ఆంధ్రప్రదేశ్

విశాఖపట్నం: సెప్టెంబర్ 23న విశాఖ  జిల్లా సర్రాయి  వద్ద గ్రామదర్శిని కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న విశాఖ జిల్లా అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే  సివేరి సోమల హత్య కేసులో 4 గురు నిందితులను  అరెస్టు చేసిన

హైదరాబాద్ : తిత్లీ తుపానుతో అతలాకుతలం అయిన శ్రీకాకుళం జిల్లాను ఆదుకునేందుకు టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ ముందుకొచ్చారు. తుపాను బాధితులకు తనవంతు సాయం ప్రకటించాడు. ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.5 లక్షలు అందించాడు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా తెలిపారు.

తూర్పుగోదావరి : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఏపీలో మొదటి సారిగా జనసేన కవాతు కార్యక్రమం నిర్వహించనున్నారు. పవన్ ఈనెల 15న విజ్జేశవరం మీదుగా పిచ్చుకలంకకు వెళ్లనున్నారు.

కృష్ణా : జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. కొండపల్లి గ్రామంలో భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 4.2గా నమోదు అయింది. ప్రజలు భయంతో ఒక్కసారిగా ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.

శ్రీకాకుళం : తిత్లీ తుపాన్ శ్రీకాకుళం జిల్లాలో బీభత్సం సృష్టించింది. తిత్లీ వల్ల పలువురు మృతి చెందారు. తుపాన్ తో అపార నష్టం వాటిల్లింది. తిత్లీ తుపాను దెబ్బ నుంచి ఉద్దానం వాసులు తేరుకోలేదు.

గుంటూరు : జిల్లాలోని దొంగలు రెచ్చిపోయారు. చిలకలూరిపేటలో దోపిడీకి పాల్పడ్డారు. బగారం, నగదుతో ఉడాయించారు. చిలకలూరిపేటలో రాచుమల్లు నగర్ లోని సిద్దాబత్తుని వెంకట రమణ అనే వ్యక్తి ఇంట్లోకి దొంగలు చొరబడ్డారు.

హైదరాబాద్: ఏపీలో టీడీపీ నేతల ఇళ్లు, సంస్థలపై ఐటీ దాడులు జరగడం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. ఆ మధ్యన నెల్లూరులో టీడీపీకి చెందిన బీదా సోదరుల సంస్థలపై దాడులు చేసిన అధికారులు కొంత గ్యాప్ తీసుకుని మళ్లీ రంగంలోకి దిగారు.

శ్రీకాకుళం : మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి ఘోర ప్రమాదం తప్పింది. ఆయన ప్రమాదపు అంచుల్లో నుండి బయటపడ్డారు. హరిపురం వద్ద ఆయన ప్రయాణిస్తున్నవాహన టైర్లు పేలిపోయి డివైడర్ మీదకు దూసుకెళ్లింది.

గజపతినగరం: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇడుపుల పాయనుంచి ఇచ్చాపురం దాకా చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఆదివారం నాడు 285వ రోజు విజయనగరంజిల్లా గజపతి నియోజక వర్గం కొమటిపల్లి నుంచి ప్ర్రారంభమైంది. చంద్రబాబు నాయుడు అబ్దదప

హైదరాబాద్ : టీడీపీ ఎంపీ సీఎం రమేష్ నివాసంపై జరుగుతున్న ఐటీ దాడులు ముగిశాయి. కానీ ఆయనకు చెందిన రుత్విక్ ప్రాజెక్టు కార్యాలయాల్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి.

Pages

Don't Miss