ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్:రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ వైద్యం అందుబాటులోకి తేవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వైద్య సలహా కమిటీతో సమావేశమైన ఆయన.. వైద్య విధానంపై చర్చించారు.

హైదరాబాద్: ఓటుకు నోటు వ్యవహారం తెలుగు రాష్ట్రాలను కుదుపేస్తోంది. ఈ ఇష్యూ బయటకు వచ్చాక ఫోన్ ట్యాపింగ్, సెక్షన్ 8 వివాదాలు తెరపైకి వచ్చాయి. ఐతే ఈ మొత్తం వ్యవహారంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిందని ఏపీ ప్రభుత్వం ప్రధానంగా ఆరోపిస్తోంది.

తిరుమల:రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ.. తిరుమల పర్యటనలో ఏపీ ప్రభుత్వ వాహనం మొరాయించింది. తిరుమల కొండపై వెళ్లే ప్రవేశ ద్వారం వద్ద సీఎమ్‌ఓ వాహనం ఓ డివైడర్‌పై ఎక్కేసింది. డివైడర్‌పై చిక్కుకున్న వాహనాన్ని తప్పించేందుకు పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

తిరుపతి: తిరుమల వెంకటేశ్వరుడిని రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ దర్శించుకున్నారు. మహాద్వారం వద్ద ఆలయ అర్చకులు,వేదపండితులు, టిటిడి అధికారులు ప్రణబ్‌ ముఖర్జీకి ఘన స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్రపతి ప్రణబ్‌కు తీర్ధప్రసాదాలతో పాటు ఆశీర్వాచనాలు అందించారు.

తూ.గో:జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన వైన్‌ షాపులను తొలగించాలని డిమాండ్‌ చేస్తూ.. కాకినాడ రూరల్‌ డ్రైవర్స్‌ కాలనీలో స్థానిక మహిళలు ఆందోళన చేశారు. జనావాసాల మధ్య ఉన్న వైన్‌ షాపును తొలగించాలని షాప్‌పై మహిళలు దాడి చేశారు.

హైదరాబాద్ : ఏపీ ట్రిపుల్ ఐటీ ప్రవేశాల జాబితా విడుదలయ్యాయి. బుధవారం ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. ఈనెల మూడో వారంలో కౌన్సిలంగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు.

విజయవాడ : నారాయణ విద్యాసంస్థల ఆగడాలు హద్దుమీరుతున్నాయని ఏపీ సీపిఎం కార్యదర్శి పి.మధు ఫైర్ అయ్యారు. డొనేషన్ల పేరుతో సామాన్య, మధ్యతరగతి పిల్లల తల్లిదండ్రుల నుంచి వేలకువేల ఫీజులు వసూలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

రాజమండ్రి: ఈనెల 14 నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పుష్కరాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దీనిపై వివాదం నెలకొన్న సంగతి తెలిసిందే. తాజాగా రాజమహేంద్ర పూజారులు రిలే నిరహార దీక్ష చేపట్టారు. స్థానిక మార్కండేయ గుడి ఎదురుగా దీక్షలు చేస్తున్నారు.

చిత్తూరు : ఏడుకొండల వాడి సేవలో తరించేందుకు భారతదేశ ప్రథమ పౌరుడు ప్రణబ్ ముఖర్జీ ప్రపంచ ప్రఖ్యాత పుణ్యనగరి తిరుమల తిరుపతికి చేరుకున్నారు. వర్షాకాల విడిది కోసం హైదరాబాద్ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి తిరుపతికి వచ్చారు.

విశాఖపట్టణం : ఇంటిపై నుండి హెటెన్షన్ వైర్లు వెళుతుండడంతో పలువురు ప్రమాదానికి గురవుతున్నారు. ఇందులో విద్యార్థులు ప్రాణాలు కోల్పోతున్న సంఘటను ఇటీవలి కాలంలో చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మాకవరపాలెం (మం) వజ్రగడలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.

Pages

Don't Miss