ఆంధ్రప్రదేశ్

హైదరాబాద్: తెలంగాణ నుంచి ఏపీలో విలీనమైన పోలవరం ముంపు మండలాల్లో గిరిపుత్రులకు సరస్వతీ కటాక్షం లేకుండా పోతోంది. పుస్తకాలతో కుస్తీ పట్టాల్సిన వారు..ఆటలాడుకుంటూ గడుపుతున్నారు. ఏపీ ప్రభుత్వ అనాలోచిత చర్యలతో గిరిజన ప్రాంతాల్లోని విద్యార్థులు చదువుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది.

హైదరాబాద్:వృత్తి విద్యా కాలేజీల్లో నాణ్యతపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఇప్పటికే ఇంజనీరింగ్ మొదటి విడత కౌన్సిలింగ్ పూర్తి అయినా.. నాణ్యతా ప్రమాణాల విషయంలో పలు కాలేజీలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ప్రభుత్వం గుర్తించింది. దీనిలోభాగంగా..

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమరం తుది అంకానికి చేరుకుంది. ప్రకాశం జిల్లాలో జూలై 3న జరిగే ఎన్నికల కోసం ఏర్పాట్లు ఊపందుకున్నాయి. కట్టుదిట్టమైన భద్రత మధ్య ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు.

హైదరాబాద్:ఏపీలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వచ్చింది. వైన్‌ షాపుల కోసం ఔత్సాహికులు క్యూ కట్టారు. కొత్త మద్యం షాపులను దక్కించుకునేందుకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు వచ్చాయి. మద్యం షాపుల దరఖాస్తుల్లో పురుషులతో పాటు మహిళలు సైతం భారీగా పోటీపడ్డారు.

హైదరాబాద్ : ఏపీలో మద్యం షాపుల టెండర్లకు భారీ స్పందన వచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3వేల 61 దుకాణాలకు 52 వేల 699 దరఖాస్తులు వచ్చాయి. మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశమున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. కర్నూలు, ప్రకాశం మినహా మిగతా 11 జిల్లలకు దరఖాస్తులు వచ్చాయి.

గుంటూరు : రాజధాని పనులను ఏపీ ప్రభుత్వం వేగవంతం చేసింది. వచ్చే నెల 15న సీడ్‌ క్యాపిటల్ మాస్టర్‌ ప్లాన్ రానుంది. ఈలోగా భూసమీకరణ, సేకరణ పూర్తి చేయాలని సంకల్పించింది. రాజధాని ప్రాంతంలో రైతులు కొత్త పంటలు వేయవద్దని ప్రభుత్వం..

హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో పలు జిల్లాల్లో కొన్ని కుటుంబాల్లో ఆదివారం విషాద వారంగా మారిపోయింది. పలువురు ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. విశాఖపట్టణం, ఖమ్మం, గుంటూరు జిల్లాల్లో జరిగిన ఈ ప్రమాదాల్లో మొత్తం 8 మంది మృతి చెందారు.

విజయనగరం : పచ్చదనం పరిశుభ్రతపై ప్రతిఒక్కరు అవగాహన పెంచుకోవాలని కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు అన్నారు. మొక్కలు నాటడంపై ప్రజల్లో అవగాహన పెంచే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

విజయనగరం : జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. మెంటాడ మండలం ఆండ్రా రిజర్వాయర్‌లో దూకి యువతీ యువకుడు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మృతులు బొండపల్లికి చెందిన సురేష్, డెంకాడ మండలం మోదవలసకు చెందిన వసంత సుబ్బలక్ష్మిలుగా పోలీసులు గుర్తించారు. వీరు కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు.

విజయవాడ : బెజవాడ పోకిరీలకు బ్రేకింగ్‌ న్యూస్‌. ఇకపై మీరు అమ్మాయిలను.. వేధిస్తే కటకటాలు లేక్కించాల్సిందే. పనీపాటాలేని జల్సారాయుళ్ల తాట తీయడానికి పోలీసులు రెడీగా ఉన్నారు. యువతుల పట్ల మీరేదైనా తప్పుగా ప్రవర్తించినట్లు కనిపిస్తే.. ఇక మీ తాట తీస్తారు.

Pages

Don't Miss