మధ్యతరగతికి శుభవార్త : అందరికీ ఆరోగ్యశ్రీ.. దేశంలో ఎక్కడున్నా వర్తింపు

Submitted on 12 July 2019
Andhra Pradesh budget 2019-20: Highlights Aarogyasri

ప్రభుత్వ, కార్పొరేట్ ఆస్పత్రుల్లో ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన చికిత్స అందించడానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. గతంలో వైఎస్ హాయంలో ఎన్నో ఆరోగ్య కార్యక్రమాలు జరిగాయని..ఇదే కొనసాగిస్తామని తెలిపారు. వైఎస్ ఆరోగ్య శ్రీ విస్తరింపు చేస్తున్నట్లు వెల్లడించారు. వార్షిక ఆదాయం రూ. 5 లక్షలలోపు తక్కువ ఉన్న అన్ని కుటుంబాలకు...రూ. 40 వేలు ఆదాయం ఉన్న మధ్య తరగతి కుటుంబాలకు ఇది వర్తిస్తుందని వెల్లడించారు.

వెయ్యి రూపాయలకు మించిన అన్ని కేసులు చికిత్స వ్యయంపై ఏ విధమైన పరిమితి లేకుండా..అన్ని చికిత్సలకు అందిస్తామన్నారు. అలాగే సరిహద్దు జిల్లాల్లో ఉన్న ప్రజల ప్రయోజనం కోసం రాష్ట్రానికి వెలుపల బెంగళూరు, హైదరాబాద్, చెన్నై తదితర నగరాల్లో ఉన్న మంచి ఆస్పత్రులను ప్రభుత్వ జాబితాలోకి చేరుస్తుందన్నారు. అన్ని రకాల రోగాలు, సర్జరీలను ఆరోగ్య శ్రీ కింద వర్తింపు చేస్తామన్నారు. రూ. 15 వందల 40 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు.

ప్రతి ప్రాంతానికి అంబులెన్స్ సౌకర్యం కల్పిస్తామని..అందులో భాగంగా ఇప్పడున్న వాటికి అదనంగా 432 అంబులెన్స్‌లు అందుబాటులోకి తెస్తామన్నారు మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ రెడ్డి. 104 వాహనాలను మరింత అభివృద్ధి చేసే భాగంలో 676 అదనపు వాహనాలను తీసుకొచ్చేందుకు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రుల అభివృద్ధికి 
రూ. 15 వందల కోట్లను కేటాయిస్తున్నట్లు..పాడేరు, అరకు ప్రాంతాల్లో గిరిజన వైద్య కళాశాల ఏర్పాటు చేస్తామన్నారు మంత్రి బుగ్గన.

Andhra Pradesh
budget 2019-20
highlights
Aarogyasri

మరిన్ని వార్తలు