్ చేశాడు. 

ఈ సరికొత్త టోపీ గొడుగు.. తల భాగం నుంచి భుజాల వరకు కప్పి ఉంటుంది. వర్షం వచ్చినా తడిసే బాధ ఉండదు. డ్రోన్ గొడుగులు బ్లూటూత్ సాయంతో నడుస్తుంటాయి. ఒకవేళా బ్లూటూత్ పనిచేయలేదా.. సింపుల్.. హ్యాట్ అంబరిల్లా చక్కగా పనిచేస్తుందని ఆయన ట్వీట్ చేశారు. డ్రోన్ అంబరిల్లా కంటే.. టోపీ గొడుగులు ఎంతో బెటర్ అని ఆనంద్ మహీంద్రా ఈ వీడియోను ట్వీట్ చేశారు.

Ananda Mahindra
Hat umbrella
umbrella
DRONE

మరిన్ని వార్తలు