రెడీ టు అప్లయ్ : ఏపీ కో-ఆప‌రేటివ్ బ్యాంకులో ఉద్యోగాలు

Submitted on 11 July 2019
Andhra Pradesh State Co-operative Bank Ltd jobs

ఏపీలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. విజయవాడలోని ఏపీ స్టేట్‌ కోఆపరేటివ్‌ బ్యాంకు లిమిటెడ్‌ (APCOB-ఆప్కాబ్‌) లో పోస్టుల భర్తీ చేయనున్నారు. మేనేజర్, స్టాఫ్ అసిస్టెంట్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు. డిగ్రీ పాస్ అయిన వారు ఈ పోస్టులకు అప్లయ్ చేసుకోవడానికి అర్హులు. ఆన్‌‌లైన్ లో అప్లయ్ చేసుకోవాల్సి ఉంటుంది. రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. అభ్యర్థులు స్థానికులై ఉండాలి. వయసు 20-28 సంవత్సరాల మధ్య ఉండాలి.

మొత్తం ఖాళీలు: 77

స్టాఫ్ అసిస్టెంట్‌: 54 (మహిళలకు 22 పోస్టులు)
మేనేజ‌ర్ (స్కేల్ 1): 23 (మహిళలకు 8 పోస్టులు)
అర్హత‌: ఏదైనా డిగ్రీ.
మస్ట్ : ఏపీకి చెందినవారై ఉండాలి.
వ‌యోపరిమితి: 01.06.2019 నాటికి 20-28 సంవ‌త్సరాల మ‌ధ్య ఉండాలి.
నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌
ఎంపిక‌ విధానం: రాత‌ప‌రీక్ష, ఇంట‌ర్వ్యూ ఆధారంగా
ద‌ర‌ఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజుగా జ‌న‌ర‌ల్, బీసీ అభ్యర్థులు రూ.590. మిగతావారు రూ.413 చెల్లించాలి.
ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు ఫీజు చెల్లించాలి
జూలై 10 నుంచి ఆన్ లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం
ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: జూలై 28
దరఖాస్తు ఫీజు చెల్లించడానికి చివరి తేదీ : జూలై 28
రాత పరీక్ష తేదీ: అగస్టు 25
వెబ్‌సైట్‌: www.apcob.org

Andhra Pradesh
State Co operative Bank
APCOB
jobs
Posts
Education
notification
Manager


మరిన్ని వార్తలు