ఆంధ్రప్రదేశ్

నెల్లూరుజిల్లా శ్రీహరికోటలోని  అంతరిక్ష  పరిశోధనా కేంద్రం షార్ నుంచి మరో ప్రయోగాన్ని చేపట్టేందుకు శాస్త్రవేత్తలు సిధ్దం అయ్యారు.

ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని కేంద్రం స్పృష్టం చేసింది. 14వ ఆర్ధికసంఘం నివేదిక ఆధారంగా ప్రత్యేక హోదా అమల్లో లేదని కేంద్రం  తెలిపింది.

విజయవాడ : ఏపీలో మహిళల రక్షణ కోసం మహిళా శక్తి టీమ్ ను ఏర్పాటు చేశారు డీజీపీ ఠాకూర్. దీని కోసం ప్రత్యేక శిక్షణ తీసుకున్న మహిళా శక్తి టీమ్ అందుకు సిద్ధంగా ఉన్నామంటున్నారు. మహిళల రక్షణ కోసం నిత్యం వారికి అందుబాటులో ఉంటామంటున్నారు.

కాకినాడ: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ వద్ద సముద్రంలో చేపల వేటకు వెళ్లిన 22 మంది జాలర్లు గల్లంతయ్యారు. పర్లోవ పేట,  ఉప్పలంక కు చెందిన జాలర్లు 6 రోజుల క్రితం 4 బోట్లలో చేపల వేటకు వెళ్లారు.

అనంతపురం  : తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మద్దెలచెరువు సూరి హత్యలో పరిటాల కుటుంబం హస్తం వుందని..వారి కుటుంబమే కిరాయి ఇచ్చి దారుణంగా చంపించేశారని సూరి భార్య గంగుల భానుమతి ఆరోపించారు.

తిరుమల: కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే పీక కోసుకుంటా అంటూ శపథం చేసి అభాసుపాలయ్యారు కాంగ్రెస్ నేత, కమెడియన్ బండ్ల గణేష్. బండ్లను నెటిజన్లు ఓ రేంజ్‌లో ఆడేసుకున్న సంగతి తెలిసిందే.

హైదరాబాద్: ఫ్యాక్షనిస్ట్ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు తుది తీర్పు ఇచ్చింది.

అనంతపురం జిల్లా ధర్మవరంలో దారుణం చోటు చేసుకుంది. కొండవీడు ఎక్స్‌ప్రెస్‌లో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. దివ్య అనే ప్రయాణికురాలి నుంచి ఆభరణాలు దోచుకున్న దొంగలు.. ఆమెను కదులుతున్న రైలు నుంచి తోసేశారు. ధర్మవరం మండలం గొల్లపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. దివ్య ఏడు నెలల గర్భిణి.

హైదరాబాద్: ఫ్యాక్షనిస్ట్ గంగుల సూర్యనారాయణరెడ్డి అలియాస్ మద్దెల చెరువు సూరి హత్య కేసులో నాంపల్లి స్పెషల్ కోర్టు తుది తీర్పు ఇవ్వనుంది. ఏడేళ్ల తర్వాత ఈ కేసుకు సంబంధించి తుది తీర్పు వెలువడనుండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

తూర్పుగోదావరి : పెథాయ్ తుఫానుతో కోస్తా జిల్లాలు అల్లాడిపోయాయి. ఈ ప్రభావంతో భారీగా కురిసిన వర్షంలో తూర్పుగోదావరి జిల్లాలోని అమలాపురంలో చేపల వాన కూడా పడింది. చేపల వాన పడటంతో చేపలు రోడ్డుపై ఎక్కడ పడితే అక్కడ చెల్లా చెదురుగా పడి వున్నాయి. దీంతో స్థానికులు చేపలను పట్టుకుని కూర వండుకున్నారు.

Pages

Don't Miss