ఆంధ్రప్రదేశ్

అనంతపురం: టీడీపీ మాజీ నేత దాడి వీరభద్రరావు తిరిగి సొంత గూటికి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. వైసీపీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంత కాలం స్తబ్దుగా ఉన్న దాడి.. టీడీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్టు ప్రకటించారు. ఈ మేరకు పుట్టపర్తిలో మీడియాతో మాట్లాడిన ఆయన..

ప్రకాశం: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ మొదలైంది. సాయంత్రం 4 గంటల వరకు ఓటింగ్‌ కొనసాగనుంది. ప్రకాశం జిల్లాలో ఎన్నికను వైసీపీ బహిష్కరించడంతో.. అందరి దృష్టీ కర్నూలు జిల్లాపైనే పడింది.

గుంటూరు: మాచర్లలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. కొత్తపల్లి జంక్షన్ సమీపంలోని ఓ డాక్డర్ ఇంట్లో దొంగలు చోరీకి పాల్పడ్డారు. ముగ్గురు దొంగలు.. డాక్లరతోపాటు అతని భార్యను తాళ్లతో కట్టేసి... తుపాకీతో బెదిరించి చోరీ చేశారు. 15 సవర్ల బంగారం, రూ. 4 వేల నగదును అపహరించారు.

 

తిరుపతి: తిరుమల శ్రీవారి మెట్ల వద్ద చిరుతలు కలకలం సృష్టించాయి. 1300 మెట్టు దగ్గర ఒక పెద్ద చిరుత పులి, రెండు చిన్న చిరుత పులులు కనిపించాయి. భక్తులు భయంతో పరుగులు తీశారు. నడకదారి భక్తులను నలిపి వేశారు. చిరుతల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. 

కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీల ఎన్నికకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్‌ జరగనుంది. ఇప్పటికే ఓటర్లకు గుర్తింపు కార్డులు అందజేశారు.

హైదరాబాద్: కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో... రేపు జరగబోయే... స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికకు... ఏర్పాట్లు పూర్తయ్యాయి. అధికార పార్టీ వ్యవహరిస్తోన్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ... ప్రతిపక్ష వైసీపీ... ప్రకాశం జిల్లాలో ఎన్నికను బహిష్కరించింది.

విజయవాడ: ఏపీ రాజధాని ప్రాంతంలో వ్యవసాయ కూలీలు పోరుబాట పట్టారు. రాజధాని ప్రాంతంలో ఉపాధి కోల్పోయిన కూలీలు, కార్మికులకు నెలకు తొమ్మిది వేల రూపాయల నష్టపరిహారం చెల్లించాలంటూ ఆందోళన చేపట్టారు. పేదలు, కూలీల ఆధ్వర్యంలో డీఆర్ డీఏ కార్యాలయాన్ని ముట్టడించింది.

హైదరాబాద్: వైసీపీ అధినేత వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి... విశాఖ జిల్లా పర్యాటన ప్రారంభమైంది. హైదరాబాద్‌ నుంచి నేరుగా విశాఖ వెళ్లిన జగన్‌కు పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. తర్వాత ఆయన అచ్యుతాపురం బయల్దేరారు.

ప.గో:గోదావరి నది రాష్ట్రానికే జీవనాడిలాంటిదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. పశ్చిమగోదావరి జిల్లాలో పర్యటించిన బాబు... గోదావరి తల్లి రుణం తీర్చుకునే అవకాశం పుష్కరాల ద్వారా వచ్చిందని... అందుకే ఖర్చుకు వెనకాడకుండా 520 కోట్ల రూపాయలు కేటాయింటినట్లు స్పష్టం చేశారు.

గుంటూరు:బాపట్లలో విషాదం చోటుచేసుకుంది. రైలు కిందపడి ఇద్దరు పిల్లలతో తల్లి ఆత్మహత్య చేసుకుంది. మృతులు చెరువు జమ్ములపాలెం వాసులుగా గుర్తించారు. బాపట్ల రైల్వేస్టేషన్‌లో 4 రోజుల వ్యవధిలో ఇదో సంఘటన. 

Pages

Don't Miss