రైతే దేవుడు : వ్యవసాయ బడ్జెట్ హైలెట్స్ ఇవే

Submitted on 12 July 2019
AP agriculture budget 2019 Highlights Botsa Satyanarayana

ఏపీ వ్యవసాయ బడ్జెట్‌ను మంత్రి బోత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అసెంబ్లీలో 2019, జులై 12వ తేదీ శుక్రవారం ప్రవేశ పెట్టిన వ్యవసాయ బడ్జెట్ రూ. 28 వేల 866.23 కోట్లుగా ప్రకటించారు. రెవెన్యూ వ్యయం రూ.27,946.65 కోట్లు కాగా.. పెట్టుబడి వ్యయం రూ.919.58 కోట్లుగా ఉన్నట్లు తెలిపారు. 

వ్యవసాయ బడ్జెట్ హైలెట్స్ ఇవే :
ధరల స్థిరీకరణ నిధి : దిగ్గుబాటు ధర వస్తేనే రైతులు సంతోషంగా ఉంటారని..అలాకాకపోతే..వారు తీవ్రంగా నష్టపోతారని మంత్రి బోత్స సత్యనారాయణ తెలిపారు. ఇందుకు 3 వేల కోట్ల బడ్జెట్ ప్రవేశించినట్లు తెలిపారు. 
అగ్రికల్చర్ మిషన్ : సీఎం జగన్ అధ్యక్షతనలో ఈ మిషన్ పనిచేస్తుందని వెల్లడించారు. వ్యవసాయ పరిస్థితులను సమీక్షిస్తూ...రైతుల సమస్యలు తెలుసుకొనేందుకు కమిషన్ పనిచేస్తుందన్నారు.
విపత్తు సహాయ నిధి : రైతులను సకాలంలో ఆదుకొనేందుకు ప్రకృతి విపత్తులసహాయ నిధి ఏర్పాటు చేసి..దీనికి బడ్జెట్‌లో రూ. 2వేల కోట్లు ప్రతిపాదిస్తున్నట్లు చెప్పారు.
> జాతీయ ఆహార భధ్రతా మిషన్ కోసం రూ. 141.26 కోట్ల బడ్జెట్ కేటాయిస్తున్నట్లు చెప్పారు. 
> వ్యవసాయ అనుబంధ రంగాలకు, రాష్ట్రీయ వికాస్ యోజన పథకం ద్వారా..రూ. 341 కోట్లు బడ్జెట్ కేటాయిస్తున్నట్లు తెలిపారు.
> నాణ్యమైన విత్తనాలు అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని..ఇందుకు రూ. 200 కేటాయింపు చేస్తున్నట్లు వెల్లడించారు.
> ఎరువులు, పురుగులు, ఇతరత్రా వాటిని ముందే పరిక్షీంచేందుకు ప్రభుత్వం పలు టెస్టింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
> ఖరీదైన యంత్రాలు, వ్యవసాయ పరికరాలు అందిస్తామని..ఇందుకు బడ్జెట్‌లో రూ. 460.05 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. 
> అగ్రికల్చర్ అసిస్టెంట్ పోస్టులు ఏర్పాటు చేస్తామని..పశుసంవర్థక పోస్టులు భర్తీ చేస్తామన్నారు. 
> ఆచార్యా ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీకి రూ. 29 కోట్లు. 
> ఉద్యానవన శాఖకు రూ. 1532 కోట్లు కేటాయింపు.
> ఉద్యాన విశ్వవిద్యాలయానికి రూ. 63.60 కోట్లు.
> పట్టు పరిశ్రమకు రూ. 158.46 కోట్లు.
> పశుసంవర్థక శాఖకు రూ. 1077.88 కోట్లు.
> ఆయిల్ ఫాం రైతులకు ధరల్లో వ్యత్యాసం తగ్గించేందుకు అదనంగా రూ. 80 కోట్లు.
> రైతులకు తుంపర, బిందు సేద్యం పథకాలకు రూ. 1105.66 కోట్లు.
> సహకార రంగం అభివృద్ధి కోసం పెట్టుబడి వ్యయం రూ. 60 కోట్లు.
> శ్రీ వెంకటేశ్వర పశు వైద్య విశ్వ విద్యాలయానికి రూ. 87 కోట్లు. 
> మత్స్యశాఖకు రూ. 409 కోట్లు. 
> వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు రూ. 3012.34 కోట్లు.
> పగటి పూట 9 గంటల ఉచిత విద్యుత్ సరఫరాకు రూ. 4525 కోట్లు.

AP agriculture
Budget 2019
highlights
Botsa Satyanarayana


మరిన్ని వార్తలు