ఏపీ వ్యవసాయ బడ్జెట్ రూ. 28 వేల 866.23 కోట్లు

Submitted on 12 July 2019
AP agriculture budget 2019 Botsa Satyanarayana

ఏపీ అసెంబ్లీలో 2019-20 ఆర్థిక సంవత్సరానికి వ్యవసాయబడ్జెట్‌ను మంత్రి బోత్స సత్యనారాయణ ప్రవేశ పెట్టారు. వ్యవసాయ రంగానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తుందని...రైతు సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధి రెండు కళ్లుగా భావంచి..ఒక ప్రణాళికబద్ధంగా ముందుకెళుతామన్నారు. మొత్తం రూ. 28 వేల 866.23 కోట్లతో బడ్జెట్ ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. 

రైతు భరోసా : రైతు భరోసా కింద రైతులకు రూ. 12 వేల 500 సహాయం ఇస్తామన్నారు. రైతు అవసరాల దృష్ట్యా అక్టోబర్ 15 నుంచి ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ఇందుకు బడ్జెట్‌లో రూ. 8 వేల 7500 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కౌలు రైతుల సంక్షేమ కోసం ప్రభుత్వం విఫలం చెందిందని..కౌలు రైతులకు పత్రం తీసుకరావడానికి ప్రయత్నం చేస్తుందన్నారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకం నోటిఫై చేస్తుందని..బడ్జెట్‌లో 11 వందల 63 కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు. 

రైతులందరికీ వడ్డీ లేని రుణాలు : వడ్డీ లేని పంట రుణాలు ఇస్తామని..కౌలు రైతులు తీసుకున్న రుణాలకు కూడా వర్తిస్తుందన్నారు. 11 నెలల కాలంలో రుణం చెల్లిస్తే..వడ్డీ లేకుండా ప్రభుత్వం వడ్డీ చెల్లిస్తుందని...3 లక్షల వరకు అయితే..పావలా వడ్డీ చెల్లించడం జరుగుతుందన్నారు. 

రైతులకు ఆర్థిక సహాయం : రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు రూ. 7 లక్షల ఆర్థిక సహాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని..ప్రమాదవశాత్తు మరణిస్తే..వైఎస్ఆర్ బీమా పథకం పేరిట రూ. 7 లక్షలు అందిస్తామన్నారు. రైతులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దన్నారు. ఇందుకు కోసం రూ. 100 కోట్లు బడ్జెట్ ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు మంత్రి బోత్స. 

AP agriculture budget
2019
Botsa Satyanarayana


మరిన్ని వార్తలు