సీఎం జగన్ హామీ : ఒకే విడతలో రూ.8వేల కోట్ల వడ్డీ మాఫీ

Submitted on 11 July 2019
AP Assembly Budget Session | YS Jagan Mohan Reddy | Chandrababu Naidu | Day 1

రైతు రుణాలపై గత పాలకులు మాట మార్చారని.. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పథకాన్ని అమలు చేయబోతున్నట్లు సీఎం జగన్ వెల్లడించారు. వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా పథకంతో రైతులకు మేలు జరుగతుందన్నారు. రూ. 12 వేల 500 అక్టోబర్ 15వ తేదీ నుంచి రైతులకు అందించబోతున్నట్లు ప్రకటించారు. రబీ సీజన్ నుంచి అమలు చేస్తున్నట్లు..16 లక్షల మంది కౌలు రైతులకు రైతు భరోసా పథకం వర్తిస్తుందని..ఒకే విడతలో 8 వేల 750 కోట్ల అందచేయబోతున్నామన్నారు. ఇది అమలు చేయడం ఒక రికార్డు అన్నారు. ఏపీ చరిత్రలోనే కాదు..29 రాష్ట్రాలు..ఏడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఇది అమలు చేయడం ఒక రికార్డు అన్నారు సీఎం జగన్. 

2019, జులై 11వ తేదీ గురువారం ఏపీ అసెంబ్లీలో కరువుపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ సుదీర్ఘంగా ప్రసంగించారు. గత ప్రభుత్వం చేసిన పనులు ఎలా ఉన్నాయో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సభలో వివరించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం చేపట్టిన పథకాలు, కార్యక్రమాలు..భవిష్యత్ లో చేపట్టబోయే వాటి గురించి సీఎం జగన్ వివరించారు. 

 > ఆక్వా రైతులకు ఒక యూనిట్ కు రూ. 1.50 కే విద్యుత్. 
 > పాత బకాయిలకు జమ చేసుకోకుండా ఒక నిబంధన తీసుకొస్తున్నామన్నారు. 
 > 11 నెలల పాటు సాగు ఒప్పందం ఉండేలా కౌలు రైతు చట్టంలో మార్పులు తీసుకొస్తున్నాం..దీనివల్ల వారికి మేలు జరుగుతుంది. 
 > రూ. 3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు
 > వ్యవసాయ ట్రాక్టర్లకు రోడ్ ట్యాక్స్ రద్దు. 
 > రైతుల రుణాలు రూ. 1.49 లక్షల కోట్లకు పెరిగిపోయాయి. 
 > పంటల ధరలు తెలుసుకొనేందుకు ఎమ్మెల్యేలనే గౌరవ ఛైర్మన్లుగా నియమిస్తున్నాం
 > సహకారంగాన్ని పునరుద్దిరిస్తున్నాం.
 > ధాన్యం సేకరణలో గత సంవత్సరం పెట్టిన బకాయిలను చెల్లిస్తున్నాం.

AP Assembly
Budget Session
Ys Jagan Mohan Reddy
Chandrababu Naidu
Day 1


మరిన్ని వార్తలు