ఏపీ బడ్జెట్ 2019 : నాలుగు జిల్లాల్లో షిప్పింగ్‌ జట్టీలు

Submitted on 12 July 2019
andhra pradesh Govt 2019-20 budget fisheries Schemes

ప్రభుత్వం విధించిన చేపల వేట కాలం కారణంగా మత్స్యకారులు తమ ఆదాయాన్ని కోల్పోతున్నారని ఆర్థిక మంత్రి బుగ్గన తెలిపారు. ఏపీ 2019 బడ్జెట్ ను ఆయన 2019, జులై 12వ తేదీ శుక్రవారం ప్రవేశపెట్టారు. అందులో భాగంగా మత్స్యకారులను ఆదుకొనేందుకు తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు. నాలుగు జిల్లాలో షిప్పింగ్‌ జట్టీలను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేగాకుండా...మత్స్యకారులకు ఇచ్చే సహాయాన్ని రూ. 4 వేల నుంచి రూ. 10 వేలకు పెంచుతున్నట్లు తెలిపారు.

మత్స్యకారులకు మౌలికసదుపాయాలు కల్పించేందుకు..మద్దతు అందించేందుకు తూర్పుగోదావరిలోని ఉప్పాడలో..నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నెలో..ప్రకాశం జిల్లాలోని ఓడ రేవులో, గుంటూరు జిల్లాలోని నిజాంపట్నంలో షిప్పింగ్ జట్టీలను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని..ఇందుకు రూ. 100 కోట్లను ప్రతిపాదిస్తున్నట్లు మంత్రి బుగ్గన వెల్లడించారు. 

తగిన మదింపును చేసిన తర్వాత..ఈ మొత్తాన్ని 2020 జులైలో పంపిణీ చేస్తుందన్నారు. మత్స్యకారులకు డీజిల్ సబ్సిడీ కోసం 1, 17, 53 మత్స్యాకారుల కుటుంబాలకు లబ్ది చేకూర్చేందుకు రూ. 200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఆక్వా రైతులకు ఒక్కో యూనిట్ రూ. 1.50 పైసలు ఇచ్చేందుకు ప్రభుత్వం సిధ్దంగా ఉందని..ఇందుకు రూ. 475 కోట్లను కేటాయిస్తున్నట్లు చెప్పారు. 

Andhra Pradesh
Govt 2019-20
Budget
fisheries Schemes
Finance
MLA Buggana Rajendranath Reddy

మరిన్ని వార్తలు